విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ “రణబాలి”. ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. నేషనల్ క్రష్ రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఈ వీడియోలో రశ్మిక ఎంత సహజంగా జయమ్మగా మారిపోయిందో చూపించారు. రణబాలి బలం జయమ్మ, అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ ఈ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తోంది. రణబాలి ఇటీవలే అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.











