ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మే 21వతేదీన ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని మావోయిస్టు కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోజు భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటిరోజని, ఆ రోజున దేశ ప్రధాని నరేంద్రమోదీ, దేశ హోంమంత్రి అమిత్ షాల ఆదేశాలను అనుసరించి భారత సైన్యం, పారామిలిటరీ, కమాండో బలగాలు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు నారాయణపుర్ జిల్లా, మాద్ ప్రాంతంలో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో తమ పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్ సహా పార్టీ, పీ.ఎల్.జె.ఏ.కు చెందిన వివిధ స్థాయి నాయకత్వ కామ్రేడ్స్ ను, సభ్యులను హత్యచేసాయనిమావోయిస్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జూన్ 11 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా బసవరాజ్ సహా 27 మంది అమరవీరుల స్మారకసభలు జరపాల్సిందిగా పిలుపునిచ్చారు.










