టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ‘రేజర్’ సోషల్ మీడియాలో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది. టైటిల్ వీడియో, విజువల్స్, అందరిలో క్యురియాసిటీ పెంచాయి. ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ బజ్ లభించడంతో ప్రేక్షకులలో అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.
మేకర్స్ ‘రేజర్’ షూటింగ్‌ను ఫిబ్రవరిలో పూర్తి చేశారు. పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉంది. థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర బృందం ‘రేజర్’ వరల్డ్ ని పరిచయం చేసేలా ఆకట్టుకునే కొత్త పోస్టర్లను విడుదల చేసింది. కొత్త పోస్టర్లు ‘రేజర్’ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అర్బన్, ఇండస్ట్రియల్ షాడోస్ మధ్య ఇంటెన్స్ పవర్ ఫుల్ గా కనిపించిన రవిబాబు లుక్ ఆకట్టుకుంది. ఒక పోస్టర్‌లో చిన్నారి చేతిని పట్టుకుని వీధిలో నడుస్తూ కనిపించడం సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శకుడు రవి బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ ని పంచుకున్నారు. తన తండ్రి చలపతి రావు గారి జయంతి అయిన మే 8, 2026న ‘రేజర్’ విడుదల కానుందని ప్రకటించారు.











