యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న “భగవంతుడు” సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర టీజర్ ను ఈ రోజు హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జి.జి. విహారి మాట్లాడుతూ – నేను సినిమా పాత్రికేయుడిగా కెరీర్ స్టార్ట్ చేశా. “భగవంతుడు” మూవీ టీజర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. నాతో ట్రావెల్ చేసిన నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్. నేను ఈ సినిమా విషయంలో వేణు ఊడుగుల అన్నకు, రవి పనస అన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. చిన్నగా మొదలైన ఈ కథతో క్రమంగా చాలా బిగ్ మూవీ చేశాం. ఈ కథను తిరువీర్ కు నెరేట్ చేసినప్పుడు ఫస్టాఫ్ విని సెకండాఫ్ నీకు నచ్చితే చెప్పు లేకుంటే లేదు అన్నారు ఆయనకు అంత బాగా స్టోరీ మీద నమ్మకం కుదిరింది. ఫరియా అబ్దుల్లా గారి నెంబర్ తీసుకుని స్క్రిప్ట్ ఆమెకు మెసేజ్ చేశా. వెంటనే ఆఫీస్ కు వచ్చారు. అలా ప్రతి ఒక్కటీ ఈ మూవీకి కుదిరాయి. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన చుట్టూ ఉన్న, సమాజం ఉన్న వైరుధ్యాలు తెలుసుకునేందుకు కథలు చెబుతాం. ఈ అవగాహనతో నేను రూపొందించిన చిత్రమిది. తిరువీర్, రిషి, ఫరియా అబ్దుల్లా ..ఈ ముగ్గురూ సినిమాకు ఫిల్లర్స్ లా ఉన్నారు. పల్నాడు యుద్ధాన్ని తెలుగు మహాభారతం అంటారు. మన రూట్స్ అన్నీ పల్నాడులోనే ఉన్నాయి. తెలుగు వారు మర్చిపోయిన వైరుధ్యాలు పల్నాడులోనే పుట్టాయి. ఇప్పటికీ అక్కడ కత్తుల్ని దైవాలుగా కొలుస్తారు. వెయ్యేళ్ల కిందటే మన సమాజంలోని అంతరాలకు సమాధానం పల్నాడులో చెప్పడం జరిగింది. అందుకే ఈ సినిమాకు పల్నాడు బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను అన్నారు.











