చార్మింగ్ స్టార్ శర్వా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతుంది బైకర్. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
బైకర్ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది కదా.. మీరు హీరోగా నటించిన సినిమా వస్తున్నప్పుడు ఉన్నంత టెన్షన్ ఉందా లేదా రిలాక్స్డ్ గా ఉన్నారా ?
చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఈ సినిమా మీరు యాక్సెప్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి ?
ముందుగా నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
మీకు బైక్స్ అంటే పర్సనల్ గా ఇష్టమా?
నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి ‘మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ) బైకర్ లో నా క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు మీరు సినిమాలోనే చూడాలి.
డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గురించి ?
అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.
ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్. కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్ ని అభినందిస్తారు.
ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.
శర్వానంద్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది? ఒక సీనియర్ హీరోగా మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు?
నేను నా డైలాగ్ నా క్యారెక్టర్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. అందరం మంచి కొలీగ్స్, ఫ్రెండ్స్ లాగా వర్క్ చేసాము.











