• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, July 29, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Politics

ఎల్ఆర్ఎస్ కు జనవరి 23 వరకు గడువు

LRS Deadline Extended Till January 23 in Andhra Pradesh: Apply Soon!

Taza Cinema by Taza Cinema
2025-11-15
in Politics
Reading Time: 1 min read
0 0
A A
LRS Deadline Extended Till January 23 in Andhra Pradesh: Apply Soon!

విజయవాడ, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువును వచ్చే ఏడాది జనవరి 23 వరకు పొడిగించింది. అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ఇది మంచి అవకాశం. 2025 జూన్ 30కి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంటి స్థలాలకు ఓపెన్ స్పేస్ ఛార్జీలో 50% రాయితీ కూడా అందిస్తున్నారు. ఈలోపు అనధికారికంగా ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎల్ఆర్ఎస్ ద్వారా అనధికార లేఔట్లలో స్థలాలు కొన్న వారికి మంచి అవకాశం వచ్చిందనే చెప్పాలి.

కొంతమంది అమాయకంగా అనుమతులు లేని లేఔట్‌లలో స్థలాలు కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఈఎంఐ ఆప్షన్, తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేయడం వల్లే ఇలా జరుగుతోంది. వారికి కూడా ఎల్‌ఆర్ఎస్‌తో ఎంతో ఉపయోగం.ఇలా అనధికారిక లేఔట్‌‌లో స్థలాలు కొనుగోలుచేసేవారు ఎల్‌ఆర్‌ఎస్‌ వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం 2025 జూన్‌ 30కి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించింది. వాస్తవానికి ఎల్ఆర్ఎస్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 23 పూర్తైంది.. కానీ మరోసారి 2026 జనవరి 23 వరకు పొడిగించింది. దీని కోసంఎల్‌టీపీ (లైసెన్స్డ్‌ టెక్నికల్‌ పర్సన్‌) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన పీనలైజేషన్, ఇతరత్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

స్థలం మీదే మీకు హక్కు ఉందని చూపించడానికి, 2025 జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలతో పాటు, మీ స్థలం ఎంత ఉందో, దాని చుట్టూ ఏమున్నాయో, పక్కనున్న రోడ్లు ఎంత వెడల్పు ఉన్నాయో తెలిపే సైట్ ప్లాన్‌ను కూడా జతచేయాలి. అంతేకాకుండా, సబ్‌రిజిస్ట్రార్ సంతకం చేసిన ఈసీ  మరియు మార్కెట్ విలువ సర్టిఫికేట్ కూడా అవసరం. భూమిని ఒక అవసరం నుంచి మరో అవసరానికి మార్చినట్లు తెలిపే ల్యాండ్ యూజ్ కన్వెర్షన్ సర్టిఫికేట్ కూడా చూపించాలి. వీటితో పాటు, ఏదైనా నష్టం జరిగితే బాధ్యత వహిస్తామని తెలిపే ఇండెమ్నిటీ బాండ్, రోడ్డు విస్తరణ కోసం చేసుకున్న ఒప్పంద పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ సమర్పించడం ద్వారా స్థలంపై మీ యాజమాన్యాన్ని ధృవీకరించుకోవచ్చు.ఒకవేళ ఎల్ఆర్ఎస్ కింద ఇంటి స్థలాలు క్రమబద్ధీకరించుకుంటే.. వారికి ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది.

ఓపెన్‌ స్పేస్‌ ఛార్జిలో 50% రాయితీ ఇస్తోంది. ఖాళీ స్థలాలపై నిబంధనల ప్రకారం 14% ఛార్జీలు ఉంటే.. ప్రస్తుతం 7% చెల్లిస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తులు భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని.. ప్రభుత్వం మరోసారి గడువు పెంచే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ క్రమ బద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. అనధికారిక లేఔట్లలో నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వదు.

ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినా చట్టవిరుద్ధం.. వాటిని కూల్చేస్తారు. అమ్మకాలు, కొనుగోలుకు ఛాన్స్ లేకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిషేధిత భూముల జాబితాలో చేర్చేస్తారు. అలాగే ఖాళీ స్థలాలకు వీఎల్‌టీ (వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) వేయరు. ఒకవేళ ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే.. బ్యాంకుల నుంచి రుణాలు కూడా రావు. తాత్కాలిక నిర్మాణాలకు కూడా నంబర్లు ఇవ్వరు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆ లేఔట్లలో మౌలిక సదుపాయాలు కల్పించదు.

Tags: AP government land rulesAP LRS deadlinelayout regularization APLRS Andhra PradeshLRS application processLRS apply onlineLRS last date 2025LRS news updateLRS scheme APproperty regularization AP
SendShareTweetShareShare

Related Posts

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు
Politics

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు

2026-03-06
Red Sandalwood Smuggler Sentenced to 5 Years in Prison by Court
Cinema Stills

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

2025-11-29
Why Is Pawan Kalyan Silent? Political Circles Buzz
Politics

పవన్ ఎందుకీ మౌనం

2025-11-27
TDP faces internal turbulence as MLA's actions
Politics

టీడీపీలో పంచాయితీలు

2025-11-27
A Huge Setback for the Maoists: Security Forces Tighten Grip
Cinema Stills

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

2025-11-22
Local Bodies Boycott YCP Strategy: Political Backlash Grows
Politics

లోకల్ బాడీస్.. బాయ్ కాట్… వైసీపీ వ్యూహం…

2025-11-22

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist