వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వం వహించారు. 90’s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్ తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న డైరెక్ట్ ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్ & సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్న వెంటనే నచ్చింది. ఈటీవీ విన్ వాళ్ళకి పంపించాను. ఈ ప్రాజెక్టు నాకు అప్పచెప్పారు. ఈటీవీతో నాకు ఎంతో మంచి అనుబంధంగా ఉంది. నేను మళ్ళీ మీ ముందు కనిపించడానికి కారణం బాపినీడి గారు. ఆయన ప్రోత్సాహంతోనే 90’s వెబ్ సిరీస్ చేశాను. నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఈటీవీ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. సుధీర్ కొత్త దర్శకుడు అయినప్పటికీ కథను చాలా అద్భుతంగా చెప్పా.డు తను చెప్పిన కథను అద్భుతంగా తీస్తాడని నమ్మకం కూడా ఉంది. సుధీర్ కి నచ్చిన టీం తోనే ఈ సినిమా చేసాం. ఈ సినిమాలో చాలా పాపులర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా కూర్చుని ఒక సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. ఈ సాంగ్ 20 సంవత్సరాలు క్రితం విన్నది. వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకుని కంపోజిషన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ చాలా పాషన్ తో పనిచేశారు. ప్రిన్స్ బెస్ట్ యాక్టర్. ఈ సినిమా ద్వారా తను ఇంకో రకమైన షేడ్ లో చూస్తారా. అలాగే రఘుబాబు గారు ఆలీ గారు పృథ్వి గారు చమ్మక్ చంద్ర చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. లయ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అద్భుతంగా సపోర్ట్ చేసింది. మంచి హిట్ సినిమా అవ్వాలని చాలా కష్టపడింది. బండ్ల గణేష్ నా బ్రదర్ లాంటివారు. ఆయన పాదయాత్ర అద్భుతంగా జరుగుతోంది. ఈ సినిమాలో మంచి సాంగ్ చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.











