• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Sunday, September 13, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

రాజ్య హింసకు వత్తాసు పలుకుతున్న ‘మేతావులు’!

Taza Cinema by Taza Cinema
2025-04-02
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

ఐదు దశాబ్దాల కిందనే ‘శిశు హంతక రాజ్యం ఇది, పశు సంతతి పాలన ఇది’ అని ఈ దేశపు రాజ్య స్వభావాన్నీ, పాలనా ప్రవృత్తినీ ఒక్కమాటలో చెప్పాడు చెరబండరాజు. అటువంటి రాజ్యంలో‘నేరమే అధికారమై/ ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే/ ఊరక కూర్చున్న/ నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’ అన్నాడు వరవరరావు.

యాబై ఏళ్ల కింద తెలుగు సమాజం సాధించిన ఈ రాజ్యధిక్కార,ప్రజానుకూల, మానవతా వివేకం ఇవాళ తలకిందులై పోయినట్టుంది. ప్రజల మీద రాజ్యం జరుపుతున్న దుర్మార్గమైన హింసను, రోజు రోజూ వస్తున్న మారణకాండల వార్తలను ఖండిరచడమో, ఊరక కూచోవడమో కాదు, సమర్థించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ‘ప్రజల మీద మరింత హింస సాగించు’ అని రాజ్యానికి చెప్పడానికి కొందరు మేతావులు తెగబడుతున్నారు. ‘మరింత బీభత్సం సాగించు, మరిన్ని నెత్తురుటేర్లు పారించు, మరింతమంది మనుషులను చంపు’అని అశ్శరభ శరభ నినాదాలతో హింసా రాజ్యానికి నీరాజనాలు పలుకుతున్నారు.

‘‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పడం సరైంది కాదని’’ మరొక మేతావు అన్నారట. రాజ్యం స్థాపిస్తామని చెప్పడం సరైందా కాదా చర్చ చేయవచ్చు. కాని తాను పని చేసిన మూడు దశాబ్దాలలో సామాజిక సమస్యలను వ్యక్తీకరించినందుకు,ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధ ప్రవర్తనను ఆశించినందుకు తానూ తన బలగాలూ ప్రజల మీద ఎన్ని వందల సార్లు తుపాకీ గొట్టాన్ని ఉపయోగించారో, ఎన్ని వందల మంది ప్రాణాలు బలిగొన్నారో గుర్తు చేసుకుని, కనీస పశ్చాత్తాపం ప్రకటించి ఆ మాట అని ఉంటే బావుండేది.

ఏ మాటకైనా ఉచితానుచితాలూ సమయ సందర్భాలూ ఉంటాయి. ఈ మేతావుల మాటలు అందుకు పూర్తిగా భిన్నం. సరిగ్గా ఈ హింసా ప్రోత్సాహ ఉపన్యాసాల సందర్భం ఒక దుర్మార్గమైన మారణకాండ జరుగుతున్న సందర్భం. స్వయంగా కేంద్ర హోం మంత్రి ముహూర్తాలు నిర్ణయించి ఫలానా రోజుకల్లా అందరినీ చంపేస్తాం అని అమానుషమైన బీరాలు పలుకుతున్న సందర్భం ఇది. 2024 జనవరి 1న ఒక ఆరు నెలల పసిపాపను చంపడంతో ప్రారంభించి ఈ పదిహేను నెలల్లో నాలుగు వందల మందిని పొట్టన పెట్టుకున్న కర్కశ, నరహంతక పాలన ప్రతి రోజూ కళ్లముందర కనబడుతున్న సందర్భం ఇది. మనుషులను చంపి ఆ మృతదేహాల కుప్పల ముందర ఫొటోలు దిగి, పాత బ్రిటిష్‌ వలస పాలనలో పులులను చంపి వాటితో ఫొటోలు దిగి తమ దేశానికి పంపించుకున్న తెల్లదొరల లాగా, భద్రతా బలగాలు పత్రికలకు, ప్రచార సాధనాలకు విడుదల చేస్తున్న అమానుష సందర్భం ఇది. మను షులను, ఈ దేశ పౌరులను చంపామనే ఆనందంలో హంతకులు మిఠాయిలు పంచుకుని, నాట్యాలు చేసి,ఆ చిత్రాలు ప్రచారంలో కూడా పెడుతున్న కర్కోటక సందర్భం ఇది.

కాని మన మహా ఘనత వహించిన మాజీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ఆ కనీస రాజ్యాంగ, ప్రజాస్వామిక, నాగరిక,మానవీయ ఆలోచనలను కనీసం దరి చేరనివ్వలేదు.‘‘భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించిన వోటు  హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత హింసావాదానికి తావులేదని’’ ఒక మేతావు అన్నారట. ప్రభుత్వ హింసావాదానికి తావుంటుందన్నమాట! ‘‘దేశ సార్వభౌమత్వానికి, సమాజ సుస్ధిరతకు భంగం వాటిల్లినపుడు చట్టపరిధిలో పనిచేయాల’’న్నారట. కళ్ల ముందర చట్టపరిధిని అతిక్రమిస్తున్న ఉదాహరణలు కనబడుతున్నాయి. మీ మూడు దశాబ్దాల ఉద్యోగక్రమంలో వేలాది చట్టపరిధిని ఉల్లంఘించిన ఉదాహరణలు ఉన్నాయి. అధికరణం 38ని ఉల్లంఘిస్తున్న దారుణమైన అసమానత దేశ సార్వభౌమత్వానికీ సమాజ సుస్థిరతకూ భంగం కలిగిస్తున్నది. ఏ చట్టపరిధిలో ఎవరు పని చేస్తున్నారు?

తమ పేర్లలోనే సరిహద్దులలో ఉండవలసిన బలగాలుగా చెప్పుకునే సరిహద్దు భద్రతా దళం, సశస్త్ర్‌ సీమా బల్‌, ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ వంటి బలగాలు మధ్యభారత అరణ్యాలనే సరిహద్దులుగా చేసుకున్న క్రూర హాస్యాస్పద సందర్భం ఇది.అనుచితం, రాజ్యాంగ వ్యతిరేకం అని సుప్రీం కోర్టు కొట్టివేసిన సల్వా జుడుమ్‌ సాయుధ బలగాల పేరు మార్చి యథాతథంగా వాడుకుంటూ తమకు చట్టబద్ధ పాలన మీద ఇసుమంత నమ్మకం కూడా లేదని ప్రభుత్వమే చెప్పుకుంటున్న సందర్భం ఇది. ప్రతి హత్యాకాండ తర్వాత దేశ హోం మంత్రి అభినందనలు చెపుతున్న సందర్భం ఇది. ఇంతకూ ఈ మారణహోమమంతా ఈ దేశ ఖనిజ సంపదను దేశాదేశాల సంపన్నులకు, బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి ఒప్పందాలు చేసుకొని, అడవి నుంచి ఆదివాసులను ఖాలీ చేయించడానికి పన్నిన వ్యూహపు సందర్భం. ఆ వ్యూహంలో భాగంగా ఆదివాసులను భయభ్రాంతులను చేయడానికీ, ఆదివాసుల జల్‌, జంగల్‌,జమీన్‌, ఇజ్జత్‌ పోరాటంలో వారికి అండగా నిలిచిన మావోయిస్టులను నిర్మూలిం చడానికీ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న ప్రయత్నం.

ఇప్పటికి ప్రభుత్వం హత్య చేసిన నాలుగు వందల మందిలో రెండు వందల మంది నిరాయుధ ఆదివాసులే ఉన్నారంటేనే, ‘‘మావోయిస్టు నిర్మూలన’’ అనేది ముసుగు మాత్రమే. ఆదివాసీ విద్యార్థులు, బాల బాలికలు, పొలాల్లో పని చేసుకుంటున్నవారు, తునికాకు తెంపుతున్నవారు ఈ హత్యలకు గురవుతున్నారంటేనే ఈ హత్యా కార్యక్రమం అసలు ఉద్దేశం వేరేనని అర్థమవుతుంది. ఆదివాసులను నిర్మూలించి, వారిని భయపెట్టి, వారికి రక్షణ లేకుండా చేసి, వారిని అడవి నుంచి ఖాలీ చేయించి, అపార ఖనిజ సంపద ఉన్న అడవులను కార్పొరేట్లకు అందించడమే ఈ ప్రభుత్వపు అసలు ఉద్దేశమని మెదడూ హృదయమూ ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. పార్టీలూ జెండాలూ ఏవైనా ఈ దేశ పాలకులందరి చరిత్రా అదేనని చరిత్ర విద్యార్థులకు అర్థమవుతుంది. కాని గత శనివారం హైద రాబాదులో జరిగిన ఒక సదస్సులో కొందరు మేతావుల మాటలు విం టుంటే, ఈ సమాజం ఇంతగా పుచ్చి పోయిందా అని ఆశ్చర్యం కలుగు తున్నది. ఇంతింతచదువులు చదువు కుని, ఇంతోటి ఉద్యోగాలూ పదవులూ హోదాలూ వెలగబెట్టి ఆఖరికి వీళ్లు చేరింది ఈ హంతక భజన దగ్గరికా అని అసహ్యం కలుగుతున్నది.

ఆ సదస్సులో ఇద్దరు మాజీ ఐఎఎస్‌ అధికారులు, ఒక మాజీ ఐపిఎస్‌ అధికారి భారీ ఉపన్యాసాలు ఇచ్చారు. వారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు చేసిన ఉద్యోగాలు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ చేయవలసి ఉంటుంది. మరి వారు ఆ రాజ్యాంగం చదివారో లేదో గాని కనీసం అధికరణం 19, అధికరణం 21 అయినా వారికి గుర్తు న్నాయో లేదో అనుమానించవలసి ఉంది. ‘ఇంకా హత్యలు చేయండి, నిర్మూలించండి, తుద ముట్టిం చండి’అని రంకెలు వేస్తున్నప్పుడు, ఈ దేశంలో ఏ వ్యక్తి మరొక వ్యక్తిని చంపినా అది న్యాయస్థానాలు విచారించి శిక్షించవలసిన నేరంఅవుతుంది అని వాళ్లకు గుర్తుందా లేదా అని అనుమానం వస్తుంది. సాధారణ పౌరులు ప్రాణాలు తీస్తే శిక్షార్హమైన నేరం అయినప్పుడు, స్వయంగా ప్రభుత్వమే, ఒక దేశపు హోం మంత్రే తేదీలు పెట్టి ప్రాణాలు తీస్తాను అని హెచ్చరించడం నేరం కాదా? ఆ హత్యా నేరాన్ని ఇంకా చేయండి, ఇంకా చేయండి అని చప్పట్లు చరిచే ఈ మేధావుల ప్రోత్సాహం నేరం కాదా?

ప్రభుత్వమైనా సరే, చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప ఎవరి ప్రాణాలూ తీయడానికి వీలు లేదు అని చెప్పే రాజ్యాంగానికీ,ఎటువంటి అరెస్టూ విచారణా లేకుండా కనబడితే కాల్చి చంపి నిర్మూలిస్తాం అని ప్రకటించే, దాన్ని అమలు చేసే హోం మంత్రిమాటలకూ చుక్కెదురు. రాజ్యాంగం మీద గౌరవం ఉన్నవారెవరైనా ఆ హంతక ప్రకటనలను, చేతలను ఖండిరచాలి. ఇది రాజ్యాంగబద్ధం కాదు అని చెప్పాలి. మనుషులను ఫలానా తేదీ లోఓపు లేకుండా చేస్తాం అని ప్రకటించి మరీ చంపడం వీథిరౌడీల భాష మాత్రమే గాని ఒక ఆధునిక, నాగరిక, ప్రజాస్వామిక ప్రభు త్వానికి తగదు అని చెప్పాలి. ఇది మానవతా భావనకు వ్యతిరేకం అని చెప్పాలి.

కాని మన మహా ఘనత వహించిన మాజీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ఆ కనీస రాజ్యాంగ, ప్రజా స్వామిక, నాగరిక, మానవీయ ఆలో చనలను కనీసం దరి చేరనివ్వలేదు.‘‘భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించిన వోటు  హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత హింసా వాదానికి తావులేదని’’ ఒక మేతావు అన్నారట. ప్రభుత్వ హింసావాదానికి తావుంటుందన్నమాట! ‘‘దేశ సార్వభౌ మత్వానికి, సమాజ సుస్ధిరతకు భంగం వాటిల్లినపుడు చట్టపరిధిలో పనిచేయాల’’న్నారట. కళ్ల ముందర చట్ట పరిధిని అతిక్రమిస్తున్న ఉదాహరణలు కనబడుతున్నాయి. మీ మూడు దశాబ్దాల ఉద్యోగక్రమంలో వేలాది చట్టపరిధిని ఉల్లంఘించిన ఉదాహరణలు ఉన్నాయి. అధికరణం 38ని ఉల్లంఘిస్తున్న దారుణమైన అసమానత దేశ సార్వభౌమత్వానికీ సమాజ సుస్థిరతకూ భంగం కలిగిస్తున్నది. ఏ చట్టపరిధిలో ఎవరు పని చేస్తున్నారు?

‘‘తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాన్ని స్థాపి స్తామని చెప్పడం సరైంది కాదని’’ మరొక మేతావు అన్నారట. రాజ్యం స్థాపిస్తామని చెప్పడం సరైందా కాదా చర్చ చేయవచ్చు. కాని తాను పని చేసిన మూడు దశాబ్దాలలో సామాజిక సమస్యలను వ్యక్తీకరించి నందుకు, ప్రభుత్వం నుంచి రాజ్యాంగబద్ధ ప్రవర్తనను ఆశించినందుకు తానూ తన బలగాలూ ప్రజల మీద ఎన్ని వందల సార్లు తుపాకీ గొట్టాన్ని ఉపయోగించారో, ఎన్ని వందల మంది ప్రాణాలు బలిగొన్నారో గుర్తు చేసుకుని, కనీస పశ్చాత్తాపం ప్రకటించి ఆ మాట అని ఉంటే బావుండేది.

నక్సలిజం రంగు మార్చుకుందని, తుపాకి గొట్టం వదిలి, అర్బన్‌ నక్సల్స్‌ గా మారి, విశ్వవిద్యాలయాల్లో, మీడియాలో, స్వచ్ఛంద సంస్థల్లో, న్యాయపోరాటాల్లో చేరిందని వీళ్లు అంటున్న మాటఅజ్ఞానం, అర్థరహితం. ఈ దేశంలో కొనసాగుతున్న అసమానత గురించి, దోపిడీ పీడనల గురించి ఆలోచనాపరులందరూ మథన పడతారు. ఆలోచనాపరులు ఉండే కేంద్రాలన్నిటిలో ఆ మేధో మథనం జరుగుతుంది. అది కొత్తదీ కాదు.

‘‘నక్సలైట్ల చేతిలో చనిపోయినవారిని స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటు పడటం తన ఉద్దేశంగా’’ చెప్పుకునే మార్టీర్స్‌ మెమో రియల్‌ రీసర్చ్‌ ఇన్స్టిట్యూట్‌ అనే సంస్థనిర్వహించిన ‘ఛేంజింగ్‌ కలర్స్‌ ఆఫ్‌ నక్సలిజం’ అనే సదస్సులో మచ్చు తునకలు ఇవి. నక్సలిజం అనేది ఇప్పుడు రంగు మార్చు కుందని, అది ఇపుడు యూనివర్సిటీలలో, మీడియాలో, స్వచ్ఛంద సంస్థలలో, న్యాయ పోరాటాలలో అర్బన్‌ నక్సలైట్స్‌ గా ఉనికిని మార్చుకుందని’’ ఈ సంస్థ తన అభిప్రాయంగా ప్రకటించింది.

కేవలం తుపాకి గొట్టం మీద ఆధార పడకుండా, సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారాల నుంచి సైబర్‌ ప్రాపగాండ బోగస్‌ కథనాలు సృష్టించి తద్వారా యువకులను ఉత్తేజపరిచి నక్సలిజం వైపు మళ్లిం చేందుకు అర్బన్‌ నక్సలైట్లు పనిచేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ చేయాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ భావిస్తున్నదట. మేధావులు, మానవ హక్కుల ఉద్యమకారుల పేరుతో చలామణి అవుతున్న ఈ అర్బన్‌ నక్సల్స్‌ ను ఎదుర్కోవడం,పాపం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్‌ గా మారిందని గుర్తించి, ఈ సంస్థ తన వంతు సహాయం చెయ్యదలచుకున్నదట. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపుమాపాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేస్తున్న ప్రయత్నాలకు ఊతంగా ఈ సదస్సును ఏర్పాటు చేసిందట.

ఈ అబద్ధాలను, అర్ధ సత్యాలను వివరిం చడానికి ఒక వ్యాసం సరిపోదు. ఇంత అబద్ధ సమాచారం, ఇంత ప్రజా వ్యతిరేకత,ఇంత రాజ్యాంగ ఉల్లంఘన, ఇంత అధికార దాసోహం, ఇంత అమానుషత్వం కలగలిస్తే భయంకరమైన విష విద్వేష రసాయనం తయారవుతుంది. అయితే ఇదేమీ కొత్తది కాదు, వీరి మాతృసంస్థ వంద సంవత్సరాలుగా సాగిస్తున్న పనే అది. కాకపోతే కేంద్ర ప్రభుత్వ అధికారం వల్ల ఇంత విష విద్వేష ప్రచారాన్ని బహిరంగంగా, మేధావుల ముసుగులో చేసే ధైర్యం వచ్చింది. మీరు సేవకే ఉన్నారు, మీరు అస్పృశ్యులు అనే అవమానకరమైన మాటను శూద్రుల చేతనే, దళితుల చేతనే ఒప్పించగల మనుస్మృతి వారసులుగా ఎన్ని అబద్ధాలైనా ఆడగల, మాసిపూసి మారేడుకాయ చేయగల నైపుణ్యం ఈ సంఘ పరివారానిది.

నక్సలిజం రంగు మార్చుకుందని, తుపాకి గొట్టం వదిలి, అర్బన్‌ నక్సల్స్‌ గా మారి, విశ్వ విద్యాలయాల్లో, మీడియాలో, స్వచ్ఛంద సంస్థల్లో, న్యాయ పోరాటాల్లో చేరిందని వీళ్లు అంటున్న మాటఅజ్ఞానం, అర్థరహితం. ఈ దేశంలో కొనసాగుతున్న అసమానత గురించి, దోపిడీ పీడనల గురించి ఆలోచ నాపరు లందరూ మథన పడతారు. ఆలోచనాపరులు ఉండే కేంద్రాలన్నిటిలో ఆ మేధో మథనం జరుగుతుంది. అది కొత్తదీ కాదు, రంగు మార్చుకోవడమూ కాదు. యాబై మూడు సంవత్సరాల కింద జార్జిరెడ్డి విశ్వ విద్యా లయంలోనే విద్యార్థులలో చైతన్యం కోసమే పని చేశాడు. ఆయనను సంఘ పరివారపు గూండాలు విశ్వవిద్యాలయ ఆవరణలోనే చంపేశారు. కొత్తగా రంగు మార్చుకోవడం ఏమిటి? విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది అధ్యాపకులు ఉంటారు. విశ్వ విద్యాలయం అంటే భిన్న భావాల సంభాషణా వేదిక, అనేక అభిప్రాయాలు, భావజాలాలు సంవాదాలు, చర్చలు జరుపుకుని, భావాల నిగ్గు తేల్చుకునే వేదిక. సంఘ పరివారానికి విశ్వవిద్యాలయం అనే మాటే గిట్టదు. ఎందుకంటే ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం ఫాసిజం అని కాళోజీ అన్నట్టు సంఘ పరివారానికి భిన్నాభిప్రాయం సహించదు. పైగా వారి పరమ గురువులు ముస్సోలినీ దగ్గర నేర్చుకుని వచ్చారు. హిట్లర్‌ ఆచరణను ఇక్కడా సాగించాలని అక్షరాలా రాసి పెట్టారు.

ఇక మీడియా, స్వచ్ఛంద సంస్థలు, న్యాయపోరాటాలు అని జాబితా చదివారంటే, ఎక్కడెక్కడ స్వతంత్ర అభి ప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, నిజమైన చర్చ అవ కాశాలు ఉన్నాయో అవన్నీ వీరికి అనుమానాస్ప దమైనవి. మనుషులు వద్దు, ఆలోచనలు వద్దు అనేదే సిద్ధాంతం.
కళ్ల ముందరి మారణకాండను ఖండిరచకపోతే మానె, సమర్థించే,ప్రోత్సహించే, ఎగసన తోసే హంతక ప్రవృత్తికి దిగజారిందా మన సమాజం! ఇంతగా కుళ్లిపోయిందా?

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist