రేస్ గుర్రం అనే పేరు వినగానే వచ్చే వైబ్‌నే వేరు. విడుదల సమయంలో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ మాత్రం అసాధారణం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శృతి హాసన్‌ల మధ్య సీన్స్ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్–బ్రsruthiహ్మనందం కాంబినేషన్ సన్నివేశాలు మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ఏప్రిల్ 8 న మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వర రావు కలిసి శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతాన్ని అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఈ రీ-రిలీజ్ బాధ్యతలను క్రౌన్ మూవీస్ తీసుకుని, గ్రాండ్‌గా ఈవెంట్‌ను నేడు నిర్వహించారు.











