• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Politics

బీజేపీ పెద్దలకు దగ్గరవుతున్న చంద్రబాబు

TDP chief Chandrababu Naidu is seen moving closer to BJP leadership, indicating a potential alliance ahead of the upcoming elections. This renewed political proximity may reshape Andhra Pradesh's political landscape.

Taza Cinema by Taza Cinema
2025-11-17
in Politics
Reading Time: 1 min read
0 0
A A
Chandrababu Naidu Strengthens Ties with BJP Leaders Ahead of Elections

ఏపీ సీఎం చంద్రబాబుకేంద్ర పెద్దల వైఖరి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రాధాన్యం కేంద్రంలో పెరిగింది. దానికి కారణం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి.. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని అందించగలిగింది తెలుగుదేశం పార్టీ. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు కేంద్ర పెద్దలతో చాలా సఖ్యతగా మెలుగుతూ వచ్చారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏ విషయంలోనూ గాబరా పడటం లేదు. కేంద్రంతో ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి లేదు. అయితే ఈ కేంద్ర పెద్దలతో నమ్మదగని మిత్రుడు అనిపించుకున్నారో.. అదే పెద్దలతో శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకుంటున్నారు.

విశాఖ పెట్టుబడుల సదస్సులో అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏపీ సీఎం మాట్లాడుతున్నంతసేపు తన చప్పట్లతో ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. అలాగని ఆయన ఏదో ఒక డమ్మీ కేంద్రమంత్రి కాదు. అక్షరాల ప్రధాని నరేంద్ర మోడీ కోర్ టీం లో ఉన్న నేత.2018లో ఎన్డీఏనుంచి దూరమయ్యారు చంద్రబాబు. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమై పనిచేసిన ఆయన.. ఉన్నఫలంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డారు. ఆ సమయంలో కేంద్ర పెద్దలతో ఢీ కొట్టినంత పని చేశారు.

అప్పుడే ఏపీలో చంద్రబాబు పని పట్టాలని కేంద్ర పెద్దలు నిర్ణయించుకున్నారు. కేంద్రానికి చెందిన ప్రత్యేక టీం ఏపీలో పనిచేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం వెనుక బిజెపి వ్యూహాలు ఉన్నట్లు అప్పట్లో టిడిపి అనుమానించింది. అయితే 2019 నుంచి 2024 మధ్య ప్రతి పరిణామాన్ని గుణపాఠంగా మార్చుకుంది టిడిపి. తన తప్పు తెలుసుకున్న చంద్రబాబు కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర పెద్దలు చంద్రబాబును నమ్మడం లేదన్న ప్రచారానికి చెక్ చెబుతూ.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు అభినందనలతో ముంచెత్తడం విశేషం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో.. సిఐఐ  నేతృత్వంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగింది.

దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోంది అని ఈ పెట్టుబడుల సదస్సుతో తేలిపోయింది. గత కొద్ది రోజులుగా ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏర్పాటు అవుతున్నాయి. తద్వారా ఏపీకి తమ సాయం ఉంటుందని కేంద్రం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. 2014 నుంచి 2024 వరకు ఏపీ విషయంలో కేంద్రం నుంచి అసంపూర్ణ సహకారం అందేది.

కానీ గడిచిన 17 నెలల కాలంలో కేంద్రం వైఖరి చూస్తుంటే ఏపీ పట్ల పూర్తి ఉదారస్వభావం చూపుతున్నట్లు అర్థమవుతోంది. స్వయంగా ప్రధానికి అత్యంత సన్నిహితుడు అయిన పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబు పట్ల చూపుతున్న గౌరవం చూస్తుంటే మాత్రం.. బిజెపి పెద్దలకు అత్యంత ఇష్టుడైన నాయకుడిగా చంద్రబాబు అవతరించారని అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు.

Tags: Andhra Pradesh politicsAP elections 2024BJP alliance newsChandrababu Naidu BJPChandrababu political strategyNaidu meets BJP leadersTDP BJP alliance
SendShareTweetShareShare

Related Posts

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు
Politics

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు

2026-03-06
Red Sandalwood Smuggler Sentenced to 5 Years in Prison by Court
Cinema Stills

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

2025-11-29
Why Is Pawan Kalyan Silent? Political Circles Buzz
Politics

పవన్ ఎందుకీ మౌనం

2025-11-27
TDP faces internal turbulence as MLA's actions
Politics

టీడీపీలో పంచాయితీలు

2025-11-27
A Huge Setback for the Maoists: Security Forces Tighten Grip
Cinema Stills

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

2025-11-22
Local Bodies Boycott YCP Strategy: Political Backlash Grows
Politics

లోకల్ బాడీస్.. బాయ్ కాట్… వైసీపీ వ్యూహం…

2025-11-22

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist