హైదరాబాద్: ఐ-బొమ్మ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గురువారం చంచల్గూడ జైలు నుంచి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐ-బొమ్మ కేసులో రవికి ఐదు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రవి నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.











