• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Monday, September 14, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

అప్పటి ఆవకాయ తొక్కులు ఇంట్లోనే తయారీ, తెలంగాణా గృహిణి రెండు రోజుల కృషి, యేడాదంటా భోజన ఖుషీ

Taza Cinema by Taza Cinema
2025-04-19
in Interviews
Reading Time: 1 min read
0 0
A A
కాకతీయ కలగూర గంప – 29
మామిడి కాయలను చిన్న భాగాలుగా చేసే ప్రత్యేక కత్తిపీట 

నిన్ననే నాభార్యామణీ, ఈ శీర్షిక సహ రచయిత్రి (చంద్రకీర్తి) వంట మనిషి తోడుగా నూతన సంవత్సర కానుకగా ఆవకాయ పచ్చడ్ల తయారీ కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి సాయంత్రం వరకు నాలుగు రకాలు చేయడంతో జయప్రద ముగింపు పలికింది. రాత్రి పడుకునేటప్పుడు ఈ ఆవకాయ పచ్చడి తయారీ కార్యక్రమం మా చిన్నప్పుడు 1950, 1960 దశకాలలో మా నాయనమ్మ దుర్గమ్మ గారి ఆధ్వర్యంలో జరిగే పద్థతి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు పెద్ద కుటుంబం. మా అమ్మా, నాన్నా, నాయనమ్మా, పిల్లలం మేము ఆరుగురం. వెరశి తొమ్మిది మంది. ఇకపోతే ఇంటికి తాత్కాలిక అతిథుతులుగా వచ్చే మా నాన్న సాహిత్య బృందం, మా కాకతీయ ప్రెస్ లోనే ముద్రింపబడే అప్పటి, ‘ధర్మ భూమి’, ‘విశ్వజ్యోతి’ సంపాదకులు కనకదండి చంద్రమౌళీశ్వర రావు, కటంగూరి నరసింహారెడ్డి గార్లు నెలకు 10 రోజుల ‘తిండీ – నిద్రా’ కార్యక్రమం మా ఇంట్లోనే.

వీరందరికీ ఆవకాయ పచ్చడి లేని భోజనం పెడితే బాగుంటుందా? బాగుందని అనుకుంటే అది సగం ఆకలి తీర్చే భోజనం అవుతుంది. ఇంత ఎందుకు? 1962 లో విజయవాడ పడమట నాస్తిక కేంద్ర మహోన్నతుడు శ్రీ గోపరాజు రామచంద్రరావు (గోరా) గారు వరంగల్ వచ్చి మా ఇంట్లోనే రెండు రోజులు వున్నప్పుడు, 1968 లో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ ఉద్యమ నేత శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు విశాఖపట్నం నుండి వరంగల్ వచ్చి మా నాన్న పాములపర్తి సదాశివరావు గారిని కలిసి ఉద్యమానికి సహకరించాలని కోరినపుడు ఆయన ఇక్కడ ఉన్న నాలుగు రోజులలో కనీసం ఒక్కసారి అయినా మా ఇంట్లో భోజ నం చేసి ఏదో ఒక రకం తెలంగాణ ఆవకాయ రుచి చూసినవారే!
ఇంతమందికి ఆవకాయ రుచి చూపించాలి గదా? కాబట్టి ఈ ఆవకాయ తొక్కుల తయారీ కార్యక్రమం కొంచెం పెద్ద ఎత్తునే జరిగేది. ఒకరోజు ముందు మార్కెట్ కు పోయి రెండు బస్తా సంచుల్లో మామిడికాయలు తెప్పించే వారు. గంగాళం, ఇంకో రెండు పెద్ద బిందెల్లో నీటిని నింపి అందులో ఈ మామిడికాయలను వేసి శుభ్రంగా కడిగేవారు. తరువాత మా ఇంట్లోనే వున్న మామిడి కాయలను ముక్కలుగా పగల కొట్టే ప్రత్యేక కత్తి పీటను వుపయోగించేవారు. అది పొడవైన, ఎక్కువ వెడల్పు, మందం గల బ్లేడ్ ను కలిగి వుండేది. ఈ మామిడికాయలు కొట్టే ప్రత్యేక కార్యక్రమం చూడడం మాకు ఒక మంచి వీక్షణ జ్ఞాపకం. మాకు గూడా ఆ ‘కాయ కొట్టే’ పని చేయాలని ఉత్సుకత వున్నా చేతి వ్రేలు గాయపరుచుకుంటామని మమ్మల్ని దూరంగా వుంచే వారు. కొట్టిన ముక్కల నుండి జీడి తీసేందుకు మాత్రం మమ్మల్ని ‘సరే’ అని రమ్మని అనే వారు.

ఇక అప్పటి మా నాయనమ్మ ప్రత్యేక ఆవకాయ పచ్చడ్ల పేర్లు: పెద్ద జాడీలలో నూనె ఆవ, లవంగాలు కలపిన మసాలా ఆవ, నీళ్ల ఆవ, బెల్లం ఆవ.
ఇక చిన్న జాడీ లలో చెక్కు తొక్కు, మాగాయ, వెల్లిపాయ ఆవ, నువ్వుల ఆవ. సరే మన తెలుగు వారి ప్రత్యేకం ఈ రకరకాల ఆవకాయల గురించి కండ్లు మూసుకొని ఆలోచిస్తూ వుంటే నిద్ర పట్టింది. కాసేపటికి ఎవరో తట్టి లేపారు. విసుక్కుంటూ కండ్లు తెరిచేసరికి నారద రూపంలో కాంతారావు గారు. సంతోషంగా ఆయనతో ‘భలే మంచిబేర మూ’ పాట పాడండని కోరాను. ‘నీ పాట చల్ల గుండా! ముందు నాతో రా’ అని చేయి పట్టుకొని ఆకాశంలో పైకి తీసుకు పోయాడు.

ఒక చోట ఆపి ‘ఇటు చూడు’ అని కుడి వైపు చూపించాడు. అక్కడ ఒక పూల విమానం వుంది. ఒక ఇరవై మంది కిందకు దిగుతున్నారు. వాళ్లను పన్నీరు చల్లుతూ ఒక సువర్ణ ద్వారం వైపు తీసుకు పోతున్నారు దేవ దూతలు. ఆ ద్వారం పైన ‘స్వర్గం – మీకిదే మా ఆహ్వానం’ అని రాసి వుంది. దాని క్రింద ‘మీకు లభ్యం అమృత పానం – అద్భుత ఆహార లభ్యత (ఒక్క ఆవకాయ తొక్కు తప్ప)’ అని రాసివుంది. ‘ఇక ఇటు చూడు’ అని ఎడమ వైపు చూపించాడు. అక్కడ గుంపులు గుంపులుగా జనం. అక్కడ ఒక నల్లని ఇనుప ద్వారం. దాని పైన రాసి వుంది. ‘నరకం- ఇక్కడ పడతాం మీ భరతం’ అని రాసి వుంది. దాని క్రింద ‘ తెలంగాణా మసాలా ఆవకాయనే మీ గతి (ఇంక ఏ కూరా దొరకదు)’ అని రాసి వుంది.

నేనన్నాను నారద కాంతారావుతో -‘ నిజమే. వీరికి ఇదే శాస్తి. ఇంతమంది పాపాత్ములు. ఆ కొద్ది మంది నిజంగా అమృత పానీయానికి, నందన వన పారిజాత సువాసన లకు అర్హులు’. ‘చూడవయ్యా, సరిగ్గా ఆ గుంపును. అందులో ముప్పావు భాగం మొన్న నే ముగిసిన మహా కుంభాభిషేకం లో పవిత్ర గంగా స్నానమాచరించి తమ పాప ప్రక్షాళన చేసుకున్న వారే. వారు కూడా వివిధ విమానాలలో స్వర్గ ద్వారం ముందు దిగి ఆహ్వానం అందుకున్న వారే.””మరి అటు వైపు పోకుండా ఇటు వెళ్తున్నారు ఏమిటి స్వామీ?’ అన్నాను అయోమయంగా. అసలే ఆయన నారదుడు. సమాధానం నోటితో ఎందుకు చెప్తాడు? ‘అటు చూడు’ అని చూపుడు వేలితో చూపించాడు.

ఇంతకు ముందే విమానం దిగిన ఆ ఇరవై మంది లో 15 మంది ‘ఆవకాయ లేని భోజనం మా కేందుకు? అమృతమూ వద్దు, ఆ పారిజాత సువాసనలూ వద్దు ఆవకాయనే మా మరణాత్మక మధురం’ అని వెనుదిరిగి పరుగెత్తి నరక ద్వారపు గుంపులో కలిశారు. ‘ఏమిటి మహాత్మా, ఈ విచిత్రం?’ అని అడిగిన నా భుజం తట్టి “ఏమీలేదు. ఆ మధ్య నరకంలోని వంట వాళ్లు యమధర్మరాజుతో ” ఈ పాపాత్ములకు మేము ఒక కూర, ఒక చారు రోజూ చేయడం మానివేయాలని నిర్ణయించుకున్నాం! ఎంత కాలం వీళ్లకు వండిబెట్టాలి?” అని స్ట్రైక్ నోటీసు ఇచ్చారు. యముడు ఆలోచించి విష్ణుమూర్తి అనుమతితో నలుగురు వంట వారిని స్వర్గానికి పంపించి దుర్గమ్మ గారి దగ్గర పలు రకాల ఆవకాయ పెట్టు ప్రక్రియల్లో శిక్షణ ఇప్పించాడు. అట్లాగే స్వర్గంలో ఆవకాయ వాడకం నిషేధించారు. శిక్షణ తర్వాత వారు తిరిగి యమ లోకానికి తిరిగి వచ్చి ఆరు నెలల కొక్కసారి ఆవకాయ లను పెట్టి దానిని కేవలం బ్రెడ్ తో పాపాత్ములకు పెట్ట సాగారు. వారికి పని భారం తగ్గింది. పాపాత్ము లకు “ఆహా బాగు, బాగు” అనిపించింది. స్వర్గ వాసుల జిహ్వలు చచ్చు బడ్డాయి. దుర్గమ్మ గారికి పచ్చడి పెట్టే శ్రమ తగ్గింది.

శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు.

Tags: Kakatiya Kalagura gampa
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist