సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు చాలా మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, హీరో నిర్మాత సాయి సింహాద్రి, హీరోయిన్ మీరా రాజ్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి, డిస్ట్రిబ్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శోభారాణి మాట్లాడుతూ ‘‘సన్ ఆఫ్’ సినిమాను ముందుగా సాయి నా దగ్గరకు వచ్చినప్పుడు 5 థియేటర్స్‌లో విడుదల చేస్తే చాలనే ఆలోచనతో వచ్చాడు. కానీ తర్వాత నా వంతుగా అందరి డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడి దాన్ని దాదాపు 300 థియేటర్స్‌లో విడుదల చేసేలా సపోర్ట్ చేశాను అన్నారు. హీరో, చిత్ర నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ ‘యుఎస్ సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్‌గా ఉన్న నేను సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఇక్కడకు వచ్చాను. ఏడాదిన్నర పాటు ఇక్కడే ఉంటూ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సినిమాను విజయవంతంగా పూర్తి చేశాను. ఫిబ్రవరి 27న మూవీని రిలీజ్ చేయటం నా సక్సెస్‌గా నేను భావిస్తున్నాను. హీరోయిన్ మీరా రాజ్ సపోర్ట్‌కి థాంక్స్. శోభారాణిగారు అందించిన సపోర్ట్‌కు థాంక్స్’ అన్నారు.











