విశాఖపట్నం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్ లో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదస్సును
ప్రారంభించారు. భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు హజరయ్యారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్
విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గోన్నారు.
విశిష్ట అతిథులుగా కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి తదితర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు , పెట్టుబడిదారులు వచ్చారు.











