• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, July 29, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Politics

కొత్త నేతలపై దృష్టి…

The YSR Congress Party is focusing on promoting new leadership within the party to strengthen grassroots presence and future political strategy across Andhra Pradesh.

Taza Cinema by Taza Cinema
2025-11-18
in Politics
Reading Time: 1 min read
0 0
A A
YSRCP Shifts Focus to Emerging New Leaders

వైసీపీ అధినేత జగన్ కు ఒక అభిప్రాయం మాత్రం మైండ్ లో నుంచి ఇంకా పోలేదు. దారుణమైన ఓటమి తర్వాత కూడా జగన్ మాత్రం ఆ మైండ్ సెట్ ను మార్చుకోవడం లేదు. అదే తన బొమ్మతోనే గెలుస్తారనుకోవడం. అది జగన్ భ్రమ. 2019లో గెలిచింది తనవల్లనేనన్న భ్రాంతి నుంచి జగన్ ఇంకా బయటపడటం లేదు. నాడు జగన్ పార్టీ గెలుపునకు అనేక కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం, జనసేన మరో కూటమితో జట్టు కట్టడం, బీజేపీ సొంతంగా పోటీ చేయడం ఇలా జగన్ కు 2019 ఎన్నికలు అలా కలసి వచ్చాయి.

జగన్ పాదయాత్ర కొంత మేరకు పనిచేసి ఉండవచ్చు. కానీ నియోజకవర్గాల్లో అభ్యర్థులే జయాపజయాలకు కీలకమని ఎన్నో ఎన్నికలు తేల్చి చెప్పాయి.ఆంధ్రప్రదేశ్ అందులోనూ విభజన తర్వాత పూర్తిగా కులాల వారీగా చీలిపోయింది. సామాజికవర్గాల వారీగా ఓటర్లు చీలిపోయి ఉన్నారు. అలాగని ప్రతి సామాజికవర్గంలో గంపగుత్తగా ఓటర్లు జగన్ కే పట్టం కట్టరు.

చంద్రబాబుకు కూడా జై కొట్టరు. కానీ స్థానికంగా వారికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకమవుతారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడానికి జగన్ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు యాభై శాతం ఉంటే.. మిగిలిన యాభై శాతం ఓటమి స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపైనే ఉందన్నది కూడా వాస్తవం. అందుకే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకం.

పార్టీ, పార్టీ అధినేత పది శాతం వరకూ మాత్రమే విజయానికి ప్లస్ గా మారతారు. .. అందకుంటే ఇలా చేయండి పాదయాత్ర చేసినందున… మిగిలిన విషయాల్లో మాత్రం స్థానిక రాజకీయాలే ప్రభావితం చేస్తాయి. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం, స్థానికంగా ఉండే సమస్యలపై గళం విప్పడం, వారి వ్యక్తిగత సమస్యలను సత్వరమే పరిష్కరించడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ లంచాల బారిన పడటం వంటివి ఎక్కువగా ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి.

అందుకే వైసీపీ అధినేత జగన్ కూడా తాను మళ్లీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని అనుకోవడం ఒక రకంగా పార్టీకి తన బొమ్మే ఫైనల్ అని తేల్చి చెప్పడమేనంటున్నారు. పాదయాత్ర వల్లనే గతంలో కొందరు అధికారంలోకి ఉండివచ్చు. కానీ కేవలం పాదయాత్ర వల్లనే అధికారంలోకి రారన్నది కూడా అనేక రాష్ట్రాల్లో స్పష్టమయింది. బీహార్ లో ప్రశాంత్ కిషోర్, మధ్యప్రదేశ్ లో నాడు దిగ్విజయ్ సింగ్ పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాలేకపోయిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయిలో మంచి నాయకత్వాన్ని ఎంపిక చేయడమే విజయానికి అసలు మార్గమని పలువురు సూచిస్తున్నారు.

Tags: Andhra PradeshJagan Mohan Reddyleadership changeNew Leadersparty strategypolitical developmentPoliticsregional politicsyouth leadershipYSR Congress PartyYSRCPYSRCP new leaders
SendShareTweetShareShare

Related Posts

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు
Politics

చంద్రబాబు గారు చెపితే సంగం డెయిరీకి టెండర్ ఇవ్వలేదు, స్వామి అవకాశం ఇచ్చారు

2026-03-06
Red Sandalwood Smuggler Sentenced to 5 Years in Prison by Court
Cinema Stills

ఎర్రచందనం స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ.6లక్షల జరిమానా

2025-11-29
Why Is Pawan Kalyan Silent? Political Circles Buzz
Politics

పవన్ ఎందుకీ మౌనం

2025-11-27
TDP faces internal turbulence as MLA's actions
Politics

టీడీపీలో పంచాయితీలు

2025-11-27
A Huge Setback for the Maoists: Security Forces Tighten Grip
Cinema Stills

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

2025-11-22
Local Bodies Boycott YCP Strategy: Political Backlash Grows
Politics

లోకల్ బాడీస్.. బాయ్ కాట్… వైసీపీ వ్యూహం…

2025-11-22

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist