కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మణుగూరు పార్టీ కార్యకర్తల ఆస్తి కబ్జాదారుల వద్ద నుండి తిరిగి కాంగ్రెస్ ఆధీనంలోకి రావడం పార్టీకి ఒక శుభపరిణామం అని తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
“డీసీసీ అధ్యక్షులుగా నేను, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక–మణుగూరు కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం,” అని తెలిపారు. ఈరోజు పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా బయలుదేరి, గతంలో బిఆర్ఎస్ పార్టీ భవనంగా మార్చబడిన ఇందిరా భవన్‌ను తిరిగి కాంగ్రెస్ కార్యాలయంగా స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీని విడిచిన అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రతీకగా ఉన్న ఇందిరా భవన్‌ను బిఆర్ఎస్ భవన్‌గా మార్చి, జెండాలు, ఫర్నిచర్, బోర్డులు మార్పు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అన్యాయానికి ముగింపు పలుకుతూ, నేడు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బిఆర్ఎస్ పార్టీ గుర్తులు తొలగించి, కాంగ్రెస్ జెండాను తిరిగి ఎగురవేశారు. కాంగ్రెస్ నాయకత్వం, త్యాగం చేసిన కార్యకర్తల కృషి ఫలితంగా ఇందిరా భవన్ తిరిగి కాంగ్రెస్ పతాకం కిందకి వచ్చింది- పొదెం.
గతంలో సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క మరియు నా నేతృత్వంలో కాంగ్రెస్ భవనాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లినప్పుడు, టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకున్న విషయం కార్యకర్తలకు, నాయకులకు సుపరిచితం. ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మణుగూరు పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తల కృషితో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈరోజు ఆ మాటను నిజం చేస్తూ, కార్యకర్తల త్యాగం, పట్టుదల ఫలించింది.ఇది కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవం తిరిగి గెలిచిన క్షణం. కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తోంది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు – కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు.











