• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

బతుకమ్మ’ ధిక్కార స్వరం ‘టీ’ కప్పులో తుపాన్..!

Taza Cinema by Taza Cinema
2025-06-11
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కేసీఆర్ తనయ కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. ఏడాదిన్నరగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి , ప్రజలను ఎలా రెచ్చగొట్టాలి బీఆర్ఎస్ పై వచ్చిన నిందలకు ఎలా సమాధానం చెప్పాలి అనే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమై ఉంటే పిడుగులాంటి ‘మై డియర్ డాడీ’ లెటర్ బీఆర్ఎస్ భవిష్యత్ పై మెరుపు దాడిగా వర్ణించక తప్పదు. ప్రభుత్వంలో ఉన్నన్ని నాళ్ళు ప్రగతి భవన్ గేటు తాకనియ్యలేదని నాటి మంత్రులు, ఒకవైపు ఎమ్మెల్యేలు మొత్తుకున్నట్టుగానే నేడు కవిత ఒక్కసారిగా దేవుడి చుట్టూ దయ్యాలంటూ వేదాలు అని వల్లించడం ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న పార్టీ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. ఇన్నాళ్లు కేసీఆర్ అంతరంగం బయట ప్రపంచానికి తెలియకుండా పార్టీ గడప దాటకుండా నోరు తెరిస్తే ఏమి అవుతుందో నన్న మీమాంస  వరంగల్ స్వర్ణోత్సవ సభ పుణ్యమాని కవితలో దాగి ఉన్న ఆవేదన జెట్ స్పీడ్ తో తన్నుకొచ్చింది. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందన్నదానికంటే ఆమె లేఖ ద్వారా ఆస్తుల,అవకాశాల పంపకాల లుకలుకలు బహిర్గతమైనాయి.

అయితే కవితకు తెలియనిది ఏమిటంటే 25 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో ఎందరో మేధావులు, రాజకీయ పండితులు ఎదిరించి కేసీఆర్ వ్యూహంలో బూడిద అయ్యారు, బతుకమ్మ చేసిన పనికి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదంటే అయన ఎంత నొచ్చుకున్నారో అర్థం అయ్యి ఉండాలి. ఎనుకటికి ఒక సామెత ఉండే గడ్డిబండి కింద పోయే శునకం బండిని నేనే మోస్తున్నాను అని అనుకున్నట్లే కవిత బీఆర్ఎస్ మూల స్థంభంగా ఫీల్ అయిందేమో కానీ,కేసీఆర్ అండలేక పొతే బతుకమ్మ పేరు వచ్చేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 2024లో బతుకమ్మ ఎక్కడ మాయమైంది. పార్టీని ఇరకాటంలో పడేసి లబ్ది పొందాలనే కుట్ర కొట్టచ్చినట్టు కన్పిస్తున్నది. ఈ లేఖ సారాంశం చూస్తే కాంగ్రెస్,బీజేపీ లకు మేలు చేసే యవ్వారం కొట్టొచ్చినట్టు కన్పించింది, మీరు లేఖ రాస్తే తప్పేమిలేదు కానీ, బయటపెడితే తప్పేమిటో అర్ధం కావడం లేదు.లేఖ బయట పెట్టడానికి ఎవరికి అవసరం? అయితే ఆమె వెనుక ఎవరు ఉన్నారో ఆమె బలం ఏమిటో ప్రజలకు తెలియనిది కాదు, బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటే అన్నంత మాత్రాన కాంగ్రెస్ మెట్లు కూడా ఎక్కలేదు కదా? కేసీఆర్ పై విచారణ చేస్తూ కవితను ఎందుకు అక్కున చేర్చుకుంటుంది? ఇప్పటికే ఆధిపత్య పోరు చాపకింద నీరులా పారుతూ కేసీఆర్ గుండెలను పిండుతుందంటే అతిశయోక్తి కాదు.

కవిత మంచి సృజనాత్మక వక్త అందులో ఎలాంటి అనుమానంలేదు, తెలంగాణ జాగృతి సంస్థ పాపులర్ కావడానికి కారణం కూడా కారణం అదే !  కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోకుండా అన్నను టార్గెట్ గా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అందరు చెప్పేది అదేకదా? నేను ఎవ్వరి నాయకత్వాన్ని స్వీకరించను అంటే ధిక్కారం దేనికోసం? గులాబీ పార్టీకి ఓనర్లం మేమే అన్నందుకు ఈటల రాజేందర్ ను ఏకాకి చేసారు కదా? అప్పుడు ఈ దయ్యాలు కనిపించలేదా? కవితకు ఉన్న అర్హత ఏమిటి? జైలు కెళ్లిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కాలేరు కదా? నిన్ను గుండెల్లో దాచుకుంటేనే ఆగమాగం అవుతున్నారు? 2018లో మేన బావ హరీశ్ మీ లెక్కన ఎంత బాధపడి ఉండాలే ? అయినా కేసీఆర్ మాట జవదాటలేదు రోడ్ ఎక్కలేదు. అటువంటిది మీరు పాము పగ.. తోక చుట్టం అన్నట్టుగా కేసీఆర్ మీద ఈగ వాలితే ఖబర్ధార్ అంటూ మాట్లాడడం దేనికి సంకేతం? ఒక్కటి మాత్రం నిజం కవిత వల్ల పార్టీకి మేలు ఏమోగానీ లిక్కర్ దందాతో సంబంధం ఉన్నందుకు కేజ్రీవాల్ అధికారం కోల్పోయారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కూలడం వల్ల నష్టం ఏమోగానీ, కవిత లిక్కర్ స్కాం తో  కేసీఆర్ కట్టుకున్న ఆశల సౌధం పేకమేడలా కూలిపోయింది.మీరు ఏమి చేసినా కేసీఆర్ తనయగానే గుర్తింపు ఉంది.

”బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న కవిత, నేడు కేటీఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి కూడా షర్మిల ఇలాగే కొత్త పార్టీ పెట్టారు. కానీ, మధ్యలోనే కాడెత్తేశారు. ఇప్పుడు కవిత సామర్ధ్యాలపై ఓసారి పరిశీలిస్తే..కవితకు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురుగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అదే రీతిలో పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అలాంటి ఫాలోయింగ్ ను కవిత సంపాదించుకున్నారు.  

కవితను,కేసీఆర్ ను వేరు వేరుగా చూడలేదు. అందుకే ఎక్కడ పోయిన ఆదరణ దొరికింది. కులగణనతో కాంగ్రెస్ కు బీసీలు అండగా నిలిచినందుకు ఫూలే విగ్రహం కోసం పట్టుబడుతున్నారు.అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లు తగ్గించిన నోరుమెదపలేదు కానీ ,  సామాజిక తెలంగాణ రావాలంటూ డిమాండ్ చేస్తున్నది అధికార దాహం కాదా? మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఏమైనా బీజేపీతో లాలూచి పడితే కవితను జైలునుండి తీసుకరావడానికి పడ్డదే తప్ప, అధికారం కోసం అయితే కాదు.ఎవరి ప్రయోజనాలు వారివి అయినప్పుడు అందుకు తగిన విధంగా ఎవరి వ్యూహాలు వారికీ ఉండటం సహజమైన విషయం కేసీఆర్ లాంటి అపరచాణుక్యుడు ముందు కుప్పిగంతులే. కవిత ధిక్కారం ..కాళేశ్వరం, ఈ-కార్, ఫోన్ ట్యాపింగ్ కేసుల వల్ల కేసీఆర్ తప్పుకొని ,కేటీఆర్ సైడ్ అయ్యి, పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ చేతికి అందుతాయా? కాళేశ్వరం కమిషన్ ముందు సాక్ష్యాలు ఎవరికీ మేలు చెస్తాయోనని,అపర చాణిక్యుడు ఎలా సమన్వయం చేస్తారోననే అభిప్రాయం అందరిలో నెలకొంది.

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న కవిత, నేడు కేటీఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి కూడా షర్మిల ఇలాగే కొత్త పార్టీ పెట్టారు. కానీ, మధ్యలోనే కాడెత్తేశారు. ఇప్పుడు కవిత సామర్ధ్యాలపై ఓసారి పరిశీలిస్తే..కవితకు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురుగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అదే రీతిలో పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అలాంటి ఫాలోయింగ్ ను కవిత సంపాదించుకున్నారు. కొత్త పార్టీ పెట్టే వ్యక్తి రాజకీయ జీవితం మచ్చ లేనిదిగా ఉంటేనే పార్టీ నడపటం కష్టమైన ప్రస్తుత రాజకీయాల్లో అటువంటిది లిక్కర్ స్కాం ఆరోపణలతో పార్టీని పెట్టి దాన్ని నడపడం కవితకు కత్తిమీద సామే అని చెప్పాలి. ఏ పార్టీ స్థాపించినా దానికో లక్ష్యం ఉంటుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాల వంటి పార్టీలు ఓ బలమైన కారణాలతో పురుడు పోసుకున్నవి. పక్క రాష్ట్రంలో తీసుకున్నాటీడీపీ , వైసీపీ ఆవిర్భావం వెనుక బలమైన ప్రజా లక్ష్యాలు ఉన్నాయి.

కొత్త రాజకీయ పార్టీ స్థాపన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే కవిత పెట్టే కొత్త పార్టీ తనకు అన్యాయం జరిగిందని చెబితే ప్రజలు ఆమోదం తెలిపే స్థితిలో లేరు. ఇప్పుడు బీసీ ప్రజల ఆకాంక్షలను లక్ష్యంగా పెట్టుకొని జాగృతం చేసేందుకు జాగృతి కొత్త కార్యాలయం ప్రారంభించింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అసమ్మతి వాదులను బీసీ వాదంతో చేరదీసి సెంటిమెంట్ రగిలిస్తే తప్ప కొత్త పార్టీ నిలదొక్కుకునే పరిస్థితి ఉండదు. అయితే కేసీఆర్ లాంటి లెంజడరీ నాయకుడ్ని,కేటీఆర్, హరీశ్ రావు లాంటి రాజకీయ చతురత ఉన్న నేతలను కాదని కవిత తన రాజీకీయ భవిష్యత్తు కోసం పార్టీ పెట్టి వారికి ఎదురెళ్లుతుందా ? ప్రత్యర్థులతో చెయ్యి కలిపే సాహసం చేస్తుందా ? అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు కవిత పై అధినేత స్పందన ఏ విధంగా ఉంటుంది? సామాజిక తెలంగాణ నినాదం బీసీలను చీల్చడం కోసమా? లేఖ లొల్లి ‘టీ’ కప్పులో తుఫాను లా బీఆర్ఎస్ లో ఈ సంక్షోభం ముగియనుందా? బతుకమ్మ ధిక్కారస్వరం ఎవరిని నిలదీయడానికి ?నిష్ఫల ప్రయోగమేనా అన్నది వేచి చూడాల్సిందే.

Tags: Bathukamma controversy 2025Bathukamma defiant voice meaningBathukamma festival TelanganaBathukamma latest newsBathukamma political statementBathukamma symbolism debateCultural politics in TelanganaFestival politics Indiakavitha new partyTelangana cultural identityTelangana women’s festival
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist