చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక బ్యానర్ యు.వి. క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఉత్సాహాన్ని పెంచుతూనే ఉంది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు సింగిల్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శర్వా బైకర్ కోసం టాప్ గేర్‌లోకి మారారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో చూస్తే ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డారో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడాయన శరీరం మరింత లీన్‌గా, అథ్లెటిక్‌గా కనిపిస్తోంది. చక్కగా తీర్చిదిద్దిన మిడ్‌సెక్షన్, కట్ షోల్డర్స్, డిఫైన్డ్ అప్పర్ బాడీ ఆయన నెలల తరబడి చేసిన కఠినమైన ట్రైనింగ్‌ను చూపిస్తున్నాయి. ఇది కేవలం లుక్ కోసం చేసిన మార్పు కాకుండా, పద్ధతిగా ప్లాన్ చేసిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్. మోటోక్రాస్ రేసింగ్ ప్రపంచాన్ని నిజంగా చూపించేందుకు శర్వా ప్రత్యేకమైన ట్రైనింగ్‌ను తీసుకున్నారు. ఆయన వర్కౌట్స్‌లో స్ట్రెంగ్త్ సర్క్యూట్స్, కోర్ స్టెబిలైజేషన్ ఎక్సర్‌సైజులు, ఎక్స్‌ప్లోసివ్ పవర్ డ్రిల్స్ ఉన్నాయి. భారీ టార్క్ ఉన్న మోటార్‌సైకిళ్లను అత్యంత వేగంతో నియంత్రించాల్సిన మోటోక్రాస్ రేసింగ్ కి తగినట్లు ఈ ట్రైనింగ్ రూపొందించబడింది.











