అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ మహేంద్ర మీడియాకు వివరించా రు.మరో 8 మంది నిందితులు పరా రీలో ఉన్నారని వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
నిందితుల కోసం గోవా, కర్ణాటక, తెలంగాణలో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.ఈనెల 9వ తేదీన మదనపల్లి పట్టణం గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ ఆయ న బృందంతో కలిసి విశాఖకు చెంది న యమున కిడ్నీని తొలగించి మరో వ్యక్తికి అమర్చి శస్త్ర చికిత్స చేశారు.
అనంతరం యమున శస్త్ర చికిత్స వికటించి 10 తేదీన మృతి చెందిం ది. ఈ సంఘటన సంబంధించి మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో మొదటి నిందితుడు గ్లోబల్ స్పెషాలిటీ ఆసుపత్రి యజమానితోపాటు అన్నమయ్య జిల్లా హాస్పిటల్స్ సేవల కోఆర్డినేటర్ డాక్టర్ కె. ఆంజనేయులు, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. రెండో నిందితుడిగా ఉన్న బెంగ ళూరుకు చెందిన డాక్టర్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.











