లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “లీడర్”. ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దర్శకుడు ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. “లీడర్” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. “లీడర్” మూవీ టీజర్ ఎలా ఉందో చూస్తే – నా కూతురితో పాటే నేనుండాలి, దాని కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తాను అనే పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది. తన కుటుంబం కోసం చేసిన పోరాటంలో హీరో ఖైదీగా మారడం, జైలులో కూతురినే గుర్తు తెచ్చుకుంటూ బాధపడటం టీజర్ లో చూపించారు. హీరో భార్య క్యారెక్టర్ లో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ అందమైన కుటుంబంలో ఎవరు తమ స్వార్థం కోసం చిచ్చు పెట్టారు అనేది టీజర్ లో ఆసక్తి కలిగిస్తోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే శక్తివేల్ అనే క్యారెక్టర్ లో హీరో శరవణన్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ కనబర్చారు. ఆయన చేసిన భారీ యాక్షన్ సీక్వెన్సులు టీజర్ కు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో “లీడర్” సినిమా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది.











