తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తన ఆర్కే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ చిత్రంలో ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి తో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ చిత్ర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి, దర్శక నిర్మాత డా, ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – పూజ నర్వాల్ వుమెన్ కబడ్డీ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడలిస్ట్. నేను మన టీమ్ కు కోచ్ గా ఉన్నాను. ప్రో కబడ్డీ లీగ్ కు కోచ్ గా పనిచేశాను. త్వరలో వుమెన్ ప్రో కబడ్డీ లీగ్ కూడా రాబోతోంది. “మహిళా కబడ్డీ” సినిమా కోసం ఆర్కే గౌడ్ నన్ను అప్రోచ్ అయ్యారు. మేమిద్దరం ఈ చిత్రం లో నటిస్తున్నాము. నాకు తెలిసిన విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇది మహిళల కబడ్డీ మూవీ కాబట్టి పూజ నర్వాల్ ను సంప్రదించి ఆమెతో ఈ కార్యక్రమంలో మాట్లాడిస్తే బాగుంటుందని అనుకున్నాం. క్రికెట్ తర్వాత కబడ్డీకే ఎక్కువ ఆదరణ ఉంది. క్రికెట్ లో మహిళల జట్టు ఎలా రాణిస్తున్నారో కబడ్డీలోనూ అలాగే ప్రతిభ చాటుతున్నారు అన్నారు.











