వనపర్తి: ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు, నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని మండిపడ్డారు. ఓట్ల కోసం తండాల్లో తిరుగుతుంటే, మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు కానీ మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారు. కేసీఆర్ కూతురు కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాము, ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదు.
మేము కేసీఆర్ కి మంచి పేరు తెస్తుంటే, నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావు . ఎవరిని సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తుంది. నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని అన్నారు. నాకు ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది, నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు నీకు ఎక్కడివి? తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యే లను ఇంటికి పిలిపించుకుని, జాగృతిలో చేరాలని అడిగి, ఒప్పుకోని నా లాంటి వాళ్ల మీద ఆరోపణలు వేస్తున్నావని అయన ఆరోపించారు.











