ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ ‘హే బల్వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకపోతుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈసందర్బంగా వంశీ నందిపాటి మాట్లాడుతూ ” ఎక్కడ షోలు వేసినా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లో ప్రీమియర్స్‌కు 100కె వరకు కలెక్ట్ చేసింది. చాలా పాజిటివ్‌గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ఫుల్స్ అయ్యాయి. మార్నింగ్తో పోల్చితే.. మ్యాట్నీకి కలెక్షన్లు పెరిగాయి. ఎంతో ఒత్తిడిలో ఉన్న వారికి హే బల్వంత్ సినిమా మెడిసిన్ లాంటంది ఎంతో హాయిగా మనసు తేలిక అవుతుంది. అందరూ ప్యామిలీస్‌తో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ మంచి సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు.











