బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.











