‘లిటిల్‌హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు. ఈ మూవీలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇప్పటి వరకు మా ‘హే బల్‌వంత్’ మూవీ గురించి చాలా సార్లు చాలా వేదికలపై చెప్పాం. 650 పైగా స్క్రీన్లలో మా సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. ఇది మా కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం. రేపు రిలీజ్ అవుతుండగా.. గురువారం సాయంత్రం నుంచే చాలా చోట్ల పెయిడ్ ప్రీమియర్లను స్టార్ట్ చేశాం. అన్ని ఏరియాల్లో ఈ పెయిడ్ ప్రీమియర్లను ప్లాన్ చేశాం. వన్ మంత్ డైట్ చేయాల్సిన అవసరం లేకుండా.. వన్ మంత్ జిమ్, రన్నింగ్‌కి వెళ్లాల్సిన పని లేదు. ఒక్క మూడు గంటలు మాకిస్తే.. వన్ మంతకి సరిపడే ఆరోగ్యాన్ని మేం మీకు ఇస్తాం.. మా దగ్గర మంచి స్టోరీ, మంచి ఎమోషన్ ఉంది. మా దగ్గర మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. అందరూ వచ్చి హాయిగా నవ్వుకుని వెళ్లండి. మేం కచ్చితంగా హిట్టు కొట్టబోతోన్నామ’ని అన్నారు.











