యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియెన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్‌కి సంబంధించింది. మా సినిమాకి ప్రేమను, ప్రశంసల్ని కురిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మీడియాకి థాంక్స్. పదమూడేళ్ల క్రితం నేను చూసిన యాక్సిడెంట్‌తో ఈ మూవీ లైన్ తట్టింది. ఒక పది సెకన్లు వెనకా ముందు అయినా కూడా ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు. అలా అక్కడి నుంచి ఈ ఐడియా పుట్టింది. చూసిన ప్రతీ ఒక్కరూ తమ జీవితాన్ని చూసినట్టుగా ఉందని అంటున్నారు. చెడులోనూ మంచి ఉంటుందని ఇందులోని పాత్రలు రియలైజ్ అవుతుంటాయి. ప్రతీ ఒక్కరి జీవితం ఒక జర్నీలాంటిదే. నాకు నటన అంటే ఏంటో తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. ఆ తరువాత యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ తరువాత దర్శకత్వం చేయాల్సి వచ్చింది. ‘జెంటిల్మెన్’తో స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ తరువాత మళ్లీ బాధ్యత పెరిగినట్టు అయింది. ‘సీతా పయనం’ అవుట్ పుట్, రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నాను. నా కూతురు అద్భుతంగా నటించింది అని ప్రశంసిస్తున్నారు. నేను అక్కడే పాస్ అయ్యాను. నేను గొప్ప సినిమా తీశాను అని కూడా చెప్పడం లేదు. కానీ మేం ఏం అనుకున్నామో అది జనాలకు కనెక్ట్ అయింది. నిరంజన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు.











