• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

పదకొండేళ్ల ఫలహారపు, ప్రతీకారపు తెలంగాణ!  

Taza Cinema by Taza Cinema
2025-06-05
in Interviews
Reading Time: 3 mins read
0 0
A A

మనం సాధించుకోవలసినది ఏమిటి, భౌగోళిక తెలంగాణనా, ప్రజాస్వామిక తెలంగాణనా, సామాజిక తెలంగాణనా అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండేవి. ఎవరికి వాళ్లు తమ భావనల మీద గట్టిగా వాదనలు వినిపిస్తుండేవారు. ఉన్న వ్యవస్థ లోపల ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధించడం సాధ్యం కాదని, అందువల్ల మొట్టమొదట కనీసమైన భౌగోళిక తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని సామాజికీకరించడం కోసం, ప్రజాస్వామ్యీకరించడం కోసం ప్రయత్నించవచ్చునని ఒక అభిప్రాయం క్రమంగా బలం పుంజుకుని, చివరికి అదే విజయం సాధించింది.

అవును, 2014 జూన్ 2న భౌగోళికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తన ప్రయాణంలో ఈ జూన్ 2 కు పదకొండేళ్ల మైలు రాయి దాటింది. పదకొండేళ్లు అంటే సామాజిక పరిణామక్రమంలో, చరిత్రలో సుదీర్ఘ సమయం ఏమీ కాకపోవచ్చు. కాని ఒక వ్యక్తి జీవితంలో, ఒక సమాజపు, ఒక రాష్ట్రపు రాజకీయార్థిక పరిణామాలలో గణనీయమైన కాలమే. ఈ కాలంలో ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ దిశగా ఏమైనా అడుగులు పడ్డాయా అనేది అనుమానమే. ప్రతి జూన్ 2న తెలంగాణ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నప్పుడు ఈ ప్రయాణం ఎంత దూరం గడిచిందో, అసలు ఈ ప్రయాణంలో తాను నిర్దేశించుకున్న మార్గంలో నడిచిందో లేదో, ఇంకా ఈ దిశలో ఎంతదూరం నడవవలసి ఉందో మదింపు వేసుకునే ఆలోచనైనా చేసిందా అనేది కూడా అనుమానమే. తెలంగాణ వచ్చిందంటే వచ్చింది, ఏటేటా మొక్కుబడిగా, గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా పుట్టినరోజు పండుగ జరుపుకోవడం, జెండాలు ఎగరేయడం, ఏలికలకు వంది మాగధులు, భజనపరులు, కవి గాయక బృందాలు పలికే స్తోత్ర పాఠాలలో మురిసి మునిగిపోవడం మాత్రమే జరిగింది. పదకొండు సంవత్సరాల ప్రయాణంలో తెలంగాణ ఎన్నడైనా వెనక్కి తిరిగి, ఈ ప్రయాణం ఎందుకోసం మొదలు పెట్టాను, ఆ దారిలో నడుస్తున్నానా లేదా, దారి ఎక్కడ తప్పిపోయాను, ఎవరు తప్పించారు, మళ్లీ ఈ బండి పట్టాలు ఎక్కడం ఎట్లా అని ఆలోచించుకున్నదా అనుమానమే.

ఇది ఏ ఒక్క పార్టీకో, సంఘానికో, వ్యక్తికో సంబంధించిన విషయం కాదు, ఏ ఒక్కరి మీదనో విమర్శ కాదు. మొత్తంగా తెలంగాణ సమాజమే, తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించవలసిన సమస్య. తెలంగాణ భూమిపుత్రులు సగర్వంగా చెప్పుకునే ధిక్కార, స్వతంత్ర, స్వాభిమాన ప్రవృత్తే ఈ పదకొండు సంవత్సరాలలో ఏమయిపోయింది, భౌగోళిక తెలంగాణ సాధించడమే తెలంగాణ స్వాభిమానానికి గొడ్డలి పెట్టు అయిందా, ఎవరో కొందరు నాయకులు, కొందరు ఆలోచనాపరులు దారి తప్పిస్తే, తెలంగాణ సమాజం ఎట్లా అంగీకరించింది మరొక్కసారి ఆలోచించుకోవలసిన సందర్భం ఇది.

ఇది ఏ ఒక్క పార్టీకో, సంఘానికో, వ్యక్తికో సంబంధించిన విషయం కాదు, ఏ ఒక్కరి మీదనో విమర్శ కాదు. మొత్తంగా తెలంగాణ సమాజమే, తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించవలసిన సమస్య. తెలంగాణ భూమిపుత్రులు సగర్వంగా చెప్పుకునే ధిక్కార, స్వతంత్ర, స్వాభిమాన ప్రవృత్తే ఈ పదకొండు సంవత్సరాలలో ఏమయిపోయింది, భౌగోళిక తెలంగాణ సాధించడమే తెలంగాణ స్వాభిమానానికి గొడ్డలి పెట్టు అయిందా, ఎవరో కొందరు నాయకులు, కొందరు ఆలోచనాపరులు దారి తప్పిస్తే, తెలంగాణ సమాజం ఎట్లా అంగీకరించింది మరొక్కసారి ఆలోచించుకోవలసిన సందర్భం ఇది.

పదకొండు సంవత్సరాలను కలిపి ఒక్క ముద్దగా చెపుతున్నానంటేనే, ఇది ఏదో ఒక పార్టీ మీద విమర్శ కాదని అర్థం. ఈ పదకొండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి) తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించింది. భారత జాతీయ కాంగ్రెస్ ఒక సంవత్సరంన్నరగా పాలిస్తున్నది. పాలకులు ఎవరైనా, మొత్తంగా తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది, ఏం ఒరిగింది, తెలంగాణ ప్రజలు సబ్బండవర్ణాలు ఒక్కటయి ఏ ఆకాంక్షలతో తెలంగాణ సాధన కోసం పని చేశారో, కష్టానష్టాలు పడ్డారో, సమయమూ సంపదా శ్రమా వెచ్చించారో, కేసుల్లో ఇరికి జైళ్ల పాలయ్యారో, ప్రాణ త్యాగాలు కూడా చేశారో ఆ ఆకాంక్షలకు ఏమయిందో ఈ పదకొండేళ్లలో ఎప్పుడైనా నిర్మొహమాటంగా,  నిర్దిష్టంగా,  నిష్పక్షపాతంగా,  వాస్తవికంగా సమీక్షించుకున్నామా? ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఆ పని చేయదలచుకుంటే వారి నోరు ఎట్లా మూయించాము?

ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాము, ఆరు దశాబ్దాల పరాయి పాలన కల్పించిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రజాస్వామిక తెలంగాణకు, సామాజిక తెలంగాణకు చేరుదాము అని మలిదశ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు చెప్పినవారు తామే అధికార పగ్గాలు చేపట్టి, ఆ దిశగా ఇసుమంత ప్రయత్నం కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచీ ఎన్నడూ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్సభాస్వాతంత్ర్యాలు వాస్తవికంగా అమలు కాలేదు. నిజాం పాలన లోని గష్తీ నిషాన్ 52, 53 లను మించిన ఆంక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. అధికరణం 19 ప్రభువులకు అనుకూలంగా మాత్రమే అమలయింది. అధికరణం 21 జీవించే హక్కు అడుగడుగునా, ముఖ్యంగా 1969 నుంచి, కొల్లగొట్టబడి, బూటకపు ఎన్ కౌంటర్లలో వేలాది మండి తెలంగాణ బిడ్డలు చంపివేయబడ్డారు. అటువంటి చీకటిరోజుల్లో బతికిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన అంటే ఈ బంధనాలు తొలగిపోవడంగా,  ప్రజాస్వామిక తెలంగాణ రావడంగా కలలుగన్నది. కనీసం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన ప్రారంభమవుతాయని ఆశించింది. ఇంతకాలం తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కాకపోవడానికి కోస్తా-రాయలసీమ పాలకులే కారణమనీ, వాళ్లను తొలగిస్తే ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లే తెలంగాణ ఏర్పడుతుందని నాయకులు నమ్మబలికారు. తెలంగాణ జనజీవన హృదయంలో ఎంత ధిక్కార స్వభావం ఉన్నదో అంత అమాయకత్వమూ ఉన్నది గనుక ఆ మాటలు నమ్మింది.

నిజాం పాలన లోని గష్తీ నిషాన్ 52, 53 లను మించిన ఆంక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. అధికరణం 19 ప్రభువులకు అనుకూలంగా మాత్రమే అమలయింది. అధికరణం 21 జీవించే హక్కు అడుగడుగునా, ముఖ్యంగా 1969 నుంచి, కొల్లగొట్టబడి, బూటకపు ఎన్ కౌంటర్లలో వేలాది మండి తెలంగాణ బిడ్డలు చంపివేయబడ్డారు. అటువంటి చీకటిరోజుల్లో బతికిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన అంటే ఈ బంధనాలు తొలగిపోవడంగా, ప్రజాస్వామిక తెలంగాణ రావడంగా కలలుగన్నది. కనీసం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన ప్రారంభమవుతాయని ఆశించింది. ఇంతకాలం తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కాకపోవడానికి కోస్తా-రాయలసీమ పాలకులే కారణమనీ, వాళ్లను తొలగిస్తే ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ, ప్రజాస్వామ్యం పరిఢవిల్లే తెలంగాణ ఏర్పడుతుందని నాయకులు నమ్మబలికారు. తెలంగాణ జనజీవన హృదయంలో ఎంత ధిక్కార స్వభావం ఉన్నదో అంత అమాయకత్వమూ ఉన్నది గనుక ఆ మాటలు నమ్మింది.

అట్లాగే ఆధిపత్యాన్ని, పెత్తందారీతనాన్ని, దొరతనాన్ని వందల ఏండ్లుగా ధిక్కరించిన, మెడలు వంచిన, ఓడించిన తెలంగాణే, మరొకసారి దొరతనపు నాయకత్వాన్ని అంగీకరించి, భౌగోళిక తెలంగాణ సాధిస్తే ఆ దొరతనం తనను తాను రద్దు చేసుకుని సామాజిక తెలంగాణ సాధించి పెడుతుందని నమ్మింది. ఎవరి నెత్తురు చెమటయితే ఈ భూమి తిరుగుతున్నదో, ఎవరి శ్రమతో ఈ భూమి మీద వెలుగూ వెన్నెలా సాధ్యమవుతున్నాయో, ఎవరికి ఆరుగాలం చాకిరీ తప్ప, కనీస హక్కులు దక్కలేదో వారికి భౌగోళిక తెలంగాణలో క్రమక్రమంగా అధికారం దక్కుతుందని, సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందని నమ్మింది. జనాభాలో మేం ఎంతో ఫలాలలో మాకు అంత అనే సహజమైన, ప్రజాస్వామికమైన నినాదం దశాబ్దాలుగా మార్మోగుతున్నది గనుక సామాజిక తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలంగాణ నమ్మింది. ఒక శతాబ్దం పైగానే తెలంగాణలో దళిత, బహుజన వర్గాల నాయకుల ఆవిర్భావం మొదలయినప్పటికీ, 1980ల తర్వాత, మొదటి తరం విద్యావంతులు, వ్యక్తీకరణ శక్తి ఉన్న ఆలోచనాపరులు విస్తారంగా రావడం, అనేక ప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావడం మొదలయింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయానికి ఆ వర్గాల నుంచి అనేక మంది సృజనాత్మక రచయితలు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా వెల్లువలా వచ్చారు. కాని ఏ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నిర్మాణంలో, నాయకత్వంలో వారికి సముచిత భాగాస్వామ్యం దక్కలేదు. ఆ నేపథ్యంలో వెలువడింది సామాజిక తెలంగాణ నినాదం. అప్పటి ఉద్యమ నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళితుడే అని వాగ్దానం చేసి, సామాజిక తెలంగాణ దిశలో ప్రయాణం సాగుతుందని హామీ ఇచ్చారు.

కాని భౌగోళిక తెలంగాణ సాకారమయ్యాక ఇటు ప్రజాస్వామిక తెలంగాణ లేదు, అటు సామాజిక తెలంగాణ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల కింద అనుభవించిన అణచివేతను మించిన అణచివేత, హక్కుల ఉల్లంఘన తెలంగాణ చవిచూసింది. చివరికి చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి వంటి కర్కోటక పాలకులు కూడా ఉండనిచ్చిన నిరసన స్థలాన్ని కూడ తెలంగాణాధీశులు కొల్లగొట్టారు. అరెస్టులు, చిత్రహింసలు, సభలు, సమావేశాల నిషేధం, తప్పుడు కేసులు, ప్రదర్శనలకు ముందే నిరసనకారుల మీద నిర్బంధం… ప్రజాస్వామిక తెలంగాణ అనేది కలలో కూడా కనబడని దినుసైపోయింది. సామాజిక తెలంగాణ అర్థాన్ని పలుచబార్చి, ప్రతి కులానికీ ఒక భవనం కట్టి ఇస్తే, లేదా వాగ్దానం చేస్తే, ప్రతి కులం లోంచి నలుగురైదుగురు భజనపరులను తయారు చేసుకుంటే అదే సామాజిక తెలంగాణ అన్నారు.

కాని భౌగోళిక తెలంగాణ సాకారమయ్యాక ఇటు ప్రజాస్వామిక తెలంగాణ లేదు, అటు సామాజిక తెలంగాణ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల కింద అనుభవించిన అణచివేతను మించిన అణచివేత, హక్కుల ఉల్లంఘన తెలంగాణ చవిచూసింది. చివరికి చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి వంటి కర్కోటక పాలకులు కూడా ఉండనిచ్చిన నిరసన స్థలాన్ని కూడ తెలంగాణాధీశులు కొల్లగొట్టారు. రెస్టులు, చిత్రహింసలు, సభలు,  సమావేశాల నిషేధం,  తప్పుడు కేసులు, ప్రదర్శనలకు ముందే నిరసనకారుల మీద నిర్బంధం… ప్రజాస్వామిక తెలంగాణ అనేది కలలో కూడా కనబడని దినుసైపోయింది. సామాజిక తెలంగాణ అర్థాన్ని పలుచబార్చి, ప్రతి కులానికీ ఒక భవనం కట్టి ఇస్తే, లేదా వాగ్దానం చేస్తే, ప్రతి కులం లోంచి నలుగురైదుగురు భజనపరులను తయారు చేసుకుంటే అదే సామాజిక తెలంగాణ అన్నారు.

గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం, దశాబ్దాల పాటు పోరాడి స్వపరిపాలన సాధించుకున్న రాష్ట్రం ఒక సుఫల క్షేత్రం. ఏమి రాసుకోవడానికైనా అవకాశం ఉన్న ఖాలీ  పలక. కాని పలక అంతా తనకే అనుకున్న దుడుకు పిల్లవాడు పలకను విరగ్గొట్టాడు, బలపాన్ని నమిలి మింగేశాడు. తరతరాల ఉజ్వల చరిత్ర ఉన్న భూమిని చవిటిపర్రను చేశాడు. మూడున్నర కోట్ల ప్రజల సజీవ అస్తిత్వాన్ని నలుగురు కుటుంబ సభ్యులకూ, పిడికెడు మంది రాగ్ దర్బారీ గాయకులకూ పరిమితం చేశాడు. ప్రజల కలలను నిజం చేసే, ఉన్న పరిమితుల లోపలే ఆదర్శవంతమైన పాలనను నెలకొల్పగలిగే గొప్ప అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నారు. ఒక గొప్ప రాష్ట్రాన్ని తమ కుటుంబ ఫలహారంగా భావించారు.

అలా తొమ్మిదిన్నరేళ్లు గడిచాక తెలంగాణ ప్రజలు తమ సహజ ధిక్కారాన్ని ప్రకటించి అధికార పీఠాన్ని తలకిందులు చేశారు. అయితే ఏడాదిన్నర కింద అధికార పీఠం అవరోహించినవారికి తెలంగాణ చరిత్రా తెలియదు, ఉజ్వల వారసత్వమూ తెలియదు, దాన్ని పునరుద్ధరించాలంటే, కొనసాగించాలంటే ఏమి చేయాలో తెలియదు. అలా చేయవలసిన పని తెలియదు గనుక, తెలిసిన పనే చేయడం మొదలుపెట్టారు. కొత్త తెలంగాణ ఏలికకు తెలిసినది వీథి పోరాటాలలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం మాత్రమే. ప్రత్యర్థి అవునన్నది కాదనడం మాత్రమే. ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే. అందువల్ల ఈ ఏడాదిన్నరలో కనబడుతున్నది ప్రతీకార తెలంగాణ మాత్రమే. మంచి చెడులతో, న్యాయాన్యాయాలతో, ఉచితానుచితాలతో సంబంధం లేదు, అవతలి వాళ్లు చేసినది తారుమారు చేయడం ఒక్కటే పని.

బహదూర్ షా జఫర్ అన్నాడు, ‘భగవంతుడి నుంచి నాలుగు క్షణాలు అడుక్కొచ్చుకుంటే రెండు ఆకాంక్షలో గడిచిపోయాయి, రెండు ఎదురుచూపులో గడిచిపోయాయి’ అని. అలా మొత్తం మీద తెలంగాణ పదకొండో పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ చూస్తే, తొమ్మిదిన్నర సంవత్సరాలు దొరలకు ఫలహారమైపోయింది. ఏడాదిన్నర ప్రతీకారమే మిగిలింది. అప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరగవలసిన ప్రయత్నం ఫలహారపు తెలంగాణలో అణగిపోయింది. తర్వాత ఏడాదిన్నరగా అధికారం చలాయిస్తున్నవాళ్లకు అసలు భౌగోళిక,  ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణాల చర్చలే తెలియదు. తెలంగాణ అంటే తెలుసునా అనేదీ సందేహమే. ఇక మిగిలినదల్లా తమకన్న ముందర జరిగినవాటికి ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే. అలా అచ్చంగా ప్రతీకారపు తెలంగాణ మాత్రమే ఇప్పుడు మిగిలింది.

బహదూర్ షా జఫర్ అన్నాడు, ‘భగవంతుడి నుంచి నాలుగు క్షణాలు అడుక్కొచ్చుకుంటే రెండు ఆకాంక్షలో గడిచిపోయాయి,  రెండు ఎదురుచూపులో గడిచిపోయాయి’ అని. అలా మొత్తం మీద తెలంగాణ పదకొండో పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ చూస్తే, తొమ్మిదిన్నర సంవత్సరాలు దొరలకు ఫలహారమైపోయింది. ఏడాదిన్నర ప్రతీకారమే మిగిలింది. అప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరగవలసిన ప్రయత్నం ఫలహారపు తెలంగాణలో అణగిపోయింది. తర్వాత ఏడాదిన్నరగా అధికారం చలాయిస్తున్నవాళ్లకు అసలు భౌగోళిక, ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణాల చర్చలే తెలియదు. తెలంగాణ అంటే తెలుసునా అనేదీ సందేహమే. ఇక మిగిలినదల్లా తమకన్న ముందర జరిగినవాటికి ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే. అలా అచ్చంగా ప్రతీకారపు తెలంగాణ మాత్రమే ఇప్పుడు మిగిలింది.

ఆ ఫలహారంలోనైనా, ఈ ప్రతీకారంలోనైనా ప్రజలు లేరు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం అని నిర్వచించే ప్రజాస్వామ్యం లేదు. అప్పుడు ఒక పాలకవర్గ ముఠా, ఇప్పుడు ఒక పాలకవర్గ ముఠా అధికారం చలాయిస్తున్నాయి గాని సబ్బండ వర్ణాలకు, సామాజిక వర్గాలన్నిటికీ సమాన భాగస్వామ్యం, సమాన ఫలాలు అందే సామాజిక తెలంగాణ లేదు. అత్యంత ఉజ్వలమైన ధిక్కార సంప్రదాయానికీ, వారసత్వానికీ నెలవైన తెలంగాణ స్వరాష్ట్రం సంపాదించుకుని మరింత పరాయిదైపోయింది!.

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist