• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Saturday, August 1, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

మైమరిపించేలా ఓరుగల్లు అందాలు..

Taza Cinema by Taza Cinema
2025-05-14
in Interviews
Reading Time: 2 mins read
0 0
A A

తిలకించేందుకు ప్రపంచ సుందరీమణుల రాక..
విశ్వవ్యాప్తం కానున్న వరంగల్ జిల్లా ఖ్యాతి..
నేడు వరంగల్, ములుగు జిల్లాలో పర్యటన
కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు.. చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.. భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం.. రమణీయ శిల్ప సౌందర్యం.. అద్భుతమై ఆలయాలు..అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం.. ఒకటి కాదు రెండూ కాదూ..వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం.. త్రినగరిలో.. కొలువైన త్రికూటాలయం.. వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం.. కాకతీయ రాజుల కట్టడాలు.. నేటికీ ఆనాటి చరిత్రకు నిలువెత్తు సాక్షాలుగా నిలిచాయి.

వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం.. కాకతీయులు అద్భుతంగా నిర్మించారు. వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది.. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.. దీంతోపాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఇంతటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు.. పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివీ తీరా పరిశీంచేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం వరంగల్ గొప్ప తనం ఇట్టే తెలుస్తోంది..

image.png
నేడు ఓరుగల్లుకు సుందరీమణులు
ప్రపంచ సుందరీమణులు (మిస్ వరల్డ్-2025 పోటీదారులు) బుధవారం వరంగల్ జిల్లా పర్యటనకు వొస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. కాగా, 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని… అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఆయా జిల్లాల కలెక్టర్లు సుందరీమణుల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. వారికి ఎక్కడా ఏలాంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేపడుతోంది. ప్రభుత్వం వీరి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంంది.  ‘తెలంగాణ జరూర్ ఆనా’అనే థీమ్తో ప్రభుత్వం  అందాల భామలు ప్రాచీన ఆలయాలు.. పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించింది. తద్వారా వరంగల్ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

image.png
చారిత్రాత్మక ఆలయం.. వేయి స్తంభాల గుడి..
వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలువబడే ఈ చారిత్రాత్మక హిందూ దేవాలయం. తెలంగాణలోని హన్మకొండలో ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశ రాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం చేయబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. ఈ ఆలయం..ఈ గుడి క్రీ.శ. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశాల మేరకు నిర్మించారు. ఈ ఆలయం చాళుక్య శైలిలో నిర్మించబడింది. అయితే కాకతీయుల శిల్పకళా వైభవం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది.
నక్షత్రాకార పీఠంపై నిర్మితమైన ఈ త్రికూటాలయం అద్భుతమైన వాస్తుకళను ప్రదర్శిస్తుంది. ఆలయం కళ్యాణ మంటపం.. ప్రధాన ఆలయంతో కలిపి సుమారు వేయి స్తంభాలతో నిర్మించడంతో దీనికి “వేయి స్తంభాల గుడి” అనే పేరు వొచ్చింది.2005–2006లో భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ మంటపం కొన్ని స్తంభాల పునర్నిర్మాణం జరిగింది. 2024లో 17 సంవత్సరాల తర్వాత కల్యాణ మంటపం సందర్శకుల కోసం తిరిగి తెరిచారు. వేయి స్తంభాల గుడి కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి, ఇంజినీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది.
కాకతీయుల వైభవానికి నిదర్శనం.. వరంగల్ కోట..
వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్యం కాలంలో నిర్మితమైన ఒక ఐతిహాసిక దుర్గం. ఈ కోట క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు విస్తరించిన చరిత్రను కలిగి ఉంది. కాకతీయులు (క్రీ.శ. 750-1323) ఈ కోటను నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. కాకతీయులు తమ పరిపాలనలో ఈ కోటను దుర్భేద్యంగా, అద్భుత నిర్మాణాలతో తీర్చిదిద్దారు. కోటలోని మూడు వృత్తాకార పొరలు, నాలుగు భారీ రాతి ద్వారాలు (కీర్తి తోరణాలు), స్వయంభూ శివాలయం వంటివి కాకతీయుల నిర్మాణ వైభవానికి నిదర్శనం.. కాకతీయ రాజు ప్రోల రాజు ఈ కోట నిర్మాణానికి పునాది వేశారని ప్రజలు నమ్ముతారు.
గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు వంటి రాజులు ఈ కోటను మరింత బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి, దాని పరిరక్షణ.. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. కాకతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కాకతీయ వైభవ సప్తాహం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణం (కీర్తి తోరణం) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ తోరణం కాకతీయుల నిర్మాణ కళాత్మకతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.
రామప్ప ఆలయం విశిష్టత..
ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఈ ఆలయం రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. శివునికి అంకితం చేయబడింది. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మితమై ఉంది. జూలై 25, 2021న, రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది.
ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీపడగా, 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా వోటు వేశారు. యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది. ఇంతటి అద్భుతమైన ఆలయాలు,, పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేందుకు ప్రపంచ అందాల భామలు తరలిరావడం చరిత్రలో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతోంది. వరంగల్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగడం జిల్లా ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. వీటన్నంటినీ తిలకించే అందాల భామలు మంత్రముగ్ధులు కావడం మాత్రం నిజం.. ప్రపంచ సుందరీమణుల పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేస్తుంటే.. జిల్లా ప్రజానీకం మాత్రం అందాల భామలను చేసేందుకు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist