మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ సంబరాల ఏటిగట్టుతో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ఈ రోజు శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా ఆయన్ని బ్రిటిషుగా పాత్రలో ప్రజెంట్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఆయన లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వెట్రివేల్ పళనిసామి అందిస్తుండగా, సంగీతాన్ని బి. అజనీష్ లోకనాథ్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను నవీన్ విజయకృష్ణ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను గాంధీ నడికుడికర్ రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న “సంబరాల ఏటిగట్టు” ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా నిలుస్తోంది.










