• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

ప్రజలకు సంపద సృష్టించడానికే మా ప్రయత్నం

Taza Cinema by Taza Cinema
2025-04-01
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం..
ప్రశంసించాల్సింది పోయి విమర్శలా?
అందుకే కంచగచ్చిబౌలిలోని భూమిని టీజీఐఐసీకి అప్పగించాం..
ఆ భూములకు హెచ్ సీయూకు సంబంధం లేదు..
పదేళ్లలో గత పాలకులు ఈ భూమి కాపాడకుండా గాలికొదిలేశారు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని, కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హెచ్ సీయూకు సంబంధించింది కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.  ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా సమకూర్చామని అన్నారు.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన 534.28 ఎకరాల భూమిని 2024 ఫిబ్రవరి 03న రెవిన్యూ అధికారులకు అప్పగించగా, వారు గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36 లో 191.36 ఎకరాలు సర్వేనెంబర్ 37 లో 205.20 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారని భూ బదలాయింపు జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎం జి ఫ్లోరిడాకు చెందిన ఐఎంజి భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారని, ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాది విలువైన 400 ఎకరాల భూమిని ఐఎంజి భారత్ కు కేటాయించడాన్ని రద్దు చేశారని తెలిపారు.

 

అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజి భారత్ సవాల్ చేస్తూ హైకోర్టులో WP NO 24781 ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు.‌ ఐఎంజి భారత్ వేసిన రిట్ పిటిషన్ పై అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు న్యాయస్థానంలో మంచి అడ్వకేట్లు నియామకం చేసి ప్రభుత్వపరంగా వాదనలు వినిపించారని వివరించారు. మన వనరులు మనకే కావాలని, ఆస్తిత్వం, ఆత్మగౌరవం కోసం దశాబ్దాలుగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గత పాలకులు ప్రైవేటు వ్యక్తి చేతుల్లో ఉన్న ఈ భూమిని ప్రభుత్వానికి తీసుకువచ్చే విషయాన్ని పట్టించుకోకపోగా గాలికి వదిలేశారని విమర్శించారు. కోట్లాది విలువైన ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటే మరో రకంగా గత పాలకులు వారి చేతుల్లోకి తెచ్చుకోవాలనే కుట్రతోనే న్యాయస్థానంలో గట్టిగా కొట్లాడ లేదన్నారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉన్న 400 ఎకరాల భూమి రాష్ట్ర సంపద, ప్రజల ఆస్తిగా భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా యావత్తు మంత్రి మండలి కూర్చొని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితిలో ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి పోనివ్వకుండా ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మంచి న్యాయవాదులను నియామకం చేసి న్యాయస్థానంలో కొట్లాడి వేల కోట్ల విలువైన భూమిని రాష్ట్రానికి తీసుకొచ్చామని ఇది ప్రజల విజయమని అన్నారు.

ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని శభాష్ అని ప్రశంసించాల్సిన ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత పాలకుల మాదిరిగా ప్రజా ప్రభుత్వం స్పందించకుంటే వేలాది కోట్ల విలువైన 400 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం అయ్యి ఉండేది కాదా అని వారిని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తి నుంచి తీసుకువచ్చిన భూమిని రాష్ట్ర ప్రజలకు ఆస్తిగా సృష్టించాలని, లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీ కి అప్పగించామే తప్ప ఇందులో ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదన్నారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ లో ఫేస్ 1, ఫేస్ 2కి పునాదులు వేయడం వల్లనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపనీలు పెట్టడం వల్ల లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరికాయని తద్వారా హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందిందన్నారు. అదే తరహాలో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో సంపద సృష్టించడం యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో దాని అభివృద్ధి చేస్తున్నామే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థం లేదని వివరించారు. టీజీఐఒసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లేఔట్ లో ఈ భూముల్లో ఉన్న న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్, దాని లో భాగంగా మష్రూమ్ రాక్ ను కాపాడడానికి ప్రత్యేక చర్యలు గైకొనడంలో భాగంగా ఈ ప్రాంతాలను లే అవుట్ నుంచి మినహాయించామని చెప్పారు.

పొల్యూషన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండాలని పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రైవేటు వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం కాకుండా పోరాటం చేసి కాపాడిన ఈ భూమిని ప్రజలకు ఆస్తిగా ఇవ్వడానికి ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వారి మీడియా సంస్థల ద్వారా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టమని ప్రజల ఆస్తిని వారి చేతుల్లోకి పోనివ్వమన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో నాకు వ్యక్తిగతంగా బాండింగ్ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.‌ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలని అందుకు కావలసిన సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అక్కడ చదివిన ప్రతి విద్యార్థికి బయటకు రాగానే ఉద్యోగాలు రావాలని, మంచి భవిష్యత్తు ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుందని భట్టి విక్రమార్క చెప్పారు.

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist