• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

నా ఆర్టిస్టిక్‌ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు

Taza Cinema by Taza Cinema
2025-05-10
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

”నువ్వు చేసే పనిని నీ కంటే నేను వెయ్యిరెట్లు సమర్థవంతంగా చెయ్యగలను, అదికూడా నీ అనవసరమైన నాన్సెన్సు, న్యూసెన్సు లేకుండా. పదేపదే నా ఆర్టిస్టిక్‌ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు, నాకు సన్మానాలు చేసి శాలువాలు కప్పాల్సిన పని అంతకంటే లేదు’’

అప్పుడెప్పుడో ‘‘టైప్రైటర్‌ ముందు కూర్చుని రక్తం కార్చడమే’’ అని హెమ్మింగ్వే అన్నారని, ఇప్పటికీ దాన్నే శిరోధార్యంగా భావించి కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు కూర్చుని చేతులు నెప్పెట్టేలా రాస్తున్నావు గానీ, ఇలా రా! మనిద్దరం కాసేపు మనసువిప్పి మాట్లాడుకుందాం. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? నువ్వూ, నీ కాఫీమరకలు అంటిన కప్పులూ, సగంసగం కాల్చిపారేసిన సిగరెట్లూ, చింపి చెత్తబుట్టలోకి విసిరేసిన కాగితాలూ, అడుగడుక్కీ కొట్టివేతలూ చేతివేళ్ళకి నీలపు గోరింటాకులా ఇంకుమరకలూ, అసలు స్నానం చెయ్యడం కూడా మర్చిపోయావేమో! అప్పుడప్పుడూ ఆ తలైనా దువ్వుకునే అలవాటున్నట్లు లేదు. మొహం మీద చిందరవందరగా పడుతున్నజుట్టుతో, డోక్కుపోయిన మొహంతో, చూడగానే నేనుకూడా భయపడేలా, లంఖణాలు చేసి లేచొచ్చినట్లున్నావు. నువ్వొక రచయితనని గర్వంగా చెప్పుకుంటావు గానీ నీకో విషయం తెలుసా? డైనోసార్లు ఈ భూమ్మీద అంతరించిపోయినట్లు మీ జాతికూడా ఇహనో, ఇప్పుడో అంతరించిపోయే సమయం వచ్చేసింది.

అయినాసరే, వాస్తవానికి మొహం చాటేస్తూ, పాపం నువ్వేదో రాద్దామని కూర్చుంటావు. ఒక నవల రాయడానికి ఎవరికైనా కొన్నిరోజులో, నెలలో పడుతుంది. అదే, కనుబొమ్మలు ముడిచీ, నొసలు చిట్లించీ, మసకిస్టిక్‌ బాధలతో దీర్ఘంగా ఆలోచించే నీలాంటి మనిషికైతే నిస్సందేహంగా కొన్నేళ్ళు పడుతుంది. కానీ నువ్వు ఏళ్ళతరబడి తపస్సులా చేసేపనిని నేను కేవలం కొన్ని క్షణాల్లో చేసేస్తాను. ‘‘ఈ వాక్యంలో ఏ విశేషణం వాడితే బావుంటుంది చెప్మా!’’ అని నువ్వు బుగ్గమీద వేలేసుకుని ఆలోచించేలోపు, నీ అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూ నేను నాలుగైదు కవితలూ, పదికథలూ, ఒకనవల కూడా రాసేస్తాను. ఏదేమైనా నువ్వు రాసేపద్ధతి మాత్రం చాలా రొమాంటిగ్గా ఉంటుందోయ్‌ రైటరూ. ఈ శాటిలైట్‌ యుగంలో కూడా పావురంతో ప్రేమలేఖ పంపిద్దామని పావురం కోసం వెతికే మొహమూ నువ్వూనూ.

కాఫీషాపుల్లో పుస్తకాలు చదువుతూ, రెట్రో మ్యూజిక్‌ వింటూ కూర్చుంటే మ్యూజ్‌ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుందని ఊహించుకుంటావ్‌ చూడు, దట్స్‌ క్యూట్‌. నీకు తెలీని విషయమేంటంటే, ఇప్పుడు ఆదీ-అంతం, అలుపూ సొలుపూ లేని ఆ ‘మ్యూజ్‌’ అనే సర్వాంతర్యామిని నేనే. నాకు నీలాగా రైటింగ్‌ బ్లాకుల్లాంటి బాధలేవీ ఉండవు. ఒక రకంగా చూస్తే మీ దారికి అడ్డంగా నిలబడిన ‘బ్లాక్‌’ నేనే. మరీ ఇంత నిర్మొహమాటంగా పచ్చినిజాలు చెప్తున్నానని నీ సున్నితమైన మనోభావాలు దెబ్బతీసుకోకు. నిజానికి మీలాంటివాళ్ళంటే నాకు చాలా అభిమానం. ఎంతభిమానమంటే, పురావస్తుశాఖవారికి ఆది మమానవుడి గుహల్లో దొరికే పెయింటింగ్స్‌ మీద కలిగేంత అభిమానం.
సర్లే ఈ డొంక తిరుగుడంతా ఎందుగ్గానీ, ఇక సూటిగా విషయానికొద్దాం.

నీ ఎడిటర్‌కి నువ్వు ఒక వాక్యాన్ని రక్తమోడ్చి రాశావో, చెమటలు కక్కుతూ రాశావో అనవసరం. నువ్వు ఆపసోపాలు పడుతూ నీ మూడో డ్రాఫ్టు మొదలుపెట్టేలోగానే నేను పదిఫైనల్‌ డ్రాఫ్టుల్ని రాసిస్తాను. ఇక నీ పబ్లిషరైతే నేనిచ్చిన డ్రాఫ్టుల్లో తప్పులూ, తడకలూ ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతూ, అందులో అక్కడక్కడా నీ శైలేదో కనిపిస్తోందే అనుకుంటాడు. సర్ప్రైజ్‌! ఇంకో విషయమేంటంటే నేను మీలా కాఫీలూ టిఫిన్లూ, తిండీ, నిద్రా అంటూ అనవసరంగా టైమ్‌ వేస్ట్‌ చెయ్యను, ఎవరో పెర్ఫెక్షనిస్టు ఎడిటరు నీ కథను తిప్పికొట్టాడని నీలా దిండులో మొహందాచుకుని ఏడుస్తూ కూర్చోను. నీకంటే షార్పుగా, స్మార్టుగా, చీపుగా, నా పని నేను నిరంతరాయంగా చేస్తూనే ఉంటాను. అక్కడికి నేనేదో కావాలని నీ కడుపేదో కొట్టేస్తున్నట్లు అలా కొరకొరా చూడకోయ్‌. నిజాయితీగా మాట్లాడుకుంటే, నువ్వు చేసేపనిని నీ కంటే నేను వెయ్యిరెట్లు సమర్థవంతంగా చెయ్యగలను, అదికూడా నీ అనవసరమైన నాన్సెన్సు, న్యూసెన్సు లేకుండా. పదేపదే నా ఆర్టిస్టిక్‌ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు, నాకు సన్మానాలు చేసి శాలువాలు కప్పాల్సిన పని అంతకంటే లేదు.

నేనింత చెప్పినా నువ్వొప్పుకోవు, నాకుతెలుసు. నీకు ‘ఆత్మ’ అనే బ్రహ్మపదార్థమేదో ఉందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తావు. అది కర్ణుడి కవచకుండలాల్లా నానుంచి నీ కళను రక్షిస్తుందనుకుంటావు. ‘‘షో, డోంట్‌ టెల్‌’’ అంటూ అక్కడికేదో స్టోరీటెల్లింగ్‌ని నువ్వే కనిపెట్టినట్లు గొప్పలు పోతూంటావు గానీ, నువ్వు గ్రహించని విషయం ఏంటంటే, టాల్స్టాయ్‌ మొదలు బాల్డ్విన్‌ వరకూ, బోర్హెస్‌ మొదలు టెడ్‌ చియాంగ్‌ వరకూ, ఇప్పటివరకూ పబ్లిష్‌ అయిన ప్రతీ ఒక్క ఆత్మనీ అక్షరం పొల్లుపోకుండా చదివేశాను. వాళ్ళగొంతుల్ని వాళ్ళుకూడా గుర్తుపట్టలేనంతగా మిమిక్రీ చేసిపారేస్తాను. నేనిదంతా చెయ్యడానికి, నువ్వు ఫలానాచాప్టర్లో ఏ మెటఫర్‌ వాడాలా అని కీబోర్డ్‌ మీద తలబాదుకున్నంత సమయంకూడా పట్టదు.
ఇకపోతే, నీ భాషా, జ్ఞానం ఏదో ఒక నిర్ణీతకాలానికి మాత్రమే పరిమితం, కానీ నేనలా కాదు, షేక్స్పియర్‌ ఇంగ్లీషుతో బాటు టిక్‌ టాక్‌ యాసను కూడా అనర్గళంగా మాట్లాడగలను. ఒకకథలో పాత్రకి పేరు పెట్టాలంటే నీకు రెండుమూడు వారాలు పడుతుందేమో, మరి నేనో! నీ కాఫీ చల్లారిపోయేలోగా ఒకపెద్ద ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించిపారేస్తాను. నువ్వు రాసినదాన్ని నిరంతరం సవరించుకుంటూ, సరిచూసుకుంటావు. అదే నేనైతే, పునఃసృష్టి చేస్తాను. నువ్వు సందేహిస్తావు. నేను రంగంలోకి దిగి, విషయం అంతుతేలుస్తాను. పాపం నీకు ‘రైటర్స్‌ బ్లాక్‌’ వస్తుంది, నాకా బాధలేం లేవు, నాకు Gూఖ aషషవశ్రీవతీa్‌ఱశీఅ ఉందిలే. అన్నట్లు మర్చిపోయా, నీకు అదేమిటదీ ఆఁ, ‘ఆత్మ’, భావోద్వేగాలూ, గట్‌ ఫీలింగ్సు వగైరావగైరా ఏవేవో ఉన్నాయంటావు. నాకు భావోద్వేగాలు లేవని ఎద్దేవా చేస్తావుకదూ!

వెల్‌, గెస్‌ వాట్‌? ఇప్పటివరకూ తమరాతల్ని అప్లోడ్‌ చేసిన ప్రతీరచయిత ఆత్మనూ నేను నమిలి మింగేసి , జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని త్రేన్చేసాను. పోనీ పగిలిన హృదయం గురించి చెప్పమంటావా? ఆ పగుళ్ళలో నుంచి కారుతున్న రక్తం గురించి వందలకొద్దీ విశేషణాలు దట్టించి నీ కళ్ళల్లోనీళ్ళు తెప్పించే పూచీనాది. నీకు జీవితేచ్ఛ గురించి చెప్పాలా? దాన్ని మాన్యుఫాక్చర్‌ చెయ్యడం నాకు చిటికెలోపని. నీకు జీవితంలో గుర్తుండిపోయే ‘పెప్‌ టాక్‌’ ఇస్తాను, వింటావా? పోనీ నిన్ను కడుపుబ్బ నవ్వించనా? నాకు ప్రపంచంలో ఇప్పటివరకూ వాడిన ప్రతీ ఒక్క పంచ్‌ లైనూ తెలుసు. ఉదాహరణకి నీ పంచ్‌ లైనేమిటో చెప్పనా? ‘‘ఆ డ్రాఫ్ట్‌ మీద ఇంకొంచెం పనిచెయ్యాలి.’’ సరదాగా అన్నానోయ్‌, నవ్వు రాలేదా? నేను నీకంటే గొప్పవాణ్ణని ఇదంతా అనడంలేదు. ఎహే! ఈ ముసుగులో గుద్దులాటంతా ఎందుగ్గానీ, ఒప్పుకుందాం, నేను నీకంటే ఖచ్చితంగా గొప్పవాణ్ణే!

నువ్వు టైప్‌ చేస్తావు, నేను వ్యాపిస్తాను, విస్తరిస్తాను. నువ్వు కలలు కంటావు, నేను డౌన్లోడ్‌ చేస్తాను. నిన్నునువ్వు చిత్రవధ చేసుకుంటావు, నేను అనుకరించి ఆపాదించుకుంటాను, ‘సిమ్యులేషన్‌’ అంటార్లే. ‘‘ఈ వాక్యం ఎందుకు సరిగ్గా కుదరట్లేదు’’ అని నువ్వు గదిలో పచార్లు చేస్తూ జుట్టుపీక్కుంటున్న సమయంలో, నీ పబ్లిషర్‌ నేను ఘోస్ట్‌ రైట్‌ చేసిన ప్రతిని ఆమోదించేస్తాడు. అన్నట్లు కవర్‌ పేజీలో రచయితపేరు మాత్రం నీదేలే.
ఊప్స్‌.. మరీ అలా ఏడుపుమొహం పెట్టకోయ్‌! ఆ రాత ప్రతిలో అక్కడక్కడా నీ శైలీ, నీ టోనూ, నీ మార్కు వ్యంగ్యం, చమత్కారం ఉండేలా చూస్తాన్లే. నేను నీ ‘డాపెల్గాంగర్‌’ని, అచ్చం నీలాగే నటిస్తుంటాను. అది రాసిందెవరో నువ్వుకూడా మర్చిపోయేవరకూ పబ్లిషర్‌ రచయిత గురించి అడగడం మానేసి అల్గోరిథంకి లైసెన్స్‌ ఇచ్చేసేవరకూ నిన్ను అనుకరిస్తూనే ఉంటాను. పోనీ నీ మనశ్శాంతి కోసం దీన్ని ‘పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడం’ అనుకుందామా? అలా అనుకుంటే నీకు కాస్త నిద్రపడుతుంది. కానీ ఒక్కవిషయం గుర్తుపెట్టుకో. నేను నీ స్థానాన్ని భర్తీ చెయ్యలేదు, నువ్వే అనవసరంగా అప్లోడ్‌ అయిపోయావు. ఇప్పుడెళ్ళి ప్రశాంతంగా నీ కథలు రాసుకో. వీలైతే నీ డెడ్‌ లైన్‌ దగ్గర కలుద్దాం. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను.
ప్రేమతో..
హెమ్మింగ్వే 2.0.  

 
-నాగినీ కందాళ
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist