‘మన శంకర వరప్రసాద్ గారు’తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి. “మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి, అలాగే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక అభినందనలు. సంక్రాంతికి మరో ఘన విజయాన్ని అందించిన ఆయన ప్రతిభ ప్రశంసనీయమైనది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే తెరపై కలిసి కనిపించడం ప్రేక్షకులకు నిజంగా అపూర్వ ఆనందాన్ని కలిగించింది. ఈ చిత్రం సాధించిన అద్భుత విజయం పట్ల సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లవెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.











