• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Actress Gallery

Who is Next Bihar CM: సీఎం నితీష్ కాదా…

Who is the Next Bihar Chief Minister? Political Buzz Intensifies in Patna

Taza Cinema by Taza Cinema
2025-11-14
in Actress Gallery
Reading Time: 1 min read
0 0
A A
Who is the Next Bihar Chief Minister? Political Buzz Intensifies in Patna

పాట్నా, నవంబర్ 14: 20 ఏళ్లుగా బిహార్ సీఎం పీఠంపై కూర్చున్న నితీష్ కుమార్.. ఇక ఆ స్థానం నుంచి తప్పుకోనున్నారా. బీజేపీ, జేడీయూలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో జేడీయూ పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌, వెంటనే డిలీట్ చేయడం ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇంతకీ జేడీయూ ఏం ట్వీట్ చేసింది. తర్వాత ఎందుకు డిలీట్ చేసింది. బిహార్ సీఎం కుర్చీ.. ఇక నితీష్ కుమార్‌కు దూరమైనట్లేనా అనేది ఈ స్టోరీలో చూద్దాం బిహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఏకంగా 200 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకెళ్తూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే అంతా మళ్లీ నితీష్ కుమార్‌కే ముఖ్యమంత్రి పదవి అని పేర్కొంటున్నప్పటికీ.. ఎన్డీఏ కూటమి మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తమ సీఎం అభ్యర్థి ఎవరు అనేది వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం కుర్చీ ఎవరికి ఇస్తారు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఎన్నికల్లో చెరో 101 స్థానాలు తీసుకుని పోటీ చేసి.. ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి.. బిహార్ ముఖ్యమంత్రి కుర్చీపై ఎవరు కూర్చోబెడుతుందని ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా.. మొత్తం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని విజయాన్ని దాదాపు ఖరారు చేసింది. ఇక ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. మొత్తం 243 స్థానాల్లో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. ఇందులో బీజేపీకి 91 సీట్లు, జేడీయూ 79 స్థానాలు ఇప్పటివరకు గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును

పేర్కొంటూ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్ ) పార్టీ ఒక ట్వీట్ చేసింది. అయితే ఆ వెంటనే దాన్ని డిలీట్ చేయడంతో.. బిహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.బిహార్‌లో ఎన్డీఏ కూటమి సాధించిన రికార్డు స్థాయి విజయంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అని.. ఇప్పుడు ఎప్పుడూ అంటూ జేడీయూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. దానికి నితీష్ కుమార్‌తో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ను జేడీయూ డిలీట్ చేసింది.

ఇదే ఇప్పుడు సరికొత్తకు చర్చకు దారితీసింది.ఇప్పుడే కాదు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కే ముఖ్యమంత్రి పదవి అని అంతా భావించారు. కానీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ హైకమాండ్ గానీ, జేడీయూ గానీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని ఎక్కడా ప్రకటించలేదు. దీనికితోడు 74 ఏళ్ల నితీష్ కుమార్‌ ఆరోగ్యం కూడా ఒక సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచినా.. సీఎం నితీష్ కుమార్ ఉండరు అనే ప్రచారం కూడా అంతకుముందు జరిగింది.

అందుకే సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.అయితే ఈ ప్రచారాన్ని మాత్రం జేడీయూ నేతలు కొట్టిపారేస్తున్నారు. బిహార్ సీఎం ఎప్పటికీ నితీష్ కుమార్ అంటూ స్పష్టం చేస్తున్నారు. 2005 నుంచి ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారని.. ఇప్పుడు కూడా ఆయనే ఈ పదవిని అలంకరిస్తారని పేర్కొంటున్నారు. మరోవైపు.. బీజేపీ నేతలు మాత్రం బిహార్ సీఎం ఎవరు అనే దానిపై ఇంకా స్పందించడం లేదు.

Tags: Bihar CM raceBihar electionsBihar Elections 2025Bihar leadership changeBihar politicsCM race Biharnext Bihar Chief Ministernext CM of BiharNitish Kumarpolitical news Bihar
SendShareTweetShareShare

Related Posts

Supreme Court Raises Alarm Over Infiltrators Securing Aadhaar Cards
Actress Gallery

చొరబాటు దారులు ఆధార్‌ కార్డులు పొందటంపై సుప్రీం కోర్టు ఆందోళన

2025-11-28
Delhi Police Operation
Actress Gallery

ఢిల్లీ పోలీసుల ఆపరేషన్…

2025-11-27
Maoists Offer to Surrender Arms by February in Open Letter to 3 CMs
Actress Gallery

ఫిబ్రవరికల్లా ఆయుధాలు వదిలేస్తాం వేటాడవద్దు

2025-11-25
End of an Era Dharmendra's Legacy Remembered on November 24
Actress Gallery

బాలీవుడ్ హీ మ్యాన్ ‘ధర్మేంద్ర’ కన్నుమూత

2025-11-25
CM Siddaramaiah & DK Shivakumar Clash Over Power-Sharing Deal
Actress Gallery

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ

2025-11-21
Delhi Red Fort Blast: Massive Explosion Near Metro Station
Actress Gallery

Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

2025-11-10

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist