• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, July 29, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Actress Gallery

రాజ్యాంగ‌మే స‌ర్వోన్న‌తం

Taza Cinema by Taza Cinema
2025-06-26
in Actress Gallery
Reading Time: 1 min read
0 0
A A
 – పార్లమెంట్‌ ఎప్పటికీ ‘సుప్రీమ్‌’ ‌కాదు
– రాజ్యాంగం కింద మూడు వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేస్తాయి
– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ ‌గవాయ్‌ ‌
ముంబై, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 26: ‌భారత్‌లో రాజ్యాంగమే స‌ర్వోన్న‌త‌మ‌ని.. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌బి.ఆర్‌.‌గవాయ్ అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు లేదా భావిస్తున్నట్లు పార్లమెంట్‌ ‌సుప్రీం కాదన్నారు. ప్రజాస్వామ్యం ఛత్రం కిందపార్లమెంట్‌ ఒకటని అభిప్రాయపడ్డారు. ప్రాథ‌మిక నిర్మాణ సిద్ధాంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్‌కు అధికారాలు ఉన్నాయి. కానీ, రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం అది మార్చలేదన్నారు. భారత 52వ సీజేఐగా గవాయ్‌ ‌గత నెల బాధ్యతలు స్వీకరించారు. తూర్పు మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది అత్యున్నతమైందని తరచూ చర్చ తలెత్తుతోందని గవాయ్‌ అభిప్రాయపడ్డారు. ‘ చాలామంది పార్లమెంట్‌ అత్యున్నతమైందని అంటారు. కానీ, నా ఉద్దేశంలో భారత రాజ్యాంగమే స‌ర్వోన్న‌త‌మైంది. ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు దానికిందే పనిచేస్తాయి. మనం విధులు నిర్వహిస్తున్నామని న్యాయమూర్తులు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. మనం ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం. కేవలం మనకు అధికారం మాత్రమే లేదు. బాధ్యతలు కూడా ఉన్నాయి. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు అన్నది న్యాయ‌మూర్తుల‌ను ప్రభావితం చేయకూడదు. మనం స్వతంత్రంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. తాను రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు అండగా నిలుస్తానన్నారు. బుల్డోజర్‌ ‌న్యాయంపై తాను ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు. ప్రతిఒక్కరికీ నివసించేందుకు ఇల్లు ఉండాలన్నారు. చిన్నప్పుడు తాను ఆర్కెటెక్ట్ ‌కావాలనుకొన్నట్లు చెప్పారు. కానీ, తాను లా చదవడం తన తండ్రి కోరిక అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన అరెస్టు కావడంతో.. లా చదవలేక పోయారన్నారు.
Tags: #constitution is supreme #not parliament #CJI
SendShareTweetShareShare

Related Posts

Supreme Court Raises Alarm Over Infiltrators Securing Aadhaar Cards
Actress Gallery

చొరబాటు దారులు ఆధార్‌ కార్డులు పొందటంపై సుప్రీం కోర్టు ఆందోళన

2025-11-28
Delhi Police Operation
Actress Gallery

ఢిల్లీ పోలీసుల ఆపరేషన్…

2025-11-27
Maoists Offer to Surrender Arms by February in Open Letter to 3 CMs
Actress Gallery

ఫిబ్రవరికల్లా ఆయుధాలు వదిలేస్తాం వేటాడవద్దు

2025-11-25
End of an Era Dharmendra's Legacy Remembered on November 24
Actress Gallery

బాలీవుడ్ హీ మ్యాన్ ‘ధర్మేంద్ర’ కన్నుమూత

2025-11-25
CM Siddaramaiah & DK Shivakumar Clash Over Power-Sharing Deal
Actress Gallery

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ

2025-11-21
Who is the Next Bihar Chief Minister? Political Buzz Intensifies in Patna
Actress Gallery

Who is Next Bihar CM: సీఎం నితీష్ కాదా…

2025-11-14

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist