• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

ఫాసిజమా? నయా ఫాసిజమా?

Taza Cinema by Taza Cinema
2025-04-29
in Interviews
Reading Time: 2 mins read
0 0
A A

తల పగల కొట్టడానికి ఇటుక రాయైనా కటిక రాయైనా ఒకటే?

మినీ స్విట్జర్లాండు గా భావింపబడే కాశ్మీర్‌ లోయలోని పహెల్గాంలో వేర్పా టు వాద ముష్కరులు అమానవీ యమై న దాడి చేసి 28 మంది పర్యాట కుల ను పొట్టను పెట్టుకున్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం గైకొం టున్న చర్యలు సమర్థనీయమే! అయితే కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా అవలం భిస్తున్న ప్రజా స్వామ్య లౌకిక వాద వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడంలో ఇది అడ్డు కారాదు. పహెల్గాంలో ముష్క రుల దాడి ఖచ్చితంగా భారత దేశంపై జరిగినదే. ఈ ముష్కరులతో పాటు వీరి వెనుక ఎవరు ఉన్నా వారి భరతం పట్టడంలో దేశం మొత్తం ఏక తాటి పై కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవ వలసి వుంది. ముష్కరుల దాడిలో విహార యాత్ర కెళ్లిన పర్యాటకులు 28 మంది మృత్యువాత పడ్డారు. ఈ కిరాతక దుష్ఫలితం ఎవరూ సరిదిద్ద లేరు. భర్తలను పోగొట్టుకున్న భార్యలు తలితండ్రులను పోగొట్టుకున్న పిల్లల రోదన హృదయాలను పిండి పిప్పి చేస్తుంది. గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వం కాశ్మీర్‌ సమస్య యెడల అవలంభించిన అపసవ్య విధానాలకు తాము బలైనామని ఇన్నేళ్లు గాలిలో కలసి పోయిన వేలాది మంది ప్రేతాత్మలు నిలదీసే రోజు దగ్గరలోనే వుంది.

ముష్కరులు సాగించిన మారణ హోమం భాషకు భావనకూ అందనిదే. వేసవి కాలం మొదలైన తరు ణంలో పర్యాటకులు పెరగ వలసిన పూర్వ రంగంలో మిగిలిన పర్యాటకులు కాశ్మీర్‌ నుండి తిరుగు ముఖం పట్టడం మున్ముందు పర్యాటక రంగం దెబ్బ తినడంతో వాస్తవంలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కాశ్మీర్‌ నిరుపేద ప్రజల బతుకులు బజారున పడ్డాయి. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఈ దాడి దేశం మీద జరిగిందని హిందూ మతం మీద కాదని కాశ్మీర్‌ లోయ ప్రజలు భావించినందుననే దుర్ఘటనకు వ్యతిరేకంగా నిరసనగా సంపూర్ణ బంద్‌ పాటించారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలిపారు. కాశ్మీర్‌ అంశం పరిశీలించే సమయంలో ఈ సరళ రేఖ చెరిగి పోరాదు. పహెల్గాం దుర్ఘటనలో ఒక హిందూ పర్యాటకుని ప్రాణాలు కాపాడే క్రమంలో ఒక ముస్లిం యువకుడు ముష్కరుల తూటాలకు బలి అయ్యారంటే ప్రతి భారతీయుడి హృదయం జలదరించడమే కాకుండా గర్వ పడవలసి ఉంది.
మతం కాదు మానవత్వం ముఖ్యమని పలువురు వ్యవహరించిన కథనాలు క్రమేణా వెలుగు చూస్తున్నాయి. ఈ పరిణామాలు పలు వైపరీత్యాలకు దారి తీస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో ఏమో గాని తక్షణమే కాశ్మీర్‌ నిరు పేద ప్రజలు బాధలు వర్ణనాతీతం. పైగా సింధు నదీ జలాల ఒప్పందం భారత్‌ రద్దు చేసినందుకు ప్రతిగా పాక్‌ సిమ్లా ఒప్పందం రద్దు చేసింది. తన గగనతలం నుండి భారత్‌ పౌర విమానయానాలను నిషేధించడంతో భారత్‌ కు చెందిన అంతర్జాతీయ విమానయాన చార్జీలు అమాంతం పెరిగి పోయాయి. మరెన్ని భారాలు ఈ దేశ ప్రజలు భరించ వలసి వుంటుందో! ఈ పూర్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇక మీదట దేశంలో ప్రతి పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వివిధ పౌర లౌకిక సమూహం యెడల ఏలా వ్యవహ రిస్తుందో వేచి చూడాల్సిందే!

కాంగ్రెస్‌ పార్టీ మిగిల్చిన రాజకీయ శూన్యత ఆధారంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించాయి. అదొక చారిత్రక దశ. కాని 2014 తర్వాత ప్రాంతీయ పార్టీల అగ్ర నేతల బలహీనతలను ఆధారం చేసుకొని బిజెపి వారిని అదుపులోనికి తెచ్చుకోవడం లేదా పార్టీని చీల్చే కార్యక్రమం మొదలైంది. ప్రాంతీయ పార్టీలకు చెంది ఇది రెండవ దశ. మరి కొంతమందిని బకరాలు చేసి ఏకచ్ఛత్రాధిపత్యం సాధించే క్రమంలో భాగమే జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రతి పాదనలు. మరో ప్రతిపాదన హిందీ భాష తప్పనిసరి చేయడం.

దేశ అంతర్గత విధాలు వేరు!
అయితే భారత దేశంలో ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రాజకీయాలు మతం సమ్మిళితమై క్రమేణా కమ్ము కొస్తున్న కారుమబ్బుల ప్రభావ శీలతకు ఏ పేరు పెట్టాలనే అంశంపైన ఇటీవల వరకు తీవ్ర చర్చలు జరిగాయి. ఫాసిజమా! నయా ఫాసిజమా? ఇవన్నీ పక్కన పెడితే తొలి ప్రపంచ యుద్ధం తరువాత నాజీ జర్మనీలో చోటు చేసుకున్న విపరిణామాలాంటివి భారత దేశంలో క్రమేణా నెల కొనడం మాత్రం వాస్తవం. ఈ సందర్భంగా నాజీ జర్మనీలో ప్రొటెస్టెంట్‌ మత గురువు మార్టిన్‌ నీమోల్లర్‌ (1892-1984)వెలుబుచ్చిన ఆవేదన ఇప్పుడు భారత దేశంలో పలు వర్గాల్లో సమూహాల్లో తీవ్ర సంచలనమైంది. మార్టిన్‌ నీమోల్లర్‌ మాటల్లో చెప్పాలంటే నాజీలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు.
నేను కాదని వెళ్లారు. తర్వాత యూదుల కోసం వచ్చారు. మిన్నకుండి పోయాను. తదుపరి కార్మికుల నాయకుల కోసం వచ్చారు. నేను కాదు. తర్వాత క్యాథలిక్కుల కోసం వచ్చారు. ఆఖరుగా ప్రొటెస్టెంట్ల కోసం వచ్చారు. అప్పటికి నన్ను కాపాడేందుకు ఎవరూ మిగిలి లేరు. ఈ పరిస్థితి భారత దేశంలో రాకూడదనేది ప్రతి ప్రజాస్వామ్య లౌకిక వాది ఆశాభావం. ఆనాడు జర్మనీలో హిట్లర్‌ మూకలు రాత్రి పూట యూదుల ఇళ్ల తలుపులు తట్టి స్వస్తిక్‌ గుర్తువేసి మాయమయ్యే వారు. తలుపు తెరచిన ఇంటి యజమానికి ఎవ్వరూ కనిపించే వారు కారు. ఆ ఇంటి యజమాని ఎంతటి భయకంపితుడయ్యే వాడో మనం ఊహించగలం. ఈలాంటి ఎత్తుగడలు సంఫ్‌ు పరివార శక్తులు అమలు చేసిన సందర్భాలున్నాయి. ఈ దశలోనే ఆదమరచితే ఒకరినొకర్ని కాపాడుకొనేందుకు ఎవరూ మిగలమేమో! తొలుత నక్సలైట్ల విషయం సరేసరి. విషాదమేమంటే నక్సలైట్ల సానుభూతి పరులని తుదకు ఆశ్ర యం ఇచ్చారని నేడు వేలాది మంది ఆదివాసీలు హత మార్చబడుతున్నారు. ఈ విషాదం భాషకందనిది.

అర్బన్‌ నక్సలైట్ల పేర వేధింపులు! రాహుల్‌ గాంధీ అర్బన్‌ నక్సలైటా?
వీరి తర్వాత అర్బన్‌ నక్సలైట్లు అనే నామ కరణం చేసి పీడిత తాడిత ప్రజల గొంతుకలుగా వున్న చాల మందిని ఉపచట్టం కింద ఏళ్ల పాటు జైళ్లల్లో పెట్టారు. సత్వర విచారణలు లేవు. గిరిజనులపై సాగుతున్న మారణకాండ అర్బన్‌ నక్సలైట్లపై వేధింపులు గురించి పౌర సమాజంలో ఎక్కువమంది పట్టించుకోలేదు . ఈ దశలోనే కొంతమందిని సంఫ్‌ు పరివార శక్తులు బహిరంగంగానే కాల్చి చంపారు. గౌరి లంకేష్‌ కుల్‌ బుర్గి లాంటి వారిని బలిగొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ కే చెందిన స్వామి అగ్ని వేష్‌ను నడి బజారులో అవమాన పర్చారు. అంతిమంగా అర్బన్‌ నక్సలైట్ల నామకరణం ఎంత వరకు వెళ్లినదంటే రాహుల్‌ గాంధీకి ఈ టైటిల్‌ తగిలించారు.అప్ఫటికిగాని చాల మందికి తెలిసి రాలేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సర్వస్వం అర్పించిన నెహ్రూ కుటుంబాన్ని ఆయన విధానాలను టార్గెట్‌ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. నెహ్రూ సోవియట్‌ యూనియన్‌ నుండి ఉద్దీపన పొంది పంచవర్ష ప్రణాళికలు ప్రణాళిక సంఘం ఏర్పాటు ఉక్కు విద్యుత్‌ రంగాలకు ప్రభుత్వ రంగంలో పెద్ద పీట వేయడం కమలనాథుల దృష్టిలో నేరమైంది. దేశ సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఇందిరా గాంధీ కుటుంబాన్ని వదల లేదు. విచారకరమైన అంశమేమంటే దేశ జాతి పిత మహాత్మాగాంధిని హత్య చేసిన వారు వీరికి దేశ భక్తులైనారు. క్రమేణా ప్రభుత్వ రంగాన్ని కూలగొడు తున్నారు. లక్షలాది మంది కార్మికులు వీధిన పడుతున్నారు. ప్రభుత్వ రంగంలో నిర్బంధ వి ఆర్‌ యస్‌ లు ఎక్కువైనవి.

ఇందిర గాంధీ బ్యాంకులను జాతీయం చేస్తే ప్రస్తుతం ప్రైవేటు పరం కావడమే కాకుండా కోట్లాది రూపాయలు అప్పులు చేసి విదేశాల్లో జల్సా జీవితాలు గడిపే పారిశ్రామిక వేత్తలైన అప్పు ఎగవేత దారులను దేశానికి రప్పించడం లేదు. మరో వేపు ప్రజల దృష్టిని మరల్చడానికి అనువైన ఎత్తు గడలు అమలు చేస్తున్నారు దేశ వ్యవస్థలన్నింటిని గుప్పెట పెట్టు కొని ప్రతి పక్షాలపై ఉసిగొల్పుతున్నారు. ఇది గ్రహించి ముందుగా బిజెపి తీర్థం పుచ్చుకుంటే ఎన్ని నేరాలు వున్నా రాజాల్లాగా తిరగ వచ్చు. 2019 తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వారే కాకుండా దేశంలో ఎంతోమంది ఈ జాబితాలో వున్నారు. వాళ్ల నేరాలు ఏమైనవి? ఆంధ్ర ప్రదేశ్‌ లో వైసిపి పాలనలో జరిగిన మద్యం కుంభకోణం ముందు దిల్లీ మద్యం స్కామ్‌ ఎంత? ఆ రోజుల్లో ఎందుకు పట్టించుకోలేదు? జగన్మోహన్‌ రెడ్డిపై మోపబడిన కేసులు ఏమైనవి? అప్పుడప్పుడు ఉన్నత న్యాయ స్థానాలు జగన్మోహన్‌ రెడ్డి కేసుల గురించి అడిగే ప్రశ్నలకు సిబిఐ అధికారులు నీళ్లు నములుతున్నారు.

గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం
కేంద్రానికి బిజెపికి అనుకూలంగా వున్న రాష్ట్రాల్లోని గవర్నర్‌ లు వివాదాస్పద బిల్లులైనా వెంటనే ఆమోదించుతున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో మూడు రాజధానుల బిల్లు వివాదాస్పదం కాదా? ప్రతి పక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో మరో రకంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. తమిళ నాడు గవర్నర్‌ ఎన్ని బిల్లులకు ఎన్ని నెలలు బ్రేక్‌ వేశారు? అదృష్టవశాత్తు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సజీవంగా వుండినది కాబట్టి సరి పోయింది. లేకుంటే తమిళ నాడు ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? అయితే వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిజ స్వరూపం బయట పడిరది. ఈ దెబ్బతో దేశ ప్రజాస్వామ్య లౌకిక పౌర సమాజంలో అత్యధిక భాగం ఒక్క సారిగా ఉలిక్కి పడిన మాట మాత్రం వాస్తవమే అయినా రావలసినంత స్పందన రాని మాట నిజమే.

‘‘అంతిమంగా అర్బన్‌ నక్సలైట్ల నామకరణం ఎంత వరకు వెళ్లినదంటే రాహుల్‌ గాంధీకి ఈ టైటిల్‌ తగిలించారు.అప్ఫటికిగాని చాల మందికి తెలిసి రాలేదు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సర్వస్వం అర్పించిన నెహ్రూ కుటుంబాన్ని ఆయన విధానాలను టార్గెట్‌ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. నెహ్రూ సోవియట్‌ యూనియన్‌ నుండి ఉద్దీపన పొంది పంచవర్ష ప్రణాళికలు ప్రణాళిక సంఘం ఏర్పాటు ఉక్కు విద్యుత్‌ రంగాలకు ప్రభుత్వ రంగంలో పెద్ద పీట వేయడం కమలనాథుల దృష్టిలో నేరమైంది. దేశ సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఇందిరా గాంధీ కుటుంబాన్ని వదల లేదు. విచారకరమైన అంశమేమంటే దేశ జాతి పిత మహాత్మాగాంధిని హత్య చేసిన వారు వీరికి దేశ భక్తులైనారు..’’

ఇతరుపై పడరని గ్యారంటీ ఏమిటి?
వక్ఫ్‌ బోర్డులో అన్య మతస్తులు వుండాలనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ బిల్లుకు మద్దతు పలికిన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఆంధ్ర ప్రదేశ్‌ లో టిటిడి లోని అన్యమతస్తులను ఇతర శాఖలకు బదలీ చేస్తున్నారు. అందుకే తాను వక్ఫ్‌ బోర్డులో అన్య మతస్థులను అనుమతించనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి చట్టంలో ఉన్న నిబంధన ఆచరణలో ఏలా తిరస్కరించ గలరు? సుప్రీంకోర్టులో ఈ క్లాజ్‌ పై కేంద్ర ప్రభుత్వ లాయర్‌ నీళ్లు నమిలారు. ఈ దుర్విధానం మున్ముందు క్రైస్తవ ఇతర సమాజాలపై పడదనే గ్యారంటీ ఏమిటి? వందల సంవత్సరాల క్రితం వక్ఫ్‌ బోర్డు కిందకు భూములు అక్రమంగా వచ్చాయని చెబుతూ వాటి స్వాధీనానికి పార్లమెంటు చేత రాజ ముద్ర వేసుకున్నారు. నాజీ జర్మనీకి చెందిన ప్రొటెస్టెంట్‌ మత గురువు మార్టిన్‌ నీమోల్లర్‌ వాపోయినట్లు భారత దేశంలో కూడా ఒకరి భరతం పట్టిన తర్వాత మరొకరిపై పడరని గ్యారంటీ ఏమిటి? బిజెపికి చెందిన పార్లమెంటు సభ్యులు దూబే ప్రకటన మరీ దారుణం. మాజీ ఎన్నికల సంఘం కమిషనర్‌ ఖురేషీపై నాజీల కన్నా హీనంగా మాట్లాడారు. క్రీస్తు శకం 712 తర్వాతనే ముస్లింలు భారత దేశం వచ్చి భూములు ఆక్రమించుకున్నారని నేడు అవన్నీ స్వాధీనం చేసుకోవాలని దూబే డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత వచ్చిన క్రిస్టియన్‌ ల భవిష్యత్తు ఏమిటి? ఇలా చెప్పుకు పోతే ఎవరు మిగులుతారు? ఈ ఎపిసోడ్‌ ఇంత వరకే పరిమితం కాలేదు. తమిళ నాడు శాసన సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ తొక్కి పెట్టడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతి పుంజం లాగా అశేష భారత దేశ లౌకిక పౌర సమాజానికి ప్రజా స్వామ్యం ప్రియులకు బలం చేకూర్చింది.

రాజ్యాంగ బద్ధ పరిధి దాటిన ఉప రాష్ట్రపతి
తమిళ నాడు బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పు దిల్లీ పీఠానికి పెద్ద కుదుపే ఇచ్చింది. కాబట్టే అనూహ్యంగా ఉప రాష్ట్రపతి రాజ్య సభ చైర్మన్‌ జగదీష్‌ థన్కర్‌ రంగంలోనికి దిగారు. ఉప రాష్ట్రపతి వాడిన పద జాలం కూడా తీవ్రమైనదే. తదుపరి పార్లమెంటు సభ్యుడు దూబే ప్రకటనకు బిజెపికి సంబంధం లేదని చెప్పినట్లే ఒక రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ పనితీరును విమర్శించితే ప్రపంచమంతటా ప్రజా స్వామ్య రక్షకుడుగా వున్న ప్రధాన మంత్రి మోదీ ఎందుకు నోరు విప్ప లేదు? గుజరాత్‌ నాయకద్వయానికి ముందుగా తెలియక పోయివుంటే పార్లమెంటు సభ్యుడు దూబే ప్రకటనకు ఇచ్చిన లాంటి వివరణ ఉప రాష్ట్రపతి విషయంలో ఇచ్చి వుండే వారు కదా? ఈ పరిణామమెంత వరకు వెళ్లినదంటే పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వెనుకంజ వేయవలసి వచ్చింది.

ఒకటి కాదు! వీలైనన్ని అడ్డ దారులు వెతుకు తున్నారు?
కాంగ్రెస్‌ పార్టీ మిగిల్చిన రాజకీయ శూన్యత ఆధారంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అవతరించాయి. అదొక చారిత్రక దశ. కాని 2014 తర్వాత ప్రాంతీయ పార్టీల అగ్ర నేతల బలహీనతలను ఆధారం చేసుకొని బిజెపి వారిని అదుపులోనికి తెచ్చుకోవడం లేదా పార్టీని చీల్చే కార్యక్రమం మొదలైంది. ప్రాంతీయ పార్టీలకు చెంది ఇది రెండవ దశ. మరి కొంతమందిని బకరాలు చేసి ఏకచ్ఛత్రాధిపత్యం సాధించే క్రమంలో భాగమే జమిలీ ఎన్నికలు, నియోజ కవర్గాల పునర్విభజన ప్రతి పాదనలు. మరో ప్రతిపాదన హిందీ భాష తప్పనిసరి చేయడం. హిందీ భాషను తప్పనిసరి చేసి దేశ సమగ్రత కాపాడుతామని చెబుతున్నారు. గాని వాస్తవంలో లేని పోని ఉపద్రవాలకు కారకులవుతున్నారు. ఆలాగే దక్షిణాది భాషలు కూడా హిందీ భాషా రాష్ట్రాల్లో తప్పని సరి చేయాలనే డిమాండ్‌ కు కేంద్రం వద్ద సమా ధానం లేదు.. ఇవన్నీ చాలవన్నట్లు మధుర కాశీ ప్రాంతాల్లో ప్రార్థన మందిరాల ఉద్యమంలోనికి సంఫ్‌ు పరివార శక్తులు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా ప్రధాన మంత్రి మోదీ నాగ్‌ పూర్‌ సందర్శన. ఈ సంఘటనపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి.

అంతిమంగా ప్రధాని మోదీ తన విధానాలకు మరింత ‘‘డోస్‌’’ పెంచుతారేమో? అగ్నికి వాయువు తోదైనట్లు తాజాగా పొరుగు దేశంతో తగాదా. అనూహ్యంగా కాశ్మీర్‌ లో ముష్కరులు పర్యాటకులను హత మార్చిన సంఘటన దేశాన్ని ఎటు వేపు మళ్లించుతుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా 2024 ఎన్నికల్లో బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాలేదు. వాస్తవంలో సున్నితమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎంతో హుందాగా తటస్థంగా వ్యవహరించాలి. అందుకు భిన్నంగా వక్ఫ్‌ బోర్డుపైపడ్డారు. మున్ముందు పరిణామాలు ఏలా వుంటాయో ఏమో గాని వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదానికి తోడ్పడిన జనతా దళ్‌ (యునైటెడ్‌) నేత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, తెలుగు దేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లకు చరిత్ర లో ప్రత్యేక పుటలు వుంటాయి.

image.png
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు
Tags: Fascism? New-fascism?
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist