వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా “అహోం”. ఈ చిత్రాన్ని ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ – డైరెక్టర్ ప్రసాద్ రాజు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా పలు భాషల్లో రూపొందడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు సినిమా ఒక్క భాషలో చేస్తే వర్కవుట్ కావడం లేదు. హిందీతో పాటు దక్షిణాది అన్ని ప్రధాన భాషల్లో “అహోం” సినిమాను రూపొందిస్తున్నారు. బెంగాళీ, మరాఠీ వంటి భాషలతో పాటు ఈ చిత్రానికి ఇంగ్లీష్ లోనూ డబ్ చేయాలని సూచిస్తున్నా. నిర్మాత దశరథ్ కి కంగ్రాట్స్. కొత్త నిర్మాతలు బాగుంటేనే మరిన్ని చిత్రాలు తెరకెక్కి ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న వారికి ఉపాధి కల్పిస్తాయి. “అహోం” సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నా అన్నారు.











