• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

భయబీభత్సాల నడుమ ‘భారతీయ ఆత్మ’

Taza Cinema by Taza Cinema
2025-04-26
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

విలాపాగ్నుల విషాదాశ్రువుల నడుమ జీవిస్తున్నాం. నిర్దాక్షిణ్యమైన శక్తుల వీరవిహారంలో నిస్సహాయంగా నిలబడి ఉన్నాం. కావలసిన చోట రక్షణ దొరకదు. అవసరమైన చోట విచక్షణా దొరకదు.ఒక్కోసారి, హింస కంటె దాని చుట్టూ కాంతిపుంజం లాగా మెరిసిపోయే ఆవేశాలు, ఉద్వేగాలు ఎక్కువ భయానకంగా ఉంటాయి. ఒకచోట జరిగిన విస్ఫోటక సంఘటన, దాని అనేక పర్యవసానాలతో, నానార్థాలతో, విషకాలుష్యంతో లోకాన్నంతా చుట్టేస్తుంది. కుటుంబాల బంధువుల శోకాల మధ్య బాధితుల అంత్యక్రియలు జరిగిపోతాయి. కానీ, మనస్సుల్లో ఒక చితి అంత తొందరగా చల్లారదు, దుఃఖాలు పొగిలిపొగిలి పెల్లుబుకుతాయి. కన్నీటిలో ఆరిపోకుండా అగ్నికి ఆజ్యం దొరుకుతూనే ఉంటుంది, ఏదో ఒక విసురుగాలి ఎగదోస్తూనే ఉంటుంది. చిలవ లుపల వలుగా భిన్నకథనాలు ఆలోచనలను మోహరింపజేస్తాయి. కశ్మీర్‌లోనిపెహల్‌గామ్‌లో మొన్నటి మంగళ వారం నాడు జరిగిన దుర్మార్గానికి ఎవరు మాత్రం నిలువునా కంపించరు? ఎవరు మాత్రం దుఃఖంలో, ఆవేశంలో, ఆగ్రహంలో ఊగిపోరు? ఘర్షణలో ఉన్న  సాయుధ పక్షాల మధ్య హోరా హోరీ జరిగిన సంఘటన కూడా కాదు,   హతులు- పౌరులూ పర్యాటకులూ అందులో నూ ఎంపిక చేసిన మతవర్గీయులు కదా? నువ్వూ నేనూ అతడూ ఎవరైనా అక్కడ ఉండి ఉండవచ్చు. ఆ సంభావ్యతకు తోడు, ప్రత్యేకంగా తాము లక్ష్యం అయ్యామన్న ఆలోచన హిందువులను భయపెట్టి తీరుతుంది కదా?

ఈ వ్యాసకర్త కూడా తొమ్మిదేండ్ల కిందట పెహల్‌గామ్‌లో, అదే బైసారన్‌ పచ్చికల నుంచి మంచుకొండలను పొడవాటి పైన్‌ వృక్షాల ను కుటుంబసభ్యుల, మిత్రుల మధ్య ఆనందించాడు. జ్ఞాపకాలను ఒకసారి పరామర్శిస్తే,  ఇప్పుడు మనుషులు పాయింట్‌ బ్లాంక్‌లో కుప్పకూలిన చోట్ల మేమూ తచ్చాడి ఉంటామని స్ఫురించింది. ఆనాటి కశ్మీర్‌ రాజకీయ సందర్భం వేరు కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశం ఆనాడు తక్కువ ఉండి ఉండవచ్చు. కానీ, పెహల్‌ గామ్‌సందర్శకుడిగా, ఇప్పుడు చనిపోయిన ఆ 26  మందితో సహానుభూతి అత్యంత సహజం. స్వయంగా అటు వంటి స్థలాలతో పరిస్థితులతో ఏ సంబంధం లేకపోయినా సరే, బాధితుల మీద సానుభూతులు కలుగుతాయి. ఎక్కడ ఏ అమాయక ప్రాణం హరించుకు పోయినా, ఆధిపత్యం కోసం ప్రత్యర్థుల ప్రాణాలను అన్యాయంగా ఎవరు తీసుకున్నా, అవి న్యాయపక్షపా తులందరినీ బాధించే అంశాలు.   కశ్మీర్‌ సమస్యతో  కాంగ్రెస్‌ నుంచి నేటి బిజెపి దాకా సవ్యంగా వ్యవహరిం చలేదన్న విమర్శ ఎంత ఉన్నప్పటికీ, అమా యక పౌరుల హత్యాకాండ అత్యంత దుర్మార్గమైనది.  ఎంత ఆధునికులమైనా, భౌతికులమైనా, సెక్యులర్లమైనా,  సాటివారికి కాకున్నా, ఎదుటివారి దృష్టిలో ఏదో మతానికి చెందినవారమే కదా? పౌరులుగా, పర్యాటకులుగా వచ్చినవారిని ఎవరు హత మార్చినా, చనిపోయింది ఏ మతస్థులైనా, స్పందనలు కలిగి తీరవలసిన మనుషులమే కదా!?

అట్లాగని అన్ని సంఘటనల మీదా, ఊచకోతల మీదా అన్నిస్పందనలు ఒకేరకంగా ఉండవు. భావవాతావరణం మనలో నింపిన నిర్లిప్తతలు, ఉద్రేకాల కారణంగా  ఒక్కో దుర్మా ర్గానికి ఒక్కోరకంగా స్పందిస్తాము. సామాజిక మాధ్యమాల కాలంలో, మనుషుల కలవరాలను, సానుభూతులను ఎంతో ప్రభావవంతంగా నిర్మించి, నియంత్రించగలుగుతున్నారు.  సమా నత్వంతో ఉద్దీపింపజేయాలన్న గొప్ప లక్ష్యంతో మంచో చెడో తామనుకున్నమార్గానికి జీవితాలను అంకితం చేసిన సాధకులను, మరొక పరిష్కారానికి అవకాశం లేకుండా, చుట్టుముట్టి నిర్మూలి స్తున్నప్పుడు, భారతీయ సమాజం శిలాసదృశమైన మౌనంతో ఆమోదం తెలుపుతున్నది, కొందరు కన్నీళ్లు పెడుతున్నారు, కొందరు జేజేలు కూడా కొడుతున్నారు.

పెహల్‌ గామ్‌ జరిగిన వెంటనే, దిగ్భ్రాంతి- మొదటి స్పందనబీ గుండె బద్దలయ్యే దుఃఖం – మొదటి వ్యక్తీకరణబీ కారణమేమిటన్న స్ఫురణ,  ఘాతుకం మీద ఆగ్రహం కలగలసి – కారకుల మీద, హంతకుల మీద  శాపనార్థాలో ప్రతీకార ప్రక టనలో కదా సహజంగా వినిపించే ఉద్వేగాలు! హత్యాకాండకు గురయినవారి సమీపబంధువుల, మిత్రుల స్పందనలు అట్లానే ఉన్నాయి కూడా. అయితే, వారి ఆగ్రహం హంతకుల మీదనే, తమకు సహాయం చేసిన స్థానికుల మీద వారు అంతులేని కృతజ్ఞతను ప్రకటించారు. ద్వంద్వాల నుంచి వారు నిర్ధారణలు చేయలేదు.  ప్రచారాల ప్రభావంలో సొంత అస్తిత్వం నుంచి, మతవిభజన  నుంచి అర్థం చేసుకున్న సాధారణుల ఆవేశాలు మాత్రం తీవ్రంగానే కనిపించాయి. వివేచనకు, విశ్లేషణకు సమయమూ ఆస్కారమూ లేని ఒత్తిడిలో, మెదళ్ల మీద ముసురుకున్న వైమనస్యాల హోరులో కొట్టుకుపోకుండా నిలవగల స్థైర్యం ఎవరి నుంచి ఆశించగలము?

ఉద్వేగాలు అందరిలో ఒకేరకంగా ఉన్నా, వ్యక్తీక రణలు అట్లా ఉండాలని లేదు. ఆగ్రహం అందరికీ ఒకటేరకంగా కలగవచ్చు, కానీ, ఆగ్రహకారణాలు వేరువేరుగా ఉం డవచ్చు.  బాధితుల మీద సానుభూతి ఒకేరకంగా ఉం డవచ్చు, కారకులెవరనే దాని మీద వేరువేరు అంచనాలు ఉండవచ్చు. కానీ, పెహల్‌గామ్‌ఉద్వేగాలను ప్రత్యేకమైన దారులలోకి మళ్లించి, ఒకేరకంగా అందరూ ఆలోచించాలని ఒత్తిడిపెట్టే  ప్రయత్నాలు చూసినప్పుడు మరింత కలవరం కలుగుతుంది. అసలు కారణాలను మభ్యపెట్టడం, ఆగ్రహాలను దారిమళ్లించడం ఆ ప్రయత్నాల ఉద్దేశ్యం.

పెహల్‌ గామ్‌ జరిగిన వెంటనే, దిగ్భ్రాంతి- మొదటి స్పందన గుండె బద్దలయ్యే దుఃఖం – మొదటి వ్యక్తీకరణ కారణమేమిటన్న స్ఫురణ,  ఘాతుకం మీద ఆగ్రహం కలగలసి – కారకుల మీద, హంతకుల మీద  శాపనార్థాలో ప్రతీకార ప్రకటనలో కదా సహజంగా వినిపించే ఉద్వేగాలు! హత్యాకాండకు గురయినవారి సమీపబంధువుల, మిత్రుల స్పందనలు అట్లానే ఉన్నాయి కూడా. అయితే, వారి ఆగ్రహం హంతకుల మీదనే, తమకు సహాయం చేసిన స్థానికుల మీద వారు అంతులేని కృతజ్ఞతను ప్రకటించారు. ద్వంద్వాల నుంచి వారు నిర్ధారణలు చేయలేదు.  ప్రచారాల ప్రభావంలో సొంత అస్తిత్వం నుంచి, మతవిభజన  నుంచి అర్థం చేసుకున్న సాధారణుల ఆవేశాలు మాత్రం తీవ్రంగానే కనిపించాయి. వివేచనకు, విశ్లేషణకు సమయమూ ఆస్కారమూ లేని ఒత్తిడిలో, మెదళ్ల మీద ముసురుకున్న వైమనస్యాల హోరులో కొట్టుకుపోకుండా నిలవగల స్థైర్యం ఎవరి నుంచి ఆశించగలము?

టెర్రరిస్టులు హంతకులు కాబట్టి, వారి  మీద పట్టరాని ఆగ్రహం కలుగుతుంది. కానీ, వాళ్లు ఎదురుగా లేరు,  హత్యలు చేసి పారిపోయారు. వాళ్లను పట్టుకుని శిక్షించాలి. ఇంకోసారి ఇటువంటివి జరగకుండా గట్టి నిరోధక చర్యలు తీసుకోవాలి. కానీ, వాళ్లు అసలు ఎట్లా అక్కడికి రాగలిగారు? ఏ ప్రమాదమూ ఉండదని నమ్మి కశ్మీర్‌ కు ఆ పర్యాటకులు వెళ్లగలిగారంటే, అక్కడ సమస్య పరిష్కారమైపోయిందని, శాంతి స్థాపన జరిగిందని కేంద్రప్రభుత్వం చెప్పబట్టే కదా? ఆ నమ్మకం ఎట్లా వమ్ము అయింది? ఈ రెండు తక్షణ అంశాల ప్రస్తావన తరువాత, ఇతర అంశాలు, కశ్మీర్‌ సమస్య నేపథ్యం, వివిధ ప్రభుత్వ కాలాల్లో వైఖరులు, గత ఐదారేళ్ల నిర్ణయాల ఫలితాలు ఎట్లా ఉన్నాయి వంటివి చర్చల్లోకి వస్తాయి.

కానీ, కేంద్రప్రభుత్వ భద్రతా వైఫల్యం (జమ్మూ కశ్మీర్‌ లో భధ్రత కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది) గురించి విమర్శ రాకుండా, మీడియాలో, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో, కథనాలు రకరకాల పుంతలు తొక్కాయి. సంఘటన జరిగిన వెంటనే ఒక టెర్రరిస్టు సంస్థ అది తమ పనే అని చెప్పుకోవడం, ఆ సంస్థ కార్యస్థానం పాకిస్థాన్‌ లో ఉండడంతో,  పెహల్‌గామ్‌ విషయంలో  పాకిస్థాన్‌ దోషిగా నిలబడిరది. అటువంటి సంస్థ లకు పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైనిక, గూఢచారి వ్యవస్థలు ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందించడం తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్‌ ఆర్థికంగానూ ఇతరత్రానూ బాగా బలహీన స్థితిలో ఉండడం వల్ల,  ఆ దేశం భారత్‌ కు సమవుజ్జీ కాదన్న అభిప్రాయం ఏర్పడి, పాక్‌ వ్యతిరేక ఆగ్రహాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పాకిస్థాన్‌ మీద తక్షణం యుద్ధం ప్రకటించి, పాక్‌ అధీన కాశ్మీర్‌ ను స్వాధీనం చేసుకోవాలని, వీలయితే బలూచిస్తాన్‌ ను విముక్తం చేయాలని కోరుతున్న రాజకీయ నాయకులు, నెటిజన్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే, పెహల్‌గామ్‌వల్ల కలిగిన ఆగ్రహావేశాలను, దేశంలోని సెక్యులరిస్టుల మీదికి, పౌరసమాజంలో పనిచేసే మేధావుల మీదికి, కొందరు జర్నలిస్టుల మీదికి మళ్లించడం  ఈ సారి విశేషం. ఇది ఒక పద్థతి ప్రకారం జరిగిందా, తక్షణ స్పందనగా జరిగిందా అన్నది తెలియదు కానీ, పెహల్‌గామ్‌దాడికి సెక్యులర్‌ భావాలు కలిగిన సంస్థలూ వ్యక్తులే కారణమన్నట్టుగా ప్రచారం జరిగింది.

ఈ సంఘటన జరగడానికి ముందు వరకు, వేరే రకంగా ఉన్న ఆలోచనాపరులు కూడా ఈ ఘాతుకం తరువాత, అభిప్రాయాలు మార్చుకుని కొత్తగా సెక్యులరిజాన్ని విమర్శించడం చూడవచ్చు. మంచి చెడ్డలు ఏవైనా, ఈ పరిణామాన్ని, దాని పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.బాధితులను పర్యాటకులుగానో భారతీయులుగానో ప్రస్తావి ంచడం మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హిందువుల మీద మతోన్మాద టెర్రరిస్టుల దాడి అనాలని ఆ వర్గీయుల అభిప్రాయం.ఇది హిందువుల మీద ముస్లిములు చేసిన హంత కదాడి అనాలని కూడా కొందరి భావం.ఇదే సందర్భంలో, టెర్రరిజానికి మతం లేదని సర్వసాధారణంగా చెప్పే మంచి మాటల మీద ప్రతిఘటన, తృణీకారం వ్యక్తమయ్యాయి. ఈ ఉగ్రవాద మూలాలను మొత్తంగా ముస్లిమ్‌ సమాజం అంతటిలో చూడాలన్న వాదనను ప్రబలంగా సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో పెట్టారు. స్వయంగా భారత ప్రభుత్వం కానీ, ప్రధాని కానీ, హోంమంత్రి కానీ, విదేశాంగ కార్యదర్శి కానీ మృతులను వారి వారి మతాల ఆధారంగా పేర్కొనలేదు. బిహార్‌ సభలో నరేంద్రమోదీ మాత్రం ‘ ఇది భారతీయ ఆత్మమీద జరిగిన దాడి’ అన్నారు. భారతీయ ఆత్మ, సహజీవనమూ సమభావమూ కదా?

పెహల్‌గామ్‌ సంఘటన జరిగిన వెంటనే కలిగే అభిప్రాయం మాత్రం,  కశ్మీర్‌లో అంతా సజావుగా లేదు, ప్రభుత్వవిధానం చెప్పిన ఫలితాలు ఇవ్వలేదు, అక్కడి పరిస్థితి  మీద ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు. జరిగిన దుర్ఘటనకు హంతకులు, వారి ప్రోత్సాహక శక్తుల బాధ్యత ప్రధానమైనదే కానీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం విస్మరించరానిది, కీలకమైనది.  ఈ దాడి కారణంగా ఇప్పుడిక అక్కడ పర్యాటక పరిశ్రమ కుప్పకూలుతుంది,  ప్రజల జీవనాధారాలు బాగా దెబ్బతింటాయి. కేంద్రం భరోసాతో అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్న కార్పొరేట్లు, పెట్టుబడిదారులు సంశయంలో పడతా3రు. తాజా ఉద్రిక్తతలతో కశ్మీర్‌ తిరిగి ద్వైపాక్షిక, అంతర్జాతీయ చర్చాంశం కావచ్చు. దేశీయ రాజకీయాలమీద కూడా దాని ప్రభావం ఉండవచ్చు.  

రాజ్యవ్యవస్థ కానీ, సమాజంలోని వివిధ పౌర వ్యవస్థలు కానీ, వ్యక్తులు స్పందించినట్టుగా ఆవేశాలతో, ప్రతీకారాలతో స్పందించవు. స్పందించకూడదు.  ఒక తీవ్రమైన అవాంఛనీయసంఘటనజరిగినప్పుడు, అటువంటివి పునరావృతం కాకుండా తక్షణం కట్టుదిట్టాలు చేయడంతో పాటు, సమస్య మూలాలను స్పృశించి దీర్ఘకాలిక చర్యలను రూపొం దించడం చేస్తాయి. సంఘటనకు సమాజం నుంచి ఉద్రేకాలు కలగకుండా చూడడం కూడా, పాలకుల, ప్రజానాయకుల పని. దురదృష్టవ శాత్తూ, ఈ సంఘటన మీద భారతీయ సమాజంలో  మరింత తీవ్రమైన  విభజనలు తలెత్తకుండా నివారించగల, బాధ్యతాయుత ప్రవర్తన పెద్దగా కనిపించలేదు. హత్యాకాండలు, సంచలన సంఘ టనలు మాత్రమే కాదు, సమాజంలో విద్వేషాలు పేరుకుపోతే మున్ముందు  సంభవించగల కల్లోలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రేరేపణలతోనో, సొంత స్పందనలతోనో ప్రజలు పాకిస్తాన్‌ మీద తక్షణ సైనికచర్య తీసుకోవాలని కోరుకోవచ్చు లేదా తమ ఆవేశాలు ఫలానా రకంగానే చల్లారతాయని వ్యక్తీకరిం చవచ్చు. వాటి సాధ్యాసాధ్యాలు ప్రభుత్వాన్ని నడిపే వ్యవస్థలకు తెలుస్తాయి. ఇద్దరూ తనకు కావలసినవాళ్లే అని డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నాయినొక్కులు నొక్కుతున్న సమయంలో, రెండు అణ్వస్థ్ర రాజ్యాలు యుద్ధంలోకి దిగడం అంత సులువూ కాదు, క్షేమమూ కాదు.

వెనువెంటనే సైనికచర్యకు బదులు, పాక్‌ పౌరజీవితం మీద ప్రభావం వేయగల ఆంక్షలను ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆ దేశం మీద ఒత్తిడి తేవడానికి మెరుగైన పద్ధతే. కానీ, అన్ని ఆంక్షలూ ఆచరణసాధ్యం కాకపోవచ్చు. పాకిస్థాన్‌ సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడం నైతికంగా సరైనది కాదన్నవిమర్శలు రావచ్చు.  పాకిస్థాన్‌ పోటీ చర్యల కారణంగా, మూడో దేశం రంగంలోకి దిగే ప్రమాదం ఉంది.  ఇవన్నీ, భారత్‌ భీరువుగా వ్యవహరించాలనో, పాక్‌ కు లొంగి ఉండాలనో చెప్పడం కాదు. ప్రభుత్వాలు, తక్షణ స్పందనలతో పాటు, దీర్ఘకాలిక దృష్టిని, ఆచరణాత్మకతని ప్రదర్శించవలసి ఉంటుందని గుర్తు చేసుకోవడం. నిజానికి, చేసిన భీషణ ప్రతిజ్ఞలకు అనంతర పరిణామాలకు పెద్దగా పొంతన లేకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు!

ఎక్కడ ఏ అమాయక ప్రాణం హరించుకుపోయినా, ఆధిపత్యం కోసం ప్రత్యర్థుల ప్రాణాలను అన్యాయంగా ఎవరు తీసుకున్నా, అవి న్యాయపక్షపాతులందరినీ బాధించే అంశాలు.   కశ్మీర్‌ సమస్యతో  కాంగ్రెస్‌ నుంచి నేటి బిజెపి దాకా సవ్యంగా వ్యవహరించలేదన్న విమర్శ ఎంత ఉన్నప్పటికీ, అమాయక పౌరుల హత్యాకాండ అత్యంత దుర్మార్గమైనది.  ఎంత ఆధునికులమైనా, భౌతికులమైనా, సెక్యులర్లమైనా,  సాటివారికి కాకున్నా, ఎదుటివారి దృష్టిలో ఏదో మతానికి చెందినవారమే కదా? పౌరులుగా, పర్యాటకులుగా వచ్చినవారిని ఎవరు హతమార్చినా,  చనిపోయింది ఏ మతస్థులైనా, స్పందనలు కలిగి తీరవలసిన మనుషులమే కదా!?

యుద్ధం వాంఛనీయం కాదని ఎవరన్నా అంటే, అది కూడా అపచారం అన్నట్టు మాట్లాడేవారున్నారు. యుద్ధం కోరితేనే దేశభక్తి అనడం బాద్యతారహిత వాదన. ఆ లెక్కన దేశభక్తి లేని అతి పెద్ద వ్యవస్థ స్టాక్‌ మార్కెట్‌ కావాలి. భారత్‌తో ఉద్రిక్తతలు వచ్చిన వెంటనే పాక్‌మార్కెట్‌ కుప్పకూలిపోయింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ,  భారత్‌ మార్కెట్‌ కూడా పతనగతి లోకి వెళ్లి హెచ్చరికలు పంపుతోంది.

పెహల్‌గామ్‌ సంఘటన జరిగిన వెంటనే కలిగే అభి ప్రాయం మాత్రం,  కశ్మీర్‌లో అంతా సజావుగా లేదు, ప్రభుత్వ విధానం చెప్పిన ఫలితాలు ఇవ్వలేదు, అక్కడి పరిస్థితి  మీద ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదు. జరిగిన దుర్ఘటనకు హంతకులు, వారి ప్రోత్సాహక శక్తుల బాధ్యత ప్రధానమైనదే కానీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం విస్మరించరానిది, కీలకమైనది.  ఈ దాడి కారణంగా ఇప్పుడిక అక్కడ పర్యాటక పరిశ్రమ కుప్పకూ లుతుంది,  ప్రజల జీవనాధారాలు బాగా దెబ్బతింటాయి. కేంద్రం భరోసాతో అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్న కార్పొరేట్లు, పెట్టు బడిదారులు సంశయంలో పడతారు. తాజా ఉద్రిక్తతలతో కశ్మీర్‌ తిరిగి ద్వైపాక్షిక, అంతర్జాతీయ చర్చాంశం కావచ్చు. దేశీయ రాజకీయాలమీద కూడా దాని ప్రభావం ఉండవచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి సోషల్‌ మీడియా ఆవేశాలకు మించినది.  దూరదృష్టి, వివేకం, ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకుని నాయకత్వం  వ్యవహరిం చవలసి ఉంటుంది.

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist