బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
డెకాయిట్ లో ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?
ఇందులో చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. ఒక యాక్టర్‌కు ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
-ఈ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జానర్ ఇది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను.
-సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
-నాకు ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అలాగే నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది.
-నాకు కొత్త ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్లు చేయాలనే తపన ఉంటుంది. డెకాయిట్ కూడా అలాంటి కొత్త జానర్ సినిమా.
కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?
కథ విన్నప్పుడు సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారో అనేది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ.
-ఈ సినిమాలో “రూబారు” పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేస్తాయి. పాటలన్నీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి.
-సీతారామంలో మీ క్యారెక్టర్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు డెకాయిట్ సినిమా ఎలాంటి అనుభవం ఇస్తుంది?
-ఈ సినిమాని శేష్ కోసం థియేటర్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఉంటుంది. శేష్ గారు, ప్రకాష్ రాజ్ గారితో కలిసి పనిచేయడం మంచి అనుభవం.
సీత క్యారెక్టర్‌కు సరస్వతి క్యారెక్టర్‌కు ఎలాంటి పోలికలు ఉన్నాయి?
ఈ రెండు పూర్తిగా భిన్నమైన పాత్రలు. సీత లాంటి పాత్రలో నన్ను ఇప్పటికే ఆడియన్స్ చూశారు. నన్ను కొత్తగా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తుంది.
హిందీ తెలుగులో షూట్ చేయడం గురించి?
ఈ సినిమా రెండు భాషల్లో షూట్ చేశాం. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ అన్నీ స్ట్రైట్ తెలుగు సినిమాలు. కానీ ఇది రెండు భాషల్లో చేయడం నాకు మరింత ఛాలెంజింగ్‌గా అనిపించింది.
అనురాగ్ కశ్యప్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
అనురాగ్ గారు అద్భుతమైన డైరెక్టర్. యాక్టర్‌గా కూడా చాలా వెర్సటైల్. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మేమిద్దరం హిందీ నుంచి వచ్చాం. కలిసి తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం మంచి అనుభవం.
శేష్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
శేష్ గారు స్వయంకృషితో ఎదిగిన స్టార్. అలాంటి సెల్ఫ్‌మేడ్ స్టార్‌తో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. రైటింగ్, డైరెక్షన్.. అన్నిట్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చాలా హంబుల్‌గా ఉంటారు.











