యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘గుర్తుకొస్తున్నాయి’. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శరత్ కి గుడ్ లక్. కచ్చితంగా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. విరాజ్ కి హ్యాపీ బర్త్డే. గ్లింప్స్ చాలా బాగుంది. డైరెక్టర్ వినోద్ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ. ఈటీవీ విన్ గత రెండు సంవత్సరాలుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మేము సంవత్సరానికి ఒక హిట్ తీయడానికి కష్టపడుతుంటే సంవత్సరానికి మూడు నాలుగు ఇట్లు కొడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. లిటిల్ హార్డ్స్, రాజు వెడ్స్ రాంబాయి.. ఇలా అన్ని చిత్రాలు గొప్ప విజయాలు సాధించాయి. ఈ విజయాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నితిన్ గారు సాయి గారు గ్రేట్ వర్క్ చేస్తున్నారు. చిన్నప్పుడు నుంచి ఈటీవీ అంటే అభిమానం. శ్రీవారికి ప్రేమలేఖ మయూరి పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆ సంస్థ నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి విజయవంతమైన చిత్రాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం 16 సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. మంచి ప్రతిభ ఉన్న వారికి ఈటీవీ విన్ గొప్ప వేదికగా నిలుస్తోంది. ‘గుర్తుకొస్తున్నాయి’ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.











