‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ వేడుకకు హాజరైన అభిమానులకు, లైవ్ లో వేడుకను వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైనవి. నాకు అన్నం పెట్టింది సినిమా. ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకు ఆనందం కలగాలని కోరుకుంటాను. సినిమా ఎంత వసూలు చేసింది అని నేను ఎప్పుడూ పట్టించుకోను. సినిమా బాగుండాలని కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా అని చూడను.. భారతీయ సినిమా అనుకుంటాను నేను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంటుంది. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి నా కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్ చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా.. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమాను పూర్తి చేశాము. 40-45 రోజుల్లోనే సినిమా పూర్తి చేశాము. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము అడగడానికి ఆలోచిస్తుంటే, మీ సినిమా పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అనుకున్నప్పటి నుంచి దీనికి దర్శకుడు హరీష్ శంకర్ కావాలని అనుకున్నాను. గబ్బర్ సింగ్ ని మించేలా ఈ సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ఇది పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎంటర్టైనర్ సినిమా. మార్చి 19న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అన్నారు.











