యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో నిర్వహించారు. స్టూడెంట్ తో డాన్సులు చేసిన హీరో హీరోయిన్.. ఆపై ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించి అందరిలో జోష్ నింపారు. హీరో చంద్రహాస్ మాట్లాడుతూ .. ”మా సినిమా ప్రమోషన్స్ ఈ కాలేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న బారాబర్ ప్రేమిస్తా సినిమాతో విక్టరీ కొట్టబోతున్నాం అని నమ్మకంగా చెబుతున్నా. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని తెలిపారు.











