రాజ్యాంగం ప్రకారమే చర్యలు ఉంటాయంటున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో విలేకరులతో జీవన్ రెడ్డి మాట్లాడుతు ఓ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో చేరితే భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం సదరు ప్రజా ప్రతినిధి అనర్హత వేటుకు గురవుతాడని తెలిపారు.
తాను ఎవరి పదవి పోవాలని కోరుకోవడం లేదని, పార్టీ ఫిరాయిస్తే రాజ్యాంగం ప్రకారం పదవి పోతుందని మాత్రమే చెప్పానని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.











