• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, September 16, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైనట్టేనా?

Taza Cinema by Taza Cinema
2025-04-16
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 సోమవారం నాడు జారీ చేసిన నాలుగు జీఓ లు, అంతకు ముందు మార్చ్‌ 18న శాసనసభ ఆమోదించి, ఏప్రిల్‌ 9న గవర్నర్‌ ఆమోదం పొంది చట్టంగా తయారైన ది తెలంగాణ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌) చట్టం 2025, మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, తెలంగాణాను నిరం తరంగా ఆందోళన పరుస్తున్న ఒక జటిలమైన ప్రధాన సమస్యను పరిష్కరించడంలో విజయం సాధిస్తాయా లేక ఆ సమస్య రూపం మాత్రమే మార్చుకుని యథాతథంగా కొనసాగుతుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యా, ఉద్యోగావకాశాలలో షెడ్యూల్డ్‌ కులాలకు 15 శాతం రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ, షెడ్యూల్డ్‌ కులాలలో అభివృద్ధి చెందిన ఒకటి రెండు కులాల వారే దానితో ఎక్కువ లబ్ధి పొందారని, ఆ రిజర్వేషన్‌ విధానం ఏ అసమానతను పోగొట్టడానికి, తగ్గించ డానికి రూపొందిందో, ఆ పని చేయకపోగా కొన్ని ఉపకులాలు అదే అసమానతలో, అవకాశాల లేమిలోకొనసాగుతూ వచ్చాయనే విమర్శ 1990ల నాటికి బలపడిరది. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి రిజర్వేషన్లలో వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌తో 1994 జూన్‌ 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఏర్పడిరది. మంద కృష్ణ మాదిగ, పొనుగోటి కృపాకర్‌ మాదిగ, దండు వీరయ్య మాదిగ, మేరీ మాదిగ తదితరుల నాయ కత్వంలో పదమూడు మంది సభ్యులతో ప్రారం భమైన ఈ సంస్థ ఆ తర్వాతి ముప్పై సంవ త్సరా లలో అత్యంత ప్రభావశీలమైన సంస్థగా, ఉద్య మంగా ఎదిగింది. అనేక రాజకీయ పార్టీలను, పరిణా మాలను, చరిత్రను శాసించగల స్థితికి చేరింది.

ఈ ఉద్యమ ఫలితంగా మాల-మాదిగ రిజర్వేషన్‌ వర్గీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలి ంచడానికి ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ పి రామచంద్రరాజు కమిషన్‌ 1997 మే 28న వర్గీ కరణకు అనుకూలంగా తన నివేదికను సమర్పి ంచింది. ప్రభుత్వం ఆ నివేదికను ఆమోదిస్తూ, ఎబిసిడి వర్గీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాల మహానాడు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, హైకోర్టు సాంకేతిక కారణాలపై ఆ జిఓను సస్పెండ్‌ చేసింది. ఆ సాంకేతిక లోపాలను సవ రిస్తూ ప్రభుత్వం 1998 అక్టోబర్‌ లో ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన ఆ ఆర్డినెన్స్‌ 1999 డిసెంబర్‌ 12న గవర్నర్‌ ద్వారా జారీ కాగా, ప్రభుత్వం 2000 ఏప్రిల్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ కాస్ట్స్‌ (రేషనలైజేషన్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌) చట్టం, 2000 ను కూడా తయారు చేసింది. ఆ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమనీ, దాన్ని కొట్టివేయాలనీ కోరుతూ మాల మహానాడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఐదుగురు న్యాయమూర్తుల బెంచి 2004 నవంబర్‌ 5న ఆ చట్టాన్ని కొట్టి వేసింది. వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉందని, అలా వర్గీకరణ చేయడం ద్వారా ఆ చట్టం సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నదనీ ఆ తీర్పులో అన్నారు.
  ఉదాహరణకు గ్రూప్‌ 1లో ఉన్న 15 కులాలలో జంగం, డక్కలి, మాతంగి కులాలు, అదే గ్రూపులోని పంబాల, సంబన్‌ కులాల కన్నా ఎక్కువ ఫలాలు అందుకున్నాయని, గ్రూప్‌ 2లో అరుంధతీయ, మాదిగ కులాలు అదే గ్రూపులోని దండాసి, యాటల కులాల కన్నా ఎక్కువ ఫలాలు అందుకున్నాయని, గ్రూప్‌ 3లో ఆది ఆంధ్ర, మాల కులాలు, అదే గ్రూపులోని ఇతర కులాల కన్నా ఎక్కువ ఫలాలు అందుకున్నాయని ఒక దళిత పరిశోధకుడు రాశారు. ప్రస్తుత చట్టం గ్రూపుల మధ్య అసమానతను తొలగించడానికి, తగ్గించడానికి చేసిన ప్రయత్నం అభినందనీయమే గాని, ఇలా గ్రూపులోనే అంతర్గతంగా ఉన్న అసమానత తొలగించడానికి, తగ్గించడానికి అనుసరించవలసిన మార్గమేమిటో స్పష్టత లేదు.  
ఆ తీర్పును అధిగమించడానికి అవ సరమైన రాజ్యాంగ సవరణ జరపాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ కోరాయి. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. సుప్రీంకోర్టు వేసిన ఈ చిక్కుముడిని విప్పి, వర్గీకరణను సాకారం చేయాలని ఎంఆర్‌ పి ఎస్‌ రాష్ట్రమంతటా ఎన్నో ఆందోళనా కార్యక్రమాలు జరిపింది. చివరికి ఈ సమస్యకు పరిష్కార మార్గాలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం 2007 మే లో జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ ను నియమించింది. ఏడాది తర్వాత 2008 మే 1న జస్టిస్‌ ఉషా మెహ్రా కమిషన్‌ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినప్పటికీ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏ చర్యలూ తీసుకోలేదు. ప్రత్యేకంగా రాజ్యాంగ అధికరణం 341 కి సవరణ చేసి, రిజర్వేషన్‌ వర్గీకరణకు మార్గం సుగమం చేయాలని కమిషన్‌ ఇచ్చిన సిఫారసు మీద దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అలా తాత్సారంలో మునిగిపోయిన సమస్యకు 2024లో మరొకవైపు నుంచి సమాధానం దొరికింది. ఎప్పుడో నలబై సంవత్సరాల కింద పంజాబ్‌ లో జరిగిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యవహారం మీద సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల బెంచి 2014లో తీర్పు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ చట్టాన్ని కొట్టివేయడాన్ని సమీక్షించవలసి ఉందని సూచించింది. ఆ సమీక్ష చేయడానికి కూచున్న ఐదుగురు న్యాయమూర్తుల బెంచి, ఇది తమకన్న విస్తృతమైన ధర్మాసనం పరిశీలిచవలసిన జటిలమైన సమస్య అని అభిప్రా యపడిరది. అలా ఏడుగురు న్యాయ మూర్తుల ధర్మాసనంలో ఆరుగురు 2024 ఆగస్ట్‌ 1న  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబ ద్ధమేనని, ఆమోద యోగ్యమేనని తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.
ఆ తీర్పు వెలువడిన వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేసే రాష్ట్రాలలో మొదటిదిగా తెలంగాణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. గత అనుభవం దృష్ట్యా న్యాయ, చట్టపరమైన సమస్యలు తలెత్తకు ండా చట్టాన్ని రూపొందించడం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ ఉపసంఘం సూచన ఫలితంగా చట్ట రూపకల్పన విధివిధానాల కోసం నవంబర్‌ లో జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్‌ ఏక సభ్య కమిషన్‌ ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్‌ నివేదికను ఫిబ్రవరిలో శాసనసభ ముం దుంచారు. ఈ ప్రక్రియ తర్వాత తయారైన బిల్లును మార్చ్‌ 18న శాసనసభ ఆమోదించింది. అది ఏప్రిల్‌ 9న చట్టంగా రూపు దాల్చింది. ఆ చట్టాన్ని అమలులోకి తేవడానికి మొన్న సోమ వారం నాడు నాలుగు జీఓ లు జారీ అయ్యాయి.
అస్పృశ్యత ప్రధాన ప్రాతిపదికగా షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపు జరిగినట్టే, విద్యా, ఉద్యోగావకాశాలలో నిరాదరణ, తిరస్కరణలను నిర్ధారించడానికి నిస్సందేహమైన ప్రమాణాలు అన్వేషించాలి. అవి కేవలం పేదరికం, విద్య, ఉద్యోగం వంటి కంటికి కనబడే పరిమాణాత్మక ప్రమాణాలు, ఆత్మగౌరవ అవమానం, వివక్ష వంటి కంటికి కనబడని గుణాత్మక ప్రమాణాలు మాత్రమే కావు. అసలు ఏ ప్రమాణాలను రూపొందించాలో, ఏ ప్రమాణాల ఆధారంగా ‘ఫలానా కులానికి రిజర్వేషన్‌ ఎక్కువ అవసరం, దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి’ అనే సూత్రాన్ని తయారు చేయాలో పరిశోధించాలి.
రాష్ట్రంలో మొత్తం 59 ఎస్సీ ఉపకు లాలు ఉండగా (ఈ ప్రాథమిక అంశం కూడా ఇప్పుడు వివాదాస్పదంగానే ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండిన ఆ 59 ఉపకులాల్లో కొన్ని తెలంగాణలో లేవనే వాదన కూడా వినిపిస్తున్నది!), వాటిని సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సాధించిన, సాధించలేకపోయిన అభివృద్ధి ప్రమా ణాల ప్రకారం మూడు తరగతులుగా వర్గీకరి ంచారు. పూర్తిగా వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురయిన 15 కులాల తరగతిని గ్రూప్‌ 1 గా పేర్కొని ఆ గ్రూపుకు మొత్తం ఎస్సీ రిజర్వేషన్‌ లోని 15 శాతంలో ఒక శాతాన్ని కేటాయించారు. మధ్య స్తంగా ప్రయోజనాలు పొందిన 18 కులాల తరగతిని గ్రూప్‌ 2గా పేర్కొని ఆ గ్రూపుకు 9 శాతం కేటాయించారు. కొంత మెరుగైన ప్రయో జనం పొందాయని గుర్తించిన 26 కులాల గ్రూప్‌ 3 కు 5 శాతం రిజర్వేషన్‌ కేటాయించారు. అన్ని రిజర్వేషన్లలోనూ మహిళలకు మూడో వంతు కేటాయించాలని నిర్దేశించారు.
ఈ తరగతుల విభజన, వాటికి కో టాల నిర్ణయం ఆయా తరగతుల జనాభా ఆధా రంగా జరిగింది. అయితే 2021 జనగణన జరగనే లేదు గనుక, ఈ జనాభా లెక్కింపు ఏ ప్రాతిపదిక మీద జరిగిందో స్పష్టత లేదు. అలాగే ఇరవై ఐదు సంవత్సరాల కిందటి చట్టం నాలుగు తరగతులుగా విభజించిన జనాభాను ఇప్పుడు మూడు తరగతులుగా విభజించడానికి హేతుబద్ధత ఏమిటో, ఈ రెండు రకాల విభజనల మధ్య పోలికలు, తేడాలు ఏమిటో స్పష్టత లేదు.
ఆ సాంకేతిక సమస్యలు అలా ఉంచి, సమస్యను పునరావృతం చేయగల శక్తి ఉన్న మరొక అంశం ఉంది. ఇప్పుడు 15 కులాలనో, 18 కులాలనో, 26 కులాలనో ఒకే తరగతిగా కలిపి చూపారు గాని, ఆ తరగతిలోనే భిన్న కులాల మధ్య ఉన్న అసమానతలను పరిష్కరించే వ్యూహమేమిటో ఎక్కడా లేదు. తప్పనిసరిగా ఇప్పు డు ఒక గుంపుగా చేసిన ఉపకులాలలో కొన్ని కులాలకు ఇప్పటికీ విద్యలో, ఉద్యోగాలలో కనీస అవకాశాలు కూడా అంది ఉండవు. ఇప్పటికే ఎంతో కొంత అటువంటి అవకాశాలను అంది పుచ్చుకున్న కులాలు, తమ తరగతిలోనే మిగిలిన కులాలను అణగదొక్కి, ఇప్పుడు ఇస్తున్న మొత్తం రిజర్వేషన్‌ ను తాము మాత్రమే అనుభవించకుండా ఉంటాయనే హామీ లేదు. అలా అనుభ వించ కుండా అందరికీ ఫలాలు అందేలా చూసేందుకు విధి విధానాలు ఏమీ లేవు.
ఉదాహరణకు గ్రూప్‌ 1లో ఉన్న 15 కులాలలో జంగం, డక్కలి, మాత ంగి కులాలు, అదే గ్రూపులోని పంబాల, సంబన్‌ కులాల కన్నా ఎక్కువ ఫలాలు అందుకున్నాయని, గ్రూప్‌ 2లో అరుంధతీయ, మాదిగ కులాలు అదే గ్రూపులోని దండాసి, యాటల కులాల కన్నా ఎక్కువ ఫలాలు అందుకున్నాయని, గ్రూప్‌ 3లో ఆది ఆంధ్ర, మాల కులాలు, అదే గ్రూపులోని ఇతర కులాల కన్నా ఎక్కువ ఫలాలు అందుకున్నాయని ఒక దళిత పరిశోధకుడు రాశారు. ప్రస్తుత చట్టం గ్రూపుల మధ్య అసమానతను తొలగించడానికి, తగ్గిం చడానికి చేసిన ప్రయత్నం అభినందనీయమే గాని, ఇలా గ్రూపులోనే అంతర్గతంగా ఉన్న అసమానత తొలగించడానికి, తగ్గించడానికి అనుసరి ంచవ లసిన మార్గమేమిటో స్పష్టత లేదు. ఆ స్పష్టత లేకపోతే ఇప్పుడు వర్గీకరణ జరిగింది గనుక ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సమసి పోయినట్టు కనబ డవచ్చు గాని, ఒక దశాబ్దం తర్వాతనైనా గ్రూపు లోనే అంతర్గత అసమానతలపై అసంతృప్తులు, పునర్వర్గీకరణ కోసం ఆందోళనలు తప్పవు.
అలా తాత్సారంలో మునిగిపోయిన సమస్యకు 2024లో మరొకవైపు నుంచి సమాధానం దొరికింది. ఎప్పుడో నలబై సంవత్సరాల కింద పంజాబ్‌ లో జరిగిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యవహారం మీద సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల బెంచి 2014లో తీర్పు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ చట్టాన్ని కొట్టివేయడాన్ని సమీక్షించవలసి ఉందని సూచించింది. ఆ సమీక్ష చేయడానికి కూచున్న ఐదుగురు న్యాయమూర్తుల బెంచి, ఇది తమకన్న విస్తృతమైన ధర్మాసనం పరిశీలిచవలసిన జటిలమైన సమస్య అని అభిప్రాయపడిరది. అలా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆరుగురు 2024 ఆగస్ట్‌ 1న  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధమేనని, ఆమోదయోగ్యమేనని తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.
అస్పృశ్యత ప్రధాన ప్రాతిపదికగా షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపు జరిగినట్టే, విద్యా, ఉద్యోగావకాశాలలో నిరాదరణ, తిరస్కరణలను నిర్ధారించడానికి నిస్సందేహమైన ప్రమాణాలు అన్వేషించాలి. అవి కేవలం పేదరికం, విద్య, ఉద్యోగం వంటి కంటికి కనబడే పరిమాణాత్మక ప్రమాణాలు, ఆత్మగౌరవ అవమానం, వివక్ష వంటి కంటికి కనబడని గుణాత్మక ప్రమాణాలు మాత్రమే కావు. అసలు ఏ ప్రమాణాలను రూపొందించాలో, ఏ ప్రమాణాల ఆధారంగా ‘ఫలానా కులానికి రిజర్వేషన్‌ ఎక్కువ అవసరం, దానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి’ అనే సూత్రాన్ని తయారు చేయాలో పరిశోధించాలి.
ఇంతకు ముందు ప్రస్తావించిన పరిశో ధకులు మూడు అవసరమైన కొత్త ప్రమాణాలను ప్రతిపాదించారు. ఒక విద్యార్థి తన కుటుంబంలో విద్య అందుకుంటున్న మొదటి తరానికి చెందు తారా, రెండో మూడో తరానికి చెందుతారా అనేది ఒక ప్రమాణం కావాలని, మొదటి తరం విద్యలో ప్రవేశిస్తున్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మొదటి ప్రతిపాదన. ఆ అభ్యర్థి ప్రభుత్వ విద్యా రంగంలో చదువుకున్నారా, ప్రైవేట్‌ విద్యా రంగంలో చదువుకున్నారా అనేది ఒక ప్రమాణం కావాలనేది రెండో ప్రతిపాదన. ఆ అభ్యర్థి మొదటి తరం ఉద్యోగస్తులా, లేక ఆ అభ్యర్థి తల్లి దండ్రులో, అంతకన్నా పై తరం వారో ఇప్పటికే ఉద్యోగులుగా ఉన్నారా అనేది మరొక ప్రమాణం కావాలనేది మూడో ప్రతిపాదన. అవి కాకుండా మరేవైనా ప్రమాణాలు గాని, వాటితో పాటే మరే ప్రమాణాలైనా గాని ఎవరైనా సూచించవచ్చు.
మన సమాజంలో చారిత్రక, ఆర్థిక, సామాజిక, సాం స్కృతిక, రాజకీయ కారణాల వల్ల కొందరికి దొరికిన అవకాశాలు, మరి కొందరికి నిరాకరిం చబడిన అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటి మీద వివరమైన, సూక్ష్మమైన క్షేత్ర పరిశోధనలు, చర్చలు, సంభాషణలు జరిగితే గాని ఈ సమస్య నిజంగా పరిష్కారం కాదు. ఇంత జటిలమైన సామాజిక సమస్యను ఏదో ఒక చట్టం తోనో, తమ తమ కులాలను బట్టి ఒకరినొకరు దూషించు కోవడంతోనో, దుర్భాషలాడు కోవడంతోనో పరిష్కరించలేం. ఏదైనా సమస్య ఏదో ఒక రకంగా పరిష్కారం అయిపోతే చాలుననుకోవడం కాదు, అర్థవంతంగా, శాశ్వతంగా, పునరావృతం కాని రీతిలో పరిష్కారం అయిందా లేదా అనేది ప్రధానం.
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist