ప్రముఖ దర్శకుడు దివంగత ఇ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నటులు ఆర్యన్‌రాజేష్, అల్లరినరేష్‌లకు తాతయ్య ఈదర వెంకట్‌రావు సోమవారం (జనవరి19) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. 90 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.
వెంకట్‌రావు భార్య వెంకటరత్నం 2019, మే27న మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా పెద్ద కుమారుడు దివంగత ఈవీవీ సత్యనారాయణ ప్రముఖ దర్శకుడు, రెండో కుమారుడుఇ.వి.వి.గిరి, మూడో కుమారుడు ఇ.వి.వి. శ్రీనివాస్ కుమార్తె ముళ్ళపూడి మంగాయమ్మ. ప్రముఖ నటులు ఆర్యన్‌రాజేష్, అల్లరి నరేష్‌లకు ఆయన స్వయానా తాతగారు. తమ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటప్పయ్య పార్ధివ దేహానికి నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో (సోమవారం సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.











