విశాఖ: 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వరుసగా 8వ సారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సదస్సు ప్రపంచ వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు.
శుక్రవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతూ ప్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు. ఈ సదస్సు ద్వారా ప్రతీ ఆలోచనా, ప్రతీ పెట్టుబడి భవిష్యత్ తరాలకు సంపదగా మారాలని కోరుతున్నానని అన్నారు.











