▪️ సినీ ప్రముఖుల సమక్షంలో కన్నడ వెర్షన్ టీజర్ విడుదల
▪️ వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు
▪️ 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో షూటింగ్
సౌతిండియా ప్రేక్షకుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ కలగలిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది. ఈ వేడుకకు ‘దేవి’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటి ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్ పూజా గాంధీ, కన్నడ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ఆర్.కె. విశ్వనాధ్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎన్.ఆర్.కె. విశ్వనాధ్, దర్శకుడు సంజీవ్ మేగోటి పదేళ్ల తర్వాత మళ్లీ ఒక మంచి కథతో కన్నడ ఇండస్ట్రీలోకి రావడం ఆనందంగా ఉందని అభినందించారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నటి ప్రేమ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నటి రాగిణి ద్వివేది మాట్లాడుతూ, ‘పోలీస్ కంప్లైంట్’ కథ ఎంతో ఆసక్తికరంగా ఉందని, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.











