అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘VISA – వింటారా సరదాగా’ చిత్రం నుండి తొలి గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదలైంది. విన్న తక్షణమే శ్రోతల హృదయాలను గెలుచుకుంటూ, అన్ని వేదికల్లోనూ విశేష స్పందనను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే టీజర్ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచేయగా, ఇప్పుడు ఈ మధుర గీతం చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ‘అనగా అనగా అమెరికా’ గీతం తక్షణ చార్ట్‌బస్టర్ అనడంలో సందేహం లేదు. మధురమైన సంగీతం, హృదయాన్ని తాకే సాహిత్యం, మనోహరమైన గానం, ఆకట్టుకునే విజువల్స్ – ఇవన్నీ కలిసి ఎప్పటికీ మరిచిపోలేని ఒక అద్భుతమైన సంగీత అనుభూతిని అందిస్తున్నాయి. ఈ పాటకు సనారె రాసిన సాహిత్యం వినసొంపుగా, అందరూ అనుభూతి చెందేలా ఉండి, శ్రోతల మనసులను తాకుతోంది. “అనగా అనగా అమెరికా.. కథ మొదలిక.. మది గదులని తెరువగా..” అంటూ అంటూ సాగిన సాహిత్యం కట్టిపడేసింది. ప్రతిభావంతులైన గాయకుడు సంజిత్ హెగ్డే తన మధుర గానంతో ఈ పాటకు ప్రాణం పోశారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఎప్పటికీ నిలిచిపోయే శ్రావ్యమైన పాటలను రూపొందించడంలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. తెరపై అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ మధ్య కుదిరిన సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెరపై వారి జంట చూడటానికి చాలా బాగుంది. పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో అశోక్ గల్లా చక్కగా ఒదిగిపోయారు. ఆ పాత్రకు తగ్గట్టుగా నిజాయితీ, ఆప్యాయతలను చక్కగా ప్రదర్శించారు. శ్రీ గౌరీ ప్రియ తన సహజమైన అందం, అభినయంతో తెరను ప్రకాశింపజేశారు. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల మనసులను తాకే ఓ మధురమైన ప్రేమానుభూతిని అందిస్తున్నారు.











