• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, September 16, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

ఆంధ్రపత్రిక బండిల్లో ఇమిడ్చి పోరాట పత్రాలు

Taza Cinema by Taza Cinema
2025-04-22
in Interviews
Reading Time: 2 mins read
0 0
A A

3.‘‌జనధర్మో’ విజయతే

madabusi sreedharచదువు వదులుకోవడం ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితులతో రకరకాల ఆలోచనాలను రేకొత్తించడం వంటితో ఆయన యవ్వన దశలో ఆచార్య జీవనం మరో దారికి పోయింది.  అటూ ఇటూ నడిచి చివరకు పాత్రికేయ రంగానికి నిలబడిపోయారు. యం.యస్‌.ఆచార్య గారికి డిగ్రీలు లేవు. కాని చదువుల తల్లి వారింటి ఇలవేలుపు. వారిది పండితుల కుటుంబం. శ్రమతో అధ్యయం చేసి, విద్యా విజ్ఞానాన్ని ఆర్జించి వాటిని పది మందికి పంచి పెట్టిన విజ్ఞానదాతలు పరమ పూజనీయులు వారి పూర్వీకులు. ఉభయ వేదాంత విద్వాంసుల్కెన శ్రీ మాడభూషణం శ్రీ రంగాచార్యులు గారు. వీరి తాతగారు వరంగల్లు జిల్లా మానుకోట తాలూకాలోని నెల్లికుదురు గ్రామంలోని నాయిని వారింట్లో వంట వండి అక్కడ ప్రసాదం వెంట తీసుకొని అమ్మాపురం గ్రామం కొండమీది శ్రీ సీతారామస్వామికి ఆరగింపు పెట్టి అక్కడి నుండి మాటేడు గ్రామానికి వెళ్లి ఆ గ్రామ వాసి జులిజాల నరసయ్య గారి వద్ద పాఠాలు చదువుకొని, సాయంత్రానికి తిరిగి స్వగ్రామం చేరడం తాతగారి దినచర్య. ఇంత కష్టపడి చదివిన చదువు, భక్తితో కూడిన ప్రభు సేవ తర్వాతి కాలంలో వారిని ఆచార్య పురుషులను చేసింది. దాదాపు 14 గ్రామాలలో ఆచార్య గారికి శిష్యగణం ఉండేది. అనేక గ్రామాలలో సంప్రదాయ ధర్మ ప్రబోధాల ద్వారా ఆచార్యత్వం నెరపి పల్లకీ సేవలను పొందారు శ్రీ శ్రీరంగాచార్యులు గారు. 14 గ్రామాలలో భూములను సంపాదించారు. తాను వంట చేసిన గ్రామంలో వంట అయ్యవారుగా గుర్తింపు పొందిన శ్రీ రంగాచార్యులు గారు ఆ గ్రామంలోనే పెద్ద అయ్యవారుగా కీర్తింపబడ్డారు. ఇప్పటికీ వీరి కుటుంబీలకులకు ఈ పేరుతోనే ఆ గ్రామంలో గుర్తింపు ఉన్నది.
శ్రీ రంగాచార్యులు గారి ముగ్గురు సంతానంలో రెండవ వారు శ్రీ ప్రసన్న రాఘవాచార్యులు. వీరు కూడా సం స్కృత విద్యాపారంగతులు. బహు ముఖ ప్రజ్ఞాశాలురు. స్వయం సాధనతో గడి యాల రిపేరు వంటి సున్నితమైన పనులు మొదలు ఆయుర్వేద వైద్య వృత్తి వరకు కొనసా గించారు. వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరి రెండవ సంతానమే శ్రీ యం.యస్‌. ఆచార్యగారు. చదువుకునే అవకాశం లేదు. అట్లా అని ఉద్యోగం కూడా సిద్ధంగా లేదు. అనేక బాధలతోపాటు పేదరిక బాధను తట్టుకోలేని దశలో ప్రసన్న రాఘవాచార్య గారు సకుటు ంబంగా మకాం నెల్లికుదురుకు వదిలి అక్కడి నుండి ఉదరపోషణార్థం అందరూ వరంగల్‌ ‌చేరుకున్నారు. ఆ సమయంలోనే భాష్యాంతం అధ్యయనం చేసి, స్వయంకృషితో సంగీతాన్ని కూడా నేర్చుకున్న ఆచార్యగారి అన్నగారు శ్రీ వెంకటనరసింహాచార్యులు సంగీత పాఠాలు నేర్పి ఆర్జించడం ప్రారంభించారు. కొన్నా వీరి తండ్రిగారు కూడా సంస్కృతం సంగీతం నేర్పుతూ, నాటకాలు వ్రాసి ప్రదర్శిస్తూ గడిరచారు. చివరకు ఇంత పెద్దకుటుంబాన్ని ఈదలేని స్థితిలో శ్రీ ఆచార్యగారికి కూడా చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగయత్నం చేసుకోకతప్పలేదు.
image.png
12 రూపాయల జీతం
యం యస్‌ ఆచార్య మొదటి ఉద్యోగం లక్ష్మణ్‌ ‌సాపవార్‌ ‌వద్ద కాంపౌండర్‌గా 12 రూపాయల జీతానికి పనిచేశారు. మందులు నూరడం, కషాయాలు కరుగబెట్టడం ప్రధాన ఉద్యోగ విధులుగా ఉండేవి. అదే సందర్భంలో బచ్చెవాల శ్రీ రాజన్నాగారితో పరిచయమేర్పడి సికింద్రాబాద్‌ ‌వెళ్లడమైంది, అక్కడి బచ్చెవాలా హిరేన్‌ ‌ముడి సిల్కు జరీషాపులో నెలకు 15 రూపాయల వేతనానికి పనికుదిరింది. ఈ వ్యాపార నిమిత్తం, సూరత్‌, ‌ధర్మవరం, గఢక్‌ ‌బెంగుళూరు, మద్రాసు, కంచీపురం, సేలం మొదల్కెన పట్టణాలు తిరిగిరావలసి వచ్చేది. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేస్తున్న శ్రీ ఆచార్య గారి అంతరాంతరాళాల్లో, ఉన్నత విద్యాసము పార్జనపట్ల కాంక్ష తట్టి లేపుతుండేది. దేశం కోసం ప్రజల కోసం, ఏదో చేయాలి అందువల్లే సికింద్రాబాద్‌లో తమ షాపునకు ఎదురుగా ఉన్న మడూరి లైబ్రరీ, వారిని సునాయాసంగా ఆకర్షించింది.
అక్కడికి తరుచూ వెళ్తుండేవారు. ఆ గ్రంథాలయం మేడపైన ‘ఉమర్జీకర్‌’ అనేవ్యక్తి ‘‘హిందూ సేవా సంఘం’’ అనే సంస్థను నడిపేవారు. దేశం కోసం ప్రజల కోసం, ఏదో చేయాలి. ఏదో సాధించాలనే తపన శ్రీ ఆచార్యగారి మనస్సును ఆ సంఘం వైపులాగింది. ఉమర్జీకర్‌ ‌గారితో పరిచయం…. ఈ సంస్థ పట్ల ఉత్సుకత పెరగసాగింది. ఆ రోజుల్లో నాగపూర్‌ ‌సైనిక్‌ ‌స్కూలుకు చెందిన డా. మూరాజీ సికింద్రాబాద్‌ ‌వచ్చి నారు. ఆయన దేశ ఆర్థిక స్థితిగతులపై చేసిన ఉపన్యాసం ఆచార్యగారిని దీర్ఘంగా ఆలోచింపజేసింది, పర్యవసానంగా ఆర్గన్కెజేషన్‌లో చేరడానికి నిర్ణయిం చుకున్నారు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి వరంగలు చేరుకున్నారు.  యువకులకు సంబంధించిన ఆర్గనైజేషన్సును వ్యవస్థీకరించే కార్యక్రమంలో నిమగ్నమై నారు. వ్యాయామశాలలు, క్రీడలు, ఆటలపోటీలు నిర్వహించేవారు. ఉన్నత స్థాయిలో ఈ పోటీల నిర్వాహణ జరిగేది, వీణిని నిర్వహించే సమయంలో ఆర్గన్కెజర్స్ ‌లేదా వాలంటీర్స్ అవసరమయ్యే వారు వారిని సమీకరించేవారు.
శ్రీ ఆచార్యగారు ఇటువంటి సమీకరణ నుండి ఆవిర్భ వించిందే ‘‘ప్రతాప రుద్రదళం’’ ఆచార్యగారికి (పటుకారీలు) ఖత్రీల ప్రైవేటు పాఠశాలలో టీచరుగా ఉద్యోగం లభిం చింది. నెలకు 25 రూపాయల జీతం. ఖత్రీల సంఘం, హిం దూ సేవాసంఘం. ప్రతాపరుద్ర దళం, వ్యాయామ క్రీడలు అన్ని టినీ వ్యవస్థీకరించడం సాధ్యమ య్యేది ఆచార్యగారికి. లెక్కలు రాసుకునే పని కొన్నాళ్లు గడిచిన తర్వాత టీచరు ఉద్యోగం మానివేసి శ్రీ మామిడి ఎల్లోసా వడ్ల గిర్నిలో 6 నెలలు పనిచేశారు. తరువాత మామిడి లక్ష్మినారాయణ్‌ ‌సాగారి బట్టల దుకాణంలో కొంత కాలం పనిచేశారు. చివరి సారిగా గన్ను వైకుంఠం వెండి బంగారం దుకాణంలో లెక్కలు వ్రాయడానికి కుదిరాదు.
అక్షరాలనధికార మదాంధులకమ్మి పదవులు తోటల పొలాల బిచ్చమెత్తని వాడు
మిగిలిన నాలుగురాళ్లు తగిలిన నాలుగురాళ్లు పత్రికా సౌధపు పునాదులన్నవాడు
ఒక దశలో ఆలోచన దారులు వేరువేరుగా ఉండేవి. కోపాలు వచ్చేవి. పెట్టుబడిదారులు అంటే ఉన్న వారి వద్ద డబ్బు దండుకోవాలనే ఆలోచన, ఉద్రేకం కలిగేవి, తెలిసి తెలియని అపరిపక్వ మానసిక స్థితిలో చేసినపనికి చోరీ నేరంలో ఇరుక్కుపోవలసివచ్చింది, ఆ తర్వాత కేసులు కొట్టివేసినారు. ఆలోచనలు పేదరికం. నాస్తిక కేంద్రాలతో పరిచయం, మానసిక సంచలనావస్థ గల సమయంలో కాన్సర్‌ ‌వ్యాధివల్ల ఆచార్యగారి తల్లిగారు మరణించినారు. నేనెప్పుడూ నాయనమ్మను చూడలేకపోయాను.
నిజానికి, జర్నలిజానికి నాంది
ఆ సమయంలో శ్రీ ఆచార్యగారు జర్నలిస్టు కావడానికి నాంది పలికిన సంఘటన ఒకటి జరిగింది. ఒక రోజు ఆచార్యగారు మధ్యాహ్నం ఇంటి నుండి వైకుంఠంగారి షాపు వైపు వెళ్తుండగా, ప్రసాదరావు అనే అతణ్ణి నడిబజారులో ఒక ముస్లిం చావబాదుతుండటం చూశారు. ఆ సంఘటన ఎంతో హృదయ విదారకంగా అనిపించింది ఆ రోజ ఒక హిందువును ఒక ముస్లిం అకారణంగా కొడుతుంటే చూచే వారిలో కలిగే పరిణామాలు ఊహించుకోవచ్చు.  అటువంటి ప్రేరణతోనే సికింద్రాబాద్‌ ‌నుండి వెలువడే తెలంగాణా పత్రికకు ఆ వార్త వ్రాసి పంపించారు ఆచార్యగారు. అది యధాతథంగా అచ్చయింది. 1942-47 సంవత్సరాల మధ్యకాలం, అప్పటి పరిస్థితులు అందరూ ఎరిగినవే. ఏ కారణం చేతన్కెతేనెం ఆచార్యగారికి ఈ ఉద్యోగం కూడా నిలవలేదు.
ఆంధ్రపత్రిక ఏజంట్‌
‌కీ.శే.ముస్త్యాల శంకర్రాపు జన్మభూమి పత్రిక ఏజెంట్‌. ‌వీరికి బాలల ఆర్గనైజేషన్‌తో సంబంధముండేది. ఆ సంస్థతో ఆచార్యగారికి కూడా సంబంధాలేర్పడినాయి. క్రమంగా శ్రీ ముస్త్యాల శంకరరావుతో సహవాసం పెరిగింది. ప్రతాపరుద్ర దళం, వాలంటీర్‌ ‌దళాలు మాత్రమేగాక, ఇతర ఆర్గనైజేషన్స్, ‌రజాకర్ల వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనే సంస్థలతోనూ, వాటిలో పనిచేసే సభ్యులు కొందరితోను ఆచార్యగారికి పరిచ యమేర్పడిరది. వీరిలో శ్రీయుతులు యం. వీరస్వామి, భట్టి, కిషన్సింగ్‌. ‌కూసం వైకుంఠం, సైకిల్‌ ‌షాపు రాజన్న, నరసింహారెడ్డి, భూపతిరత్నం దక్షిణామూర్తి, రాజగోవింద్‌, ‌డా. అమరం రామారావు వగైరా ప్రభృతులతో సన్నిహిత సంబంధం ఏర్పడిరది. శ్రీ ముస్త్మాల శంకరరావు ఆంధ్రపత్రిక ఏజన్సీ కోసం దరఖాస్తు పెట్టుకోగా వారికి అప్పటికే జన్మభూమి ఏజన్సీ ఉండటం వల్ల వీలుకాదన్నారు. అందువల్ల పత్రిక ఏజన్సీ తీసుకోమని శంకర్రావు సూచించారు. కొడిమేల రాజయ్య గారి వద్ద డబ్బులు తీసుకొని రాజేశ్వరశాస్త్రి పేరుతో ఏజన్సీ పొందారు ఆచార్యగారు. మిత్రుడి డబ్బులు తిరిగి ఇవ్వకుం డానే కాలం గడిచింది.
ఆంధ్రపత్రిక బండిల్లో ఇమిడ్చి పోరాట పత్రాలు
రజాకార్ల దృష్టి నుండి తప్పించుకోడానికి వారు రెండు నెల్లకోసారి ఇళ్ళు మారేవారు. తమ కుటుంబం నగరం వదలి వెళ్ళగా ఆచార్య సోదరులు తమ ఈ కార్యక్రమాల ద్వారా రజాకార్ల ఆగ్రహానికి గురయినారు. పోరాటవార్తల్ని ప్రచారం చేయడానికి వారు మద్రాను నుండి సైక్లోస్టెయిల్‌ ‌మిషన్‌ను కూడ ఆంధ్రపత్రిక బండిల్లో ఇమిడ్చి తెప్పించి వినియోగించేవారు. ఆరోజుల్లో శ్రీ ఆచార్య ఆంధ్రపత్రిక ఏజంటుగా విలేకరిగా వార్తల్ని సేకరించడం ఉద్యమం సాగుతున్నతీరును ప్రచారం చేయడమేగాక ఆందోళన సాహిత్యాన్ని కూడా చురుకుగా పంపిణీ చేసేవాడు.
ఆంధ్ర పత్రిక విలేఖరి
ఆచార్యగారు 1947 జనవరి 1వ తేదీన ఆంధ్ర పత్రిక ఏజెంట్‌ ‌చేస్తూనే 1948 జనవరి 1వ తేదీన ఆంధ్ర పత్రిక విలేఖరిగా ఉద్యోగంలో చేరారు. ఆ విధంగా జర్నలిస్టుగా ఆచార్యగారి జీవితం ఆంధ్రపత్రిక విలేఖరిగానే ప్రారం భమైంది, 1948 నుండి 1980 సంవత్సరందాకా అంటే దాదాపు 32 సంవత్సరాలు ఆంధ్ర పత్రిక విలేఖరిగా ఉన్నారు. 25 పత్రికలతో అమ్మడం నుంచి మొదలు. ఆ కాలంలో 23 మంది చందాదారులే, వరంగల్‌ ‌సుండి కాజీపేట దాకా సైకిలుపై వెళ్ళి పత్రికలు పంపించేవారు. 1980లో పాలేకర్‌ అవార్డు దృష్ట్యా పత్రికల యజమానులు పార్ట్‌టైమ్‌ ‌విలేఖరులను తొలగించారు. కాని హక్కుల కోసం మేనేజ్‌మెంటుతో తగవుపడటం ఆచార్యగారికి ఇష్టం లేదు. ‘‘ఈ ఆంధ్ర పత్రిక వల్లనే ఈ రంగంలో తానొక వ్యక్తిగా నిలదొక్కుకో గలిగానన్న భావనతో వారు ఎటువంటి చట్టపరమైన చర్యకు ఉద్యుక్తులు కాలేదు.
స్వాతంత్య్ర పోరాటం, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం పుంజుకోవడంతో ఆంధ్రపత్రిక కాపీల అమ్మకాలు పెరి గాయి. హన్మకొండలో పెన్నా సీతారామరావు ఆంధ్రప్రభ , ఏజంట్‌, అప్పట్లో 200 కాపీలు ఆంధ్రప్రభ అమ్ముయ్యేది, జన్మభూమి 500 కాపీలు అమ్మేది. ఆంధ్రప్రతిక మాత్రం కొద్ది కాపీలే అమ్మేవి. ఇటువంటి స్థితి నుండి క్రమంగా కృషి చేసి పత్రిక, సర్క్యూలేషన్‌ను1450 కాపీలకు తేగలిగారు. మొత్తం 25 మంది కుటుంబ సభ్యులవారికి జీవనానికి జీవగర్ర ఆచార్యగారి పత్రిక ఆంధ్రపత్రిక.
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist