మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ #19 ఊహకు అందని స్థాయిలో రూపొందుతోంది. గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ సినీ ప్రియుల్లో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
#19 సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ ఫేజ్ కి నాంది పలుకుతోంది. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న ఆయన ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫస్ట్ పోస్టర్ సూచిస్తోంది.
దర్శక ద్వయం సుజిత్ & సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయిదుర్గతేజ్19తో వీరి విజన్ మరింత విస్తరించబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది. మిథిక్ సై-ఫై నేపథ్యంలో హై-ఆక్టేన్ కథనాన్ని మిళితం చేస్తూ, గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థ, మరోసారి ఒక డిఫరెంట్, అంబిషస్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తోంది.











