ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో “క్వీన్” మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్రలో 90’s హీరోల్లో ఒకరు నటించబోతున్నారు. అందంగా ముస్తాభైన యామిని, ఆనందభాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుత సొసైటీ తో ముడిపడి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రతన్ రిషి. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ… అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుంది. “క్వీన్” ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.











